తెలంగాణ

బడిలో బాలిక ప్రసవం కేసు ఎంఇఓ సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/గచ్చిబౌలి, డిసెంబర్ 1: బడిలో బాలిక ప్రసవం కేసులో ఇన్‌చార్జి మండల విద్యాధికారి బసవలింగం సస్పెండ్ కాగా మరో ఏడుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. మాదాపూర్ హైస్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక ప్రసవంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టి తగు చర్యలకు ఉపక్రమించారు. ఇటీవల నిండు గర్భవతి బాలిక మూత్రశాలలో ప్రసవించిన విషయం తెలిసిందే. కాగా బాలిక ఫిర్యాదు మేరకు మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు తప్పించుకు తిరుగుతున్న నిందితుడు ధనుష్‌ను గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. హైస్కూల్ ముందు టిఎస్‌ఎఫ్ విద్యార్థులు ఆందోళనకు దిగడంతో ఉన్నతాధికారులు స్పందించారు. తొమ్మిది నెలలు గర్భవతిగా ఉంటూ పాఠశాలకు వస్తున్నా ఎవరు గుర్తించలేదని, ఎలాంటి విచారణకు ఉపక్రమించలేదని ఉపాధ్యాయులను మందలించారు. ఏడుగురు మహిళా ఉపాధ్యాయులతోపాటు క్లాస్ టీచర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కాగా వీరు బాలిక బంధువులను పిలిపించి విచారించగా ధనుష్ అనే యువకుడు తరచూ వారి ఇంటికి వస్తుండేవాడని బాలిక బంధువులు తెలపడంతో ఆ బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలావుండగా బాలికపై అత్యాచారం జరిపి గర్భవతిని చేసిన నిందితుడు ధనుష్‌ను కఠినంగా శిక్షించాలని కోరుతూ టిఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు భరత్ చంద్ర డిమాండ్ చేశారు.
హైటెక్ సిటీలో ఉంటూ బాలిక శరీరంలోని మార్పులను గమనించకుండా మూత్రశాలలో ప్రసవానికి కారకులైన ఉపాధ్యాయులపై చర్య తీసుకోవాలని ఆయన సంబంధిత అధికారులను కోరారు.