తెలంగాణ

ఇంకా.. సందిగ్ధమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణకు గురువారం (21న) గడువు ముగియనున్నది. నామినేన్లు దాఖలు చేసేందుకు గడువు ముగిసి నాలుగు రోజులైనా అభ్యర్థులు ‘బి-్ఫరం’ దాఖలు చేసేందుకు నామినేషన్ల ఉపసంహరణ తేదీ వరకూ గడువు ఉండడంతో పార్టీల నుంచి టిక్కెట్లు ఆశిస్తున్న నాయకులకు మరి కొంత గడువు దక్కినట్లు అయ్యింది. వివిధ పార్టీలు అధికారికంగా అభ్యర్థుల జాబితాలు వెల్లడించినా, ఆశావాహులు మాత్రం తుది గడువు వరకూ తమకే టిక్కెట్ ఇవ్వాలని, గెలిచి చూపిస్తామని ధీమాగా చెబుతున్నారు. 150 డివిజన్లకు అన్ని పార్టీల్లోనూ రెండింతలు, మూడింతల నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఆశావాహులు కొన్ని డివిజన్లలో నలుగురైదుగురు నామినేషన్లు దాఖలు చేయడంతో పార్టీ అధికారికంగా ప్రకటించిన అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. పైగా కొంత మంది తామే అభ్యర్థులమని, నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేలోగా బి-్ఫరం తెచ్చుకుంటామని ధీమాగా చెబుతున్నారు. రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిథిలోని అత్తాపూర్ డివిజన్‌లో బిజెపి అధికారిక అభ్యర్థికి వ్యతిరేకంగా బిజెపి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ్ధర్ తన సతీమణి తృప్తితో నామినేషన్ దాఖలు చేయించారు. పార్టీ ఆదేశానుసారమే నామినేషన్ దాఖలు చేయించినట్లు శ్రీ్ధర్ చెబుతున్నారు. కాగా టిడిపి ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ తన కుమార్తె స్వప్నగౌడ్‌తో నామినేషన్ వేయించారు. టిడిపికి చెందిన నాయకుడు శ్రావణ్‌గౌడ్ కూడా తన భార్యతో నామినేషన్ వేయించారు. అయితే ఇంతకు ఎవరు అభ్యర్థి అవుతారో, టిడిపి-బిజెపిల్లో ‘బి-్ఫరం’ ఎవరి చేతికి వస్తుందో అంతుచిక్కడం లేదు. రాజేంద్ర నగర్ నియోజకవర్గం పరిథిలో ఉన్న ఐదు డివిజన్లలో రాజేంద్ర నగర్, మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్ మూడు డివిజన్లలో టిడిపి-బిజెపిలకు పట్టు ఉన్నందున, టిడిపి రెండు డివిజన్లు తీసుకున్నా, కనీసం ఒక్క డివిజన్ అయినా బిజెపికి ఇవ్వకపోతే ఎలా అని శ్రీ్ధర్ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్ళడంతో, పార్టీ సానుకూలంగా స్పందించినందుకే, తన భార్య తృప్తితో నామినేషన్ వేయించానని చెప్పారు. ఇప్పుడు ఈ డివిజన్ విషయంలో ఇరు పార్టీల మధ్య ఉత్కంఠ నెలకొంది.
భగ్గుమంటున్న ఆశావాహులు
పట్టువదలని పలువురు ఆశావాహులు తమ అనుచరులతో, కార్యకర్తలతో టిడిపి, బిజెపి కార్యాలయాలకు వెళ్ళి ఆందోళనలకు దిగుతున్నారు. బి-్ఫరం కోసం పార్టీ నేతలపై వత్తిడి పెంచుతున్నారు. మంగళవారం కొంత మంది ఆశావాహులు తమ అనుచరులతో, కార్యకర్తలు బిజెపి కార్యాలయంలో నేలపై కూర్చొని కిషన్‌రెడ్డికి, డాక్టర్ లక్ష్మణ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన సంగతి తెలిసిందే.
ఇలాఉండగా అన్ని పార్టీ నేతలకు తిరుగుబాటు అభ్యర్థులు తలనొప్పిగా మారారు. బిజెపి ఆశించిన సీట్లను టిడిపి తీసుకోవడం, ఆ పార్టీ ఆశించిన సీట్లు కొన్ని బిజెపికి పొత్తులో భాగంగా పోవడంతో ఆయా పార్టీల ఆశావాహులు మండిపడుతున్నారు. బిజెపి ఇప్పటి వరకు పోటీ చేసే అభ్యర్థుల పూర్తి జాబితాను విడుదల చేయలేదు. బిజెపి కార్యాలయంలో సోమవారం చందానగర్, ఆర్.కె.పురం, చైతన్యపురి టిక్కెట్లు ఆశించిన నాయకులు తమ అనుచరులతో ఆందోళనకు దిగారు. వెంగళ్‌రావునగర్ టిడిపికి కేటాయించడం పట్ల బిజెపి ఆందోళనకు దిగింది. నామినేషన్ వేసేప్పుడే బి-్ఫరం ఇచ్చే విధానం అమలులో లేకపోవడం వల్లే ఈ గందరగోళానికి దారి తీస్తున్నదని పార్టీల నాయకులు, అభ్యర్థులు అంటున్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో మిత్రపక్షమైన టిడిపితో కలిసి పోటీ చేస్తున్న బిజెపికి అభ్యర్థుల ఎంపిక చాలా తలనొప్పిగా మారింది. టిడిపి నాయకులు చెప్పినట్లే బిజెపి నాయకులు వింటున్నారన్న విమర్శలను ఎదుర్కొవాల్సి వస్తున్నది. మంగళవారం సుభాష్‌నగర్, ఆల్విన్ కాలనీ, వివేకానందనగర్ తదితర డివిజన్ల కార్యకర్తలు పార్టీ కార్యాలయంలో ఆందోళన చేయడమే కాకుండా పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఛాంబర్ ఎదుట చాలా సేపు బైఠాయించి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఆశావాహులను నచ్చజెప్పడం కష్టంగా మారింది. ఒక్కో డివిజన్‌లో నలుగురైదుగురు నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పుడు వారిని ఉపసంహరింపజేయడం గగనమైంది. వారిని సీరియస్‌గా పట్టించుకోకపోయినా ఫర్వాలేదు అనుకుంటే ప్రమాదం ముంచుకొస్తుంది. ఒక్కో తిరుగు బాటు అభ్యర్థి 200 నుంచి వెయ్యి ఓట్లు చీల్చినా, చివరకు ఫలితం తారుమారై మరో పార్టీకి మేలు జరుగుతుందని నేతలు భయపడుతున్నారు. టిఆర్‌ఎస్ పార్టీ మాత్రం అధికారికంగా జాబితా విడుదల చేసి, తిరుగుబాటు అభ్యర్థులను పట్టించుకోవడం లేదు. 70 స్థానాలకు పోటీ చేస్తున్న మజ్లిస్ పార్టీకి ఇటువంటి తలపోటు ఏమీ లేదు.