తెలంగాణ

ఇసుక అక్రమ రవాణాతో ఖజానాకు నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 1: ఇతర రాష్ట్రాల నుంచి ఇసుకను అక్రమంగా రాష్ట్రంలోకి తీసుకురావడం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం కలుగుతోందని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. మైనింగ్, రెవెన్యూ, వాణిజ్య పన్నులు, అటవీ శాఖ సర్వే ఆఫ్ ఇండియా, మార్కెటింగ్ శాఖల అధికారులతో మంత్రి మంగళవారం సమావేశం అయ్యారు. ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న అక్రమ ఇసుక వల్ల కలుగుతున్న నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని నివారణ కోసం చెక్ పోస్టుల నిర్వాహణ కఠిన తరం చేయాలని, అవసరం అయితే సమీకృత చెక్ పోస్టులను భారీగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి అవసరం అయిన ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వాణిజ్య శాఖ నిర్వహిస్తున్న అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులను పటిష్ట పరచాలని సూచించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో గుర్తించిన మైనింగ్ జోన్స్‌కు అనుమతులు ఇవ్వాలని హెచ్‌ఎండిఎ, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులను మంత్రి ఆదేశించారు. రంగారెడ్డి జిల్లాలోని 14 మండలాల్లో అక్రమంగా కొనసాగుతున్న మైనింగ్‌ను వెంటనే అరికట్టాలని ఆదేశించారు. ఎవరికీ ఏ మైనింగ్ జోన్ కేటాయిస్తే అక్కడే మైనింగ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నది ఇసుకకు ప్రత్యామ్నాయంగా రాతి ఇసుకను ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం కోసం మైనింగ్ శాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని మంత్రి ఆదేశించారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు తలమానికంగా ఉన్న గండిపేట చెరువు పరిరక్షణ కోసం అధికారులతో హరీశ్‌రావు సమావేశం అయ్యా రు. మిషన్ కాకతీయలో భాగంగా గండిపేట చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని గతంలో తీసుకున్న నిర్ణయంపై చర్చించారు. యుద్ధ ప్రాతిపదికన గండిపేట చెరువు పునరుద్ధరణ పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. మిషన్ కాకతీయలో భాగంగా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని, దీని కోసం 50 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని కోరుతూ ప్రతిపాదనలు పంపాలని హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. 12కోట్ల రూపాయల వ్యయంతో మొదటి విడత పనులు ప్రారంభించాలని ఆదేశించారు. గండిపేట చెరువు అభివృద్ధికి దాతల సహాయం తీసుకోవడానికి ఒక ప్రణాళిక రూపొందించాలని సైబరాబాద్ పోలీసు కమీషనర్‌ను ఆదేశించారు. బెనిఫిట్ షో తో పాటు స్టార్ క్రికెట్ , సేవ్ గండిపేట పేరుతో రన్ నిర్వహించే విధంగా ప్రణాళిక రూపొందించాలని హరీశ్‌రావు సూచించారు.

వివిధ శాఖల అధికారులతో సమావేశమైన మంత్రి హరీశ్‌రావు