S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/24/2020 - 06:05

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ల మూడు రోజుల నష్టాల పరపరంపరకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. బ్యాంకింగ్, ఇంధన స్టాక్స్ అత్యధికంగా లాభపడ్డాయి. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో తీవ్ర అమ్మకాల వత్తిడి నెలకొన్నప్పటికీ ఇక్కడ ఆ ప్రభావం కనిపించలేదు. బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 271.02 పాయింట్లు (0.66 శాతం), బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ 73.45 పాయింట్లు (0.61 శాతం) లాభపడ్డాయి.

01/24/2020 - 06:04

హైదరాబాద్, జనవరి 23: బొగ్గు ఉత్పత్తి, రవాణాలో ప్రపంచ ఖ్యాతిని సంపాధించిన సింగరేణి సంస్థ మరో ముందడుగు వేసింది. సింగరేణితో పాటు ఒడిస్సాలో ఉన్న నైనీ, న్యూ పాత్రపాద బొగ్గు బ్లాకుల నుంచి బొగ్గు ఉత్పత్తి, రవాణాకు శ్రీకారం చుట్టనున్నది. ఒడిస్సా బొగ్గు గనులకు సంబంధించిన అనుమతులను కేంద్రం మంజూరు చేసింది.

01/23/2020 - 23:22

న్యూఢిల్లీ, జనవరి 23: గెయిల్, ఆయిల్ ఇండియా లిమిటెడ్, పవర్‌గ్రిడ్ వంటి టెలికామేతర సంస్థల నుంచి రూ. 3 లక్షల కోట్ల మేర బకాయిలు వసూలు చేయాలని టెలి కమ్యూనికేషన్ శాఖ నిర్ధారించడం కేవలం సమాచార లోపం వల్ల జరిగిన పొరబాటని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. వాస్తవానికి ఆ సంస్థలు ప్రభుత్వానికి ఎలాంటి బకాయిపడి లేవని తెలిపారు.

01/23/2020 - 23:20

దావోస్, జనవరి 23: భారత దేశ ఆర్థిక స్థితి ఇక పుంజుకుంటుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ధీమా వ్య క్తం చేశారు. తమ దేశంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని, విదేశీ మదుపర్లలో ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచ ఆరి థక ఫోరం (డబ్ల్యుఈఎఫ్) వార్షిక శిఖరాగ్ర సదస్సులో భాగంగా ‘వ్యూహాత్మక దృక్పథం’ అనే అంశంపై జరిగిన సెషన్‌లో ఆయన గురువారం నాడిక్కడ పాల్గొని ప్రసంగించారు.

01/23/2020 - 05:39

న్యూఢిల్లీ: ప్రపంచ నంబర్ వన్ సౌర విద్యుత్ ఉత్పాదక సంస్థగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు అదానీ గ్రూప్ సంస్థల అధినేత బిలియనీర్ గౌతం అదానీ బుధవారం నాడిక్కడ తెలిపారు. 2025 నాటికి తమ సంస్థను అం తర్జాతీయ స్థాయిలో సౌర విద్యుత్ ఉత్పాదక ఆగ్రగామిగా నిలపాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్నామని, అలాగే 2030 నాటికి అతిపెద్ద సాంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి సంస్థగా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

01/23/2020 - 05:10

హైదరాబాద్, జనవరి 22: దక్షిణ మధ్య రైల్వేకి ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా కాసుల వర్షం కురిసింది. ఈనెల 11 నుంచి 20వ తేదీ వరకు దక్షిణ మధ్య రైల్వే దాదాపు కోటి మంది ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరవేసింది. ప్రయాణికుల చేరవేతతో రైల్వేకి రూ.46 కోట్లు ఆదాయం వచ్చింది. ఈనెల 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సంక్రాంతి పండుగ సందర్భంగా దాదాపు 456 రైళ్లను నడిపింది.

01/23/2020 - 05:02

హైదరాబాద్, జనవరి 22: డిజిటల్ సొమ్ము చెల్లింపుల్లో తెలంగాణ రాష్ట్రం దూసుకెళుతోంది. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడైనట్లు పే వరల్డ్ సంస్థ పేర్కొంది. ఈ వ్యవస్థ ద్వారా 200,897 మంది రిటైలర్లు నమోదు చేసుకున్నారు.

01/22/2020 - 23:20

ముంబయిలో బుధవారం ఆల్ట్రా జోన్ ప్రీమియం కార్లను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్న టాటా మోటార్స్ ప్రతినిధులు. 5.29 లక్షల నుంచి ఈ కార్ల ధరలు మొదలవుతాయి.

01/22/2020 - 23:17

ముంబయి, జనవరి 22: నష్ట భయాలు వరుసగా మూడోరోజూ మదుపర్లను వెంటాడాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లకు నష్టాల బెడద కొనసాగింది. అంతర్జాతీయ ఏజెన్సీలు దేశ స్థూల వ్యవసాయోత్తి (జీడీపీ) వృద్ధిరేటును తగ్గించడం, కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు బలహీనంగా ఉండడం వంటి అంశాలతోబాటు రాబోయే కేంద్ర బడ్జెట్‌పై అందరి నిశిత దృష్టీ కేంద్రీకృతం కావడమే ఇందుకు కారణాలు.

01/22/2020 - 23:16

న్యూఢిల్లీ, జనవరి 22: కేంద్ర బడ్జెట్ సమావేశాలు జరిగే ఫిబ్రవరి 1వ తేదీ శనివారం స్టాక్ మార్కెట్లు పనిచేస్తాయని, సాధారణ వాణిజ్య కార్యకలాపాలు సాగుతాయని బాంబే స్టాక్ ఎక్చేంజీ (బీఎస్‌ఈ) బుధవారం నాడొక ప్రకటనలో తెలిపింది. స్టాక్ మార్కెట్ల వాణిజ్య వారం సాధారణంగా శుక్రవారంతో ముగుస్తుంది. శని, ఆదివారాలు సెలవు దినాలు.

Pages