S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధనం మూలం

06/22/2019 - 18:31

‘35 ఏళ్ల వయసులో మిలియనీర్ అవుతాను. లేదంటే నగరంలోని పెద్ద భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటాను. ’

06/15/2019 - 17:41

తిరుపతికి వెళ్లాలి అంటే ఒక మధ్యతరగతి కుటుంబం కనీసం రెండు నెలల ముందు ఒక ప్రణాళిక రూపొందించుకుంటుంది. దైవదర్శనానికి, వసతి, ప్రయాణం, ఇవన్నీ సాఫీగా సాగాలి అంటే కనీసం రెండు మూడు నెలల ముందు నుంచి ప్రణాళిక చేసుకుంటేనే తిరుపతి యాత్ర విజయవంతం అవుతుంది. ఎలాంటి ఏర్పాట్లు చేసుకోక పోయినా అప్పటికప్పుడు కూడా తిరుపతికి వెళ్లవచ్చు. రైలులో నిలబడి రోజంతా ప్రయాణం చేయాలి. దైవదర్శనానికి రోజంతా క్యూలో నిలబడాలి.

06/03/2019 - 22:22

కైజెన్ జపాన్ పదం. దీని గురించి విన్నారా? సరిగా అర్థం చేసుకుంటే కైజెన్ మీ జీవితాన్ని మార్చేస్తుంది. మిమ్ములను ఆరోగ్య వంతులుగా మారుస్తుంది. సంపన్నులను చేస్తుంది. మీకున్న చెడు అలవాట్లు అన్నీ కైజెన్ విధానంలో వదిలేయవచ్చు, ఆరోగ్య కరమైన అలవాట్లు అలవర్చుకోవచ్చు. ఇంట్లో రాగిరేకులు కట్టుకుంటే సంపద వస్తుంది, చైనా వాస్తు మిమ్ములను ఎక్కుడికో తీసుకు వెళుతుంది అనే ప్రచారానికి లోటు లేదు.

05/25/2019 - 19:02

వినోద్‌కు తన జీవితం మీద విరక్తి కలుగుతోంది. బాస్ రోజురోజుకూ వేధిస్తుండడంతో ఉద్యోగం మానాలనిపిస్తోంది కానీ మానలేని పరిస్థితి. ఛీ..్ఛ.. ఇదేం జీవితం అని తనపై తానే జాలిపడుతున్నాడు. ఈ క్షణమే ఉద్యోగం వదిలిపెట్టాలని ఉంది కానీ వదల లేని పరిస్థితి. మన కన్నా బానిసలకు ఎంతో కొంత ఎక్కువ స్వేచ్ఛ ఉండేట్టుగా ఉంది అని మిత్రుల వద్ద వాపోయాడు. వినోద్ లాంటి వారు మనకు ప్రతిచోట కనిపిస్తారు. ప్రతి చోట కాదు.

05/18/2019 - 20:15

అన్నింటికీ ఒక వయసును నిర్ణయించారు. స్కూల్‌లో చేర్పించాల్సిన వయసు, మైనారిటీ తీరే వయసు, ఓటుకు వయసు ఉంది. పెళ్లి చేసుకోవడానికి కూడా ప్రభుత్వం వయసు నిర్ణయించింది. రిటైర్‌మెంట్‌కు కూడా నిర్ణీతమైన వయసు ఉంది. అలానే ఇనె్వస్ట్‌మెంట్‌కు ఏది సరైన వయసు అనే సందేహం చాలా మందికి ఉంటుంది. పిల్లలకు డబ్బుల గురించి చెప్పవద్దు అది పిల్లలకు సంబంధించిన అంశం కాదు అనేది చాలా మంది అభిప్రాయం.

05/11/2019 - 19:24

ఎన్టీఆర్ హీరోగా 1963లో లక్షాధికారి అని ఓ సినిమా వచ్చింది. ఎన్టీఆర్ ఎలా నటించారు, సినిమా హిట్టయిందా? లేదా? కథ ఏంటి? ఈ విషయాలు మనకు ఇప్పుడు అవసరం లేదు కానీ విషయం ఏమిటంటే 1963 అంటే ఐదున్నర దశాబ్దాల క్రితం లక్ష రూపాయలు ఉంటే సంపన్నులు అన్నట్టు. ఇప్పుడు మనం సంపన్నులు, శ్రీమంతులు అని చెబుతున్నాం కానీ నాలుగైదు దశాబ్దాల క్రితం సంపన్నులను లక్షాధికారి అని వ్యవహరించేవారు.

05/04/2019 - 17:29

అభిమాన హీరో సినిమా మొదటి రోజు మొదటి ఆట చూడడంలో ఉన్న థ్రిల్ ఎందులోనూ ఉండదు. మీరు చదువుకునే రోజుల్లో అలా మొదటి రోజు మొదటి ఆటకు వెళ్లిన అనుభవాలు మీకున్నాయా? చదువుకునే రోజుల్లో కొంత మంది ఇలా మొదటి రోజు మొదటి ఆటకు వెళ్లడమే కాదు కొందరు ఏకంగా తమ అభిమాన హీరో సినిమా విడుదలకు ముందు రోజు సినిమా హాలును కడిగి, అలంకరించే వారు. హీరో కటౌట్‌ను పాలతో కడిగి పూల మాలలు వేసేవారు.

04/27/2019 - 20:09

చిన్నప్పటి కథలు కొన్ని మనకు ఇప్పటికీ గుర్తుంటాయి. మన ఆలోచనలపై ప్రభావం చూపుతాయి. ఒక వ్యక్తికి బంగారు నాణాల పాత్ర ఒకటి దొరుకుతుంది. ఆ పాత్ర కొద్దిగా ఖాళీగా ఉంటుంది. తన జీవితంలో ఊహించనంత బంగారం ఒకేసారి చూసే సరికి ఆ వ్యక్తికి మతిపోయినంత పనవుతుంది. ఆ బంగారు పాత్రను చూసి రకరకాలుగా ఆలోచిస్తాడు.

04/20/2019 - 19:27

‘‘ఈ రోజుల్లో కూడా కులాలు ఉన్నాయా? కులాలు, మతాలు మనం సృష్టించుకున్న కృత్రిమ గోడలు. నిజానికి ఇవేమీ లేవు.’’ చాలా మంది మేధావుల నుంచి ఇలాంటి మాటలు తరుచుగా వినిపిస్తుంటాయి. ఒకవైపు కుల సంఘాలకు నాయకత్వం వహిస్తూ మరోవైపు ఈ రోజుల్లో కూడా కులాలా? అని మనం నిర్మొహమాటంగా చెప్పగలం. కులాలు లేని సమాజం ఏర్పడాలని కోరుకుందాం తప్పు లేదు. కానీ అవి ఉన్నాయి అనేది వాస్తవం.

04/13/2019 - 18:58

‘‘మా ఇంటిపై నరదిష్టి పడింది. ఎవరి కన్నుకుట్టిందో కానీ ఇబ్బందులన్నీ మాకే. జీతం రాగానే అస్సలు డబ్బులు మిగలడం లేదు. పిల్లలు పెద్దవారవుతున్నారు. వారి చదువులు, ఇతర ఖర్చులు తలుచుకుంటే భయమేస్తుంది’’
‘‘మరేం చేద్దామనుకుంటున్నారు.?’’

Pages