S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

12/02/2015 - 07:58

హైదరాబాద్, డిసెంబర్ 1: ఇతర రాష్ట్రాల నుంచి ఇసుకను అక్రమంగా రాష్ట్రంలోకి తీసుకురావడం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం కలుగుతోందని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. మైనింగ్, రెవెన్యూ, వాణిజ్య పన్నులు, అటవీ శాఖ సర్వే ఆఫ్ ఇండియా, మార్కెటింగ్ శాఖల అధికారులతో మంత్రి మంగళవారం సమావేశం అయ్యారు.

12/02/2015 - 07:58

మెదక్/కొల్చారం, డిసెంబర్ 1: మెదక్ డివిజన్ కొల్చారం మండలం తుక్కాపురం గ్రామంలోకి మంగళవారం ఉద యం ఓ చిరుత చొరబడి ఏడు గంటల పాటు తీవ్ర ఉత్కంఠ రేపింది. ఏడుగురిపై పంజా విసిరింది. అధికారులు వలపన్ని 7 గంటలు నానాబీభత్సం సృష్టించిన చిరుతకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి వల తో పట్టుకున్నారు. చిరుతను పట్టుకుని జూపార్క్‌కు తరలించడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు.

12/02/2015 - 07:56

వరంగల్, డిసెంబర్ 1: వరంగల్ నీటిపారుదల శాఖ కార్యాలయంలో అసిస్టెం ట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఎ.సురేందర్ రావు 50 వేల రూపాయలు లంచం తీసుకొంటూ మంగళవారం ఎసిబి అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపో యారు.

12/02/2015 - 07:55

నల్లగొండ, డిసెంబర్ 1: తెలంగాణ టిడిపి అగ్రనేతల మధ్య రాజుకున్న కొత్త జిల్లాల ముసలం క్రమంగా ము దిరిపోతోంది. ముఖ్యంగా నల్లగొండ జిల్లాకు చెందిన టిడిపి రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులైన మోత్కుపల్లి నరసింహులు, ఎలిమినేటి ఉమామాధవరెడ్డిల మధ్య సాగుతున్న రాజకీయ ఆధిపత్య పోరుకు కేంద్రంగా మారిన కొత్త జిల్లా కేంద్రాల వివాదం కాస్తా తీవ్రతరమై చివరకు టి.టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణను కూడా చు ట్టుముట్టింది.

12/02/2015 - 07:54

యాదగిరిగుట్ట రూరల్, డిసెంబర్1: తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని మోత్కుపల్లి దీక్షకు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌వి రమణ, ఎర్రబెల్లి దయాకర్‌రావు పూర్తి మద్దతును ప్రకటించారు.

12/02/2015 - 07:35

హైదరాబాద్, డిసెంబర్ 1: తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న కేంద్ర పథకాలకు ఈసారి కేంద్రం నుంచి పెద్దగా నిధులు వచ్చే అవకాశం లేదనే రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు భావిస్తున్నారు. పథకాలకు భారీ నిధులు వస్తాయనే ఆశలు వదులుకుని సొంత వనరులపైన ఆధారపడి బడ్జెట్‌కు రూపకల్పన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కొన్ని కేంద్ర పథకాలు, కేంద్ర రాష్ట్రాలు సమానంగా నిధులు భరిస్తూ అమలు చేస్తున్న పథకాలు ఉన్నాయి.

12/02/2015 - 07:32

హైదరాబాద్, డిసెంబర్ 1: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించబోయే అయుత చండీయాగానికి రావాల్సిందిగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను ఆహ్వానించారు. చండీయాగం ప్రారంభం కానున్న ఈ నెల 23వ తేదీననే యాగానికి రానున్నట్టు గవర్నర్ ముఖ్యమంత్రికి హామీ ఇచ్చినట్టు సమాచారం.

12/02/2015 - 07:25

హైదరాబాద్, డిసెంబర్ 1: రాజధానిలోని ఓ బ్యాంక్‌లో ఘరానా మోసం బయటపడింది. ఇటీవల నగరంలోని ఓ ఆర్టీసి డిపోకు చెందిన డ్రైవర్లు, కండక్టర్ల ఖాతాల నుంచి లక్షలాది రూపాయలు డ్రా జరిగిన ఘటన మరువక ముందే మల్కాజిగిరిలోని ఓ బ్యాంక్‌లో జరిగిన ఘటన కలకలం రేపుతోంది. మంగళవారం మల్లికార్జున నగర్ ఎస్‌బిహెచ్ బ్రాంచిలో రూ. 8.5 కోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఈ మేరకు లిక్విడేటర్ శుక్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

12/02/2015 - 07:23

హైదరాబాద్, డిసెంబర్ 1: ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 10న నిర్వహించతలపెట్టిన బీఫ్ ఫెస్టివల్‌పై రగడ కొనసాగుతోంది. మంగళవారం ఓయులో వామపక్ష, దళిత మైనార్టీ విద్యార్థి సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. బీఫ్ ఫెస్టివల్‌పై గోషామహల్ ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యలను ఓయు విద్యార్థి సంఘాలు ఖండించాయి.

12/02/2015 - 07:21

హైదరాబాద్/గచ్చిబౌలి, డిసెంబర్ 1: బడిలో బాలిక ప్రసవం కేసులో ఇన్‌చార్జి మండల విద్యాధికారి బసవలింగం సస్పెండ్ కాగా మరో ఏడుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. మాదాపూర్ హైస్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక ప్రసవంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టి తగు చర్యలకు ఉపక్రమించారు. ఇటీవల నిండు గర్భవతి బాలిక మూత్రశాలలో ప్రసవించిన విషయం తెలిసిందే.

Pages