S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధనం మూలం

11/23/2019 - 23:42

‘పేదలు పేదలుగానే మిగిలిపోతున్నారు, సంపన్నులు మరింత సంపన్నులు అవుతున్నారు. ఎంత కాలమిది. ఎందుకీ ప్రజాస్వామ్యం. అంబానీ సంపద నానాటికి పెరిగిపోతోంది. పేదలు అప్పుల్లో మునిగిపోతున్నారు.’ ఇలాంటి డైలాగులు మనం చాలా సార్లు విని ఉంటాం. కథల్లో, సినిమాల్లో, సీరియల్స్‌లో, నాయకుల ఉపన్యాసాల్లో ఇవి సర్వసాధారణం. చాలా మంది మేధావులు, రచయితలు పేదరికాన్ని గ్లోరిఫై చేస్తుంటారు.

11/16/2019 - 23:34

ఏదీ శాశ్వతం కాదు.. అంటే ఇదేదో మెట్టవేదాంతం అనిపిస్తోంది. కాదు టెక్నాలజీ పెరిగిన తరువాత, ప్రపంచం ఒక గ్రామంగా మారిన తరువాత మన జీవితాల్లో ఏదీ శాశ్వతం కాదు అనేది అర్థం అవుతోంది.
***
ఆ దేవుడు మనల్ని చల్లగా చూడాలని మొక్కుకుంటాం. మరి మనల్ని చల్లగా చూసే దేవుడి గుడిలో పూజాపునస్కారాలు జరగాలి అంటే...

11/09/2019 - 18:56

కాగ్నిజెంట్ ఐటి కంపెనీలు ఒకేసారి పదమూడు వేల మంది ఉద్యోగులను తొలగించారు. ఆర్థిక మాంధ్యం ప్రభావం అని కొందరి వాదన. కాదు కింద స్థాయిలో ఉద్యోగుల పనితీరు బాగాలేకపోయినా, ఆర్డర్స్ లేకపోయినా ఐటి కంపెనీలు తరుచుగా ఇలా తొలగించడం మామూలే అని కొందరు వాదిస్తున్నారు. ఈ ఒక్క కంపెనీయే కాదు చాలా ఐటి కంపెనీల్లో ఇలా పెద్ద సంఖ్యలో తరుచుగా ఉద్యోగులను తొలగించడం మామూలే అంటున్నారు.

11/02/2019 - 19:52

ఎక్కువ జీతం వచ్చే వాళ్లు, ఎక్కువ ఆదాయం ఉండే వారే సంపన్నులు అవుతారు అనే అంచనా తప్పు. జీతం తక్కువగా ఉన్నా మీ మైండ్‌సెట్ బట్టి మీరు సంపన్నులు కావచ్చు. ఇదేమీ మంత్రం కాదు. మాటలతో బురిడీ కొట్టించడం కాదు.

10/26/2019 - 18:51

ఒక వ్యక్తి ఆరోగ్యం ఎలా ఉందో చెప్పేందుకు అనేక పరీక్షలు ఉంటాయి. అలానే మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? ఎలా ఉండబోతుందో తేల్చడానికి కూడా ఒక చిన్న పరీక్ష ఉంది. మీరు ఒక వస్తువును కొనే పద్దతిని బట్టి మీ ఆర్థిక పరిస్థితి, భవిష్యత్తును అంచనా వేయవచ్చు.

10/19/2019 - 18:53

అంబానీ ఐనా పూరిగుడిసెలో ఉండే సామాన్యుడైనా తన కంటూ ఈ భూమి మీద ఒక సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిపై ఎక్కువ ఆదాయం వస్తుందా? బంగారంపై పెట్టుబడిలో గిట్టుబాటు ఎక్కువగా ఉంటుందా? అనే లెక్కలు ఎలా ఉన్నా.. ఇల్లు ఇచ్చే భరోసా మరేది ఇవ్వదు. ఈ అనంత విశ్వంలో తన కంటూ ఒక అడ్రస్ ఉండాలని, తన స్వంతం అని చెప్పుకోవడానికి ఒక ఇల్లు ఉండాలని అందరూ కోరుకుంటారు.

10/12/2019 - 17:55

బుద్ధుడికి బోధివృక్షం కింద జ్ఞానోదయం అయినట్టు వయసు మీరిన తరువాత చాలా మందికి డబ్బుకు సంబంధించి తత్వం బోధపడుతుంది. ఇలా చేసి ఉండాల్సింది కాదు అనుకుంటాం. అలా అనుకోకుండా ముందు నుంచే జాగ్రత్త వహించాలి. 40 ఏళ్ళ వయసులో గ్రహించి రూపొదించిన 40 తప్పుల జాబితాలో ఈ వారం మరి కొన్ని..

10/05/2019 - 19:06

బుద్ధుడికి బోధివృక్షం కింద జ్ఞానోదయం అయినట్టు. డబ్బుకు సంబంధించి ప్రతి వారికి జీవితంలో చాలా సార్లు జ్ఞానోదయం కలుగుతుంది. చిన్న వయసులోనే ఈ జ్ఞానోదయం కలిగితే జీవితానికి ఎంతో ఉపయోగం. కానీ కొందరికి జీవిత చరమాంకంలో జ్ఞానోదయం కలుగుతుంది. అప్పటికీ చాలా మంది ఇక చేయగలిగింది ఏమీ లేదనే నిరాశలో ఉంటారు.

09/28/2019 - 18:50

కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 రద్దు అంశం ఇటు ఇండియాలో, అటు పాకిస్తాన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇండియాలో కన్నా పాకిస్తాన్‌లో ఎక్కువ చర్చ సాగుతోంది. ఏడు దశాబ్దాల పాటు కాశ్మీర్ పేరు మీదనే పాక్ పాలకులు, సైన్యం బతికేస్తుంది. అన్ని దేశాల్లో దేశం కోసం సైన్యం ఉంటుంది. కానీ పాక్‌లో మాత్రం సైన్యం కోసం పాక్ దేశం ఉంది అని ఒక విమర్శ. పాకిస్తాన్‌లో సైన్యందే అసలైన అధికారం.

09/21/2019 - 19:39

డబ్బు సంపాదించడం కన్నా ఖర్చు చేసే విధానం కూడా కీలకమే. ఎంత సంపాదిస్తేనేం ఖర్చుపై అదుపు లేకపోతే పొదుపు ఉండదు. పొదుపు లేనప్పుడు మీ వద్ద సంపదా ఉండదు. సంపాదించడం ఒక కళ అంటారు. సంపాదించడమే కాదు ఖర్చు చేయడం కూడా కలే.

Pages