సబ్ ఫీచర్

సన్‌స్క్రీన్ తప్పనిసరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎండలు ముదురుతున్నాయి. ఎండల నుంచి రక్షణ పొందాలంటే సన్‌స్క్రీన్ లోషన్ తప్పనిసరిగా రాసుకోవాలి. ఇది రకరకాల సమస్యల నుంచి కాపాడుతుంది. ఎండలో ముఖ్యంగా యూవీ-ఎ, యూవీ-బి అనే కిరణాలు ఉంటాయి. యూవీ-ఎ కిరణాల వల్ల చర్మం కమిలిపోదు కానీ వలయాలు రావచ్చు. ఇవి క్యాన్సర్‌కీ కారణమవుతాయి. యూవీ-బి వల్ల చర్మం కందిపోయినట్టు అవుతుంది. అద్దాల నుంచి ఈ కిరణాలు లోపలికి ప్రసరిస్తాయి. ఈ రెండు కిరణాల నుంచి సన్‌స్క్రీన్‌లో సినమేట్స్, సులిసోబెంజాన్, జింక్ ఆక్సైడ్, ఏవో బెంజాన్, టైటానియం డయాక్సైడ్ వంటివి ఉంటాయి. అలాగే ఎండ నుంచి రక్షణ ఎస్‌పీఎఫ్ అందిస్తుంది. ఎస్‌పీఎఫ్ 30 ఉంటే చర్మంపై 97 శాతం కిరణాల ప్రభావం ఉండదు. అదే 15 ఉంటే చర్మంపై తొంభై శాతం పనిచేస్తుంది. ఇవి రెండూ చర్మ కేన్సర్లను దరిచేరకుండా కాపాడతాయి. యూవీ-ఎకి ఎస్‌పీఎఫ్ శాతానికి సంబంధం ఉండదు. దీన్ని అందులో వాడిన ఏవో బెంజాన్, ఆక్సీ బెంజాన్, టైటానియం డయాక్సైడ్, జింక్ ఆక్సైడ్ ఆధారంగా ఎంచుకోవాలి. అలాగే ఈకాలంలో చెమట, నీటిని నిరోధించే అంటే వాటర్ రెసిస్టెంట్ సన్‌స్క్రీన్‌లను ఎంచుకోవాలి. నీళ్లలో ఈతకొట్టేవారు తప్పకుండా ప్రతి ఇరవై నిముషాలకోసారి దీన్ని రాసుకోవాలి. మిగతావారు ప్రతి రెండుగంటలకోసారి రాసుకోవాలి. సున్నితచర్మం, అలర్జీలు, రొసేషియా ఉన్నవారు పిల్లల సన్‌స్క్రీన్‌లు వాడాలి. టైటానియం డయాక్సైడ్ ఉంటే వాడొచ్చు. ఎగ్జిమా, డెర్మటైటిస్ ఉన్నవారు పరిమళాలు, ప్రిజర్వేటివ్‌లు ఉన్నవి ఎంచుకోకపోవడం మంచిది. పొడిచర్మం ఉన్నవారు మాయిశ్చరైజర్ ఉన్న సన్‌స్క్రీన్‌లు ఎంపిక చేసుకోవాలి. *