S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ధనం మూలం
ధనం మన చేతిలోని ఓ ఆయుధం. ఈ ఆయుధాన్ని ఎలాగైనా ప్రయోగించవచ్చు. ఆయుధాన్ని ప్రయోగించడం తెలిసిన వారికి ఇదో వజ్రాయుధంగా నిలుస్తుంది. అది తెలియని వారి చేతిలో భస్మాసుర హస్తంగా మిగిలిపోతుంది. ఇది రెండు వైపులా పదునైన ఆయుధం.
ఒక పొరపాటుకు యుగములు వగచేవు- అంటాడో సినీ కవి. తారలకే కాదు ఏ రంగంలో ఉన్న వారికైనా మనుషులందరికీ ఇది వర్తిస్తుంది. ఒక పొరపాటు జీవితాన్ని తలక్రిందులు చేస్తుంది. పేదరికంలో పుట్టి సంపన్నులుగా ఎదిగిన వారు ఎందరో ఉన్నారు. కానీ సుదీర్ఘ కాలం మహరాణిలా బతికి, చివరి రోజుల్లో దీనంగా బతకడం వంటి కష్టాలు పగవాడికి కూడా వద్దు అనిపిస్తుంది.
లక్ష్మి, సరస్వతి .. ఈ ఇద్దరూ ఒకరున్న చోట మరొకరుండరు అంటారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న కాలం ఇది. ఎక్కడ సరస్వతీ దేవి ఉంటే అక్కడ లక్ష్మీదేవి కూడా ఉంటోంది. ఒకప్పుడు సంపన్నుల సంతానం మాత్రమే ధనికులు. ఇప్పుడు సరస్వతి కటాక్షం ఉంటే లక్ష్మి వారిని వెతుక్కుంటూ వస్తోంది.
నిదానమే ప్రధానం - ఆలస్యం విషయం
ఈ రెండు మాటలు చెప్పింది మన పెద్దలే. నిదానం ప్రధానం అంటూనే ఆలస్యం అమృతం విషయం అంటారు. రెండింటిలో ఏది పాటించాలి అనేది కొందరి సందేహం అయితే, పెద్దలిలానే చెబుతారు. వారి మాటలు పాటించాల్సిన అవసరం లేదు అనేది కొందరి జోకులు. రెండూ అక్షర సత్యాలే. ఏ సమయంలో ఏ మాట పాటించాలి అనే నిర్ణయంలోనే మన విజ్ఞత దాగి ఉంటుంది.
డబ్బులు ఊరికే రావు అంటూ ఈ మధ్య ఒక బంగారు నగల వ్యాపారి ప్రచారం అందర్నీ ఆకట్టుకుంది. అతని బంగారు షాపు ముందు కొత్త సినిమా విడుదలైనప్పుడు కనిపించేంత జనం చేరారంటే ఆ ప్రకటన ఎంతగా ప్రభావం చూపిందో అర్థం అవుతుంది. డబ్బులు ఊరికే రావు అని అతను చెబుతున్నా... పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి నగలు కొనేందుకు ఎగబడ్డారు.
హలో డ్రాలో మీ సెల్ నంబర్ లక్కీ నంబర్‌గా తేలింది. లక్ష్మీదేవి రాగిరేకులు అందరికీ రెండు వేలు మీకు డ్రాలో వచ్చింది కాబట్టి ఆరు వందలకే ఇస్తాం. డబ్బులు చెల్లించండి ఇంటికి రాగిరేకులు వచ్చేస్తాయి. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. అదృష్టం మిమ్ములను వరిస్తుంది.
***
58ఏళ్లకు రిటైర్‌మెంట్. దేశంలో సగటు ఆయుఃప్రమాణం 70 సంవత్సరాలు. అంటే రిటైర్ అయ్యాక సగటున పనె్నండేళ్లపాటు జీవితం ఉంటుంది. ఇది సగటు లెక్క మాత్రమే. ఇతర వ్యక్తుల కన్నా కచ్చితమైన ఆదాయం ఉండే ఉద్యోగ వర్గాల జీవిత కాలం ఇంకా ఎక్కువే ఉంటుంది. క్రమంగా ఆయుః ప్రమాణం ఇంకా పెరుగుతూనే ఉంది. గమనించారా?
డబ్బు సంపాదించడం నేరమా? సంపన్నులంతా నేరస్తులేనా? పేదరికం వరమా? మీరు పేదరికాన్ని ప్రేమిస్తున్నారా? డబ్బును ద్వేషిస్తున్నారా? నిజానికి పైకి డబ్బును, సంపన్నులను ద్వేషిస్తున్నట్టు కనిపించే వారు సైతం మనసులో వీటిని విపరీతంగా ప్రేమిస్తుంటారు.
‘‘మీకు రెండవ ఆదాయం ఉందా?’’
‘‘మాది మీలా ప్రభుత్వ ఉద్యోగం కాదు రెండవ ఆదాయం ఉండేందుకు. మీకేం అదృష్టవంతులు. ఒక చేయితో కాదు రెండు చేతులా సంపాదిస్తారు. ’’
‘పిల్లలు సమర్ధులు అయితే వారి కోసం తల్లిదండ్రులు సంపాదించి పెట్టాల్సిన అవసరం ఏముంది? వారే సంపాదించుకుంటారు.
ఒకవేళ పిల్లలు అసమర్థులు, సంపాదించింది నిలుపుకోలేని అసమర్ధుల కోసం తల్లిదండ్రులు సంపాదించి పెట్టడం ఏందుకు?’ అంటూ యాంగ్రీ యంగ్ మెన్‌గా మూడు దశాబ్దాల క్రితం ఓ సినిమాలో అమితాబ్ చెప్పిన డైలాగు అప్పట్లో బాగా పాపులర్.