S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/26/2016 - 11:38

హైదరాబాద్: దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనకు నిరసనగా బుధవారం దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలను బంద్ చేయాలని విద్యార్థి సంఘాల నేతలు పిలుపునిచ్చారు. తమ డిమాండ్లను తెలియజేసేందుకు నగరంలో నేడు విద్యార్థులు భారీ ఎత్తున ర్యాలీ జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ర్యాలీని నిరోధించాలని పోలీసులు సిద్ధమవుతున్నారు.

01/26/2016 - 11:37

హైదరాబాద్: ఎ.పి.లో త్వరలో కేన్సర్ ఆస్పత్రి ప్రారంభిస్తామని సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా నగరంలోని బసవ తారకం కేన్సర్ ఆస్పత్రిలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సంక్షేమ పథకాలు పేదలకు అందించేందుకు అన్ని వర్గాలూ కృషి చేయాలన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్న కేన్సర్ ఆస్పత్రిని పరిశోధనా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు.

01/26/2016 - 11:37

హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎ.పి., తెలంగాణల్లో మంగళవారం ఉదయం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పతాకావిష్కరణ చేశారు. తొలుత ఆయన విజయవాడలో జాతీయ జెండాను ఎగురవేసి, గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సి.ఎం. చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం గవర్నర్ సికిందరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ సి.ఎం.

01/25/2016 - 15:26

హైదరాబాద్: నగరంలోని కంటోనె్మంటు నియోజకవర్గం ఎమ్మెల్యే సాయన్నకు సోమవారం గుండెపోటు రావడంతో ఆయనను అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. హుటాహుటిన ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించడంతో డాక్టర్లు వైద్యసేవలు అందిస్తున్నారు.

01/25/2016 - 13:31

కరీంనగర్ :వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. సమక్క-సారక్క జాతరకు వెళ్లడానికి ముందు భక్తులు శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తోంది. మరోవైపు తెల్లవారుజామున ఆలయం ఎదుట ఉన్న కళాభవన్‌లో 500 మందికిపైగా స్వాములు శివదీక్ష తీసుకున్నారు.

01/25/2016 - 13:19

ఖమ్మం: జిల్లాలోని చర్ల మండలం చింతగప్పలో ఆరుగురు మిలీషియా సభ్యులను అరెస్టు చేశారు. మిలీషియా సభ్యుల వివరాలను భద్రాచలం ఏఎస్పీ భాస్కరన్ తెలిపారు. సభ్యులు దిలీప్(దిర్గ బండి), నందయ్య, అడమయ్య, ఐతయ్య, సన్నయ్య, గంగయ్యలు ఉన్నట్లు వెల్లడించారు.

01/25/2016 - 12:07

హైదరాబాద్: రాజేంద్రనగర్ సమీపంలోని ఇందిరానగర్‌లో ఆదివారం అర్ధరాత్రి పేకాట స్థావరాలపై పోలీసులు ఆకస్మికంగా దాడులు చేసి 18 మందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 15 సెల్‌ఫోన్లు, 20వేల రూపాయల నగదు, వేటకొడవళ్లు, కత్తులు స్వాధీనం చేసుకున్నారు.

01/25/2016 - 12:04

హైదరాబాద్: దక్షిణాది భాషల్లో సినీనటిగా చిరపరిచితమైన కల్పనా రంజని (50) ఆదివారం ఉదయం నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ప్రఖ్యాత నటి ఊర్వశి సోదరి అయిన కల్పన తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటించారు. నాగార్జున, కార్తి నటిస్తున్న ‘ఊపిరి’ చిత్రంలో ఆమె కనిపించబోతున్నారు.

01/25/2016 - 12:03

హైదరాబాద్: దివంగత హాస్యనటుడు ఎం.ఎస్.నారాయణ భార్య కళాప్రపూర్ణ (63) సోమవారం ఉదయం నగరంలో మరణించారు. గత ఏడాది జనవరి 23న మరణించిన నారాయణకు సంవత్సరీకాలు పూర్తయిన సందర్భంలోనే ఆమె మరణించటం కుటుంబ సభ్యులకు విషాదాన్ని మిగిల్చింది. ఆమె మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

01/24/2016 - 17:36

హైదరాబాద్: దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగిన నేపథ్యంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ అప్పారావు సెలవులో వెళ్లారు. నలుగురు విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేసినప్పటికీ వర్సిటీలో ఆమరణ దీక్షలు కొనసాగుతునే ఉన్నాయి. వివిధ రాజకీయ పార్టీల నేతలు వర్సిటీకి వచ్చి విద్యార్థుల పోరాటానికి మద్దతు ప్రకటిస్తున్నారు.

Pages