S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/21/2016 - 05:51

సంగారెడ్డి/ వరంగల్, జనవరి 20: దేశానికే ఆదర్శవంతంగా నిలిచేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులు రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు కాదు...బుల్లెట్ రైలులా శరవేగంతో దూసుకుపోతున్నాయని, అధికార యంత్రాంగం ఎంతో శ్రమిస్తోందని, మరింత ఒత్తిడి తీసుకువచ్చి నిర్ణిత కాల వ్యవధి నాటికి ఇంటింటికి నల్లా నీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన

01/21/2016 - 05:47

హైదరాబాద్, జనవరి 20: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణకు గురువారం (21న) గడువు ముగియనున్నది. నామినేన్లు దాఖలు చేసేందుకు గడువు ముగిసి నాలుగు రోజులైనా అభ్యర్థులు ‘బి-్ఫరం’ దాఖలు చేసేందుకు నామినేషన్ల ఉపసంహరణ తేదీ వరకూ గడువు ఉండడంతో పార్టీల నుంచి టిక్కెట్లు ఆశిస్తున్న నాయకులకు మరి కొంత గడువు దక్కినట్లు అయ్యింది.

01/20/2016 - 21:25

హైదరాబాద్, జనవరి 19: ‘మహమూద్ మ్యాచింగ్ సెంటర్, బంగ్లాదేశ్’- తెలుగులో కొట్టొచ్చినట్టు కనిపించే ఈ బోర్డు కొత్తవారికి వింతగా అనిపించొచ్చు. బంగ్లాదేశ్‌నుంచి వచ్చి బట్టల కొట్టు పెట్టినంతమాత్రాన ఆ దేశం పేరు పెట్టుకోవడమేంటని ఒకింత కోపమూ రావచ్చు. కానీ ఇదొక్కటే కాదు...ఆ ప్రాంతంలో చాలా దుకాణాలకు ఇలాంటి పేర్లే ఉంటాయి. కానీ స్థానికులకు మాత్రం ఇదో మామూలు విషయం.

01/20/2016 - 13:14

గజ్వేల్: మెదక్ జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండ అటవీ ప్రాంతంలో గుట్టపై నిర్మిస్తున్న ఓవర్‌హెడ్ ట్యాంకు, వాటర్ గ్రిడ్ పథకం పనులను రాష్ట్ర గవర్నర్ నరసింహన్ బుధవారం మధ్యాహ్నం పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ పథకం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

01/20/2016 - 11:45

హైదరాబాద్: పాతబస్తీలోని కిషన్ బాగ్, అసద్ బాబా నగర్ ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు నిర్వహించి, మయన్మార్, సౌదీకి చెందిన 15 మంది విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి పాస్‌పోర్టు లేకుండా వీరు ఏళ్ల తరబడి ఇక్కడే ఉంటూ వివాహాలు చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. అఫీజ్ బాబానగర్ ప్రాంతంలో మరో 60 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

01/20/2016 - 11:45

హైదరాబాద్:: నాగోల్ ప్రాంతంలో ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులకు చెందిన రెండు ఎటిఎంలను బుధవారం ఉదయం మంటల్లో దగ్ధమయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

01/20/2016 - 11:43

నిజామాబాద్: భార్యపై అనుమానం పెంచుకొన్న ఓ భర్త తన ఇద్దరు పిల్లలను నేలకేసి కొట్టిన ఘటన నందిపేట మండలం తల్వెదలో బుధవారం జరిగింది. ఈ ఘటనలో బాలుడు మరణించగా, తీవ్రంగా గాయపడిన బాలికను ఆస్పత్రికి తరలించారు.

01/20/2016 - 11:43

హైదరాబాద్: రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య అనంతరం హెచ్‌సియు లో విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు మద్దతు పలికేందుకు యు.పి. మాజీ ముఖ్యమంత్రి, బిఎస్పీ అధినేత్రి మాయావతి, సిపిఎం నేత సీతారాం ఏచూరి, లోక్‌జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ తదితరులు నేడు వర్సిటీకి వస్తున్నారు. దిల్లీ సిఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గురువారం ఇక్కడికి వస్తారని సమాచారం.

01/20/2016 - 11:41

హైదరాబాద్: రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య అనంతరం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నాలుగో రోజు బుధవారం బంద్ కొనసాగుతోంది. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఆందోళన విరమించేది లేదని విద్యార్థి సంఘాల నాయకులు ప్రకటించారు. విద్యార్థుల ఆందోళనకు మద్దతు ప్రకటించేందుకు వివిధ రాజకీయ పార్టీల నేతలు వర్సిటీకి తరలి వస్తున్నారు.

01/20/2016 - 08:10

నల్లగొండ, జనవరి 19: సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో ప్రధాన ఏజెంట్లను అరెస్టు చేయడం ద్వారా నల్లగొండ జిల్లా పోలీసులు మరో విజయం సాధించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కిడ్నీ రాకెట్ ఏజెంట్లను హాజరుపరిచి కేసు పురోగతి వివరాలను వెల్లడించారు.

Pages