తెలంగాణ

భాగ్యనగరంలో ఓ బంగ్లాదేశ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: ‘మహమూద్ మ్యాచింగ్ సెంటర్, బంగ్లాదేశ్’- తెలుగులో కొట్టొచ్చినట్టు కనిపించే ఈ బోర్డు కొత్తవారికి వింతగా అనిపించొచ్చు. బంగ్లాదేశ్‌నుంచి వచ్చి బట్టల కొట్టు పెట్టినంతమాత్రాన ఆ దేశం పేరు పెట్టుకోవడమేంటని ఒకింత కోపమూ రావచ్చు. కానీ ఇదొక్కటే కాదు...ఆ ప్రాంతంలో చాలా దుకాణాలకు ఇలాంటి పేర్లే ఉంటాయి. కానీ స్థానికులకు మాత్రం ఇదో మామూలు విషయం. ఇంతకీ అది మీరనుకుంటున్నట్టు పొరుగుదేశం బంగ్లాదేశ్ కాదు. భాగ్యనగరంలోని బంగ్లాదేశ్! హైదరాబాద్, సికిందరాబాద్‌లకు మధ్యలో ఉన్న ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని భోలక్‌పూర్‌లోని ఓ మున్సిపల్ వార్డు ఇది. భోలక్‌పూర్ పేరుతో మున్సిపల్ వార్డు ఉన్నా, ఎన్నికల ఫలితాలు నిర్ణయించేది మాత్రం ఈ బంగ్లాదేశేనంటే అతిశయోక్తి కాదు.
1971లో ఇండో-పాక్ యుద్ధ సమయంలో కాందిశీకులుగా వచ్చిన వేలాదిమంది బంగ్లాదేశీయులు భోలక్‌పూర్‌లో నివాసం ఏర్పరచుకున్నారు. వీరిలో చాలామంది బట్టల దుకాణాలు ఏర్పాటు చేసుకుని పొట్టపోసుకుంటున్నారు. అందుకే ఈ కాలనీకి బంగ్లాదేశ్ అని పేరొచ్చింది. వీరు నడిపే బట్టల దుకాణాలకు కూడా డిమాండ్ ఎక్కువే. ధర తక్కువ, తానుల్లో కాకుండా ముక్కలుగా లభించడంతో బీదా బిక్కీ ఈ దుకాణాలకే వస్తూంటారు. ఇక్కడ మైనారిటీలే మెజారిటీలు. ఎంతగా అంటే గతంలో ఎంఐఎంను సైతం కాలు పెట్టనివ్వకుండా తామే ఒక అభ్యర్థిని ఇండిపెండెంట్‌గా పోటీ చేయించి గెలిపించుకున్నారు. 1986లో జరిగిన హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం వంద వార్డులు ఉంటే ఒకే ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. అది భోలక్‌పూర్ వార్డు. హైదరాబాద్ నగరంలో మత కలహాలు జరిగిన సమయంలో కూడా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడం విశేషం. సుమారు తొమ్మిదేళ్ల కిందట తోళ్ల శుద్ధి పరిశ్రమల వల్ల తాగునీరు కలుషితం కావడంతో ఐదుగురు మరణించిన సంఘటన జరిగింది ఇక్కడే. ఈసారి సొంతంగా అభ్యర్థిని నిలబెట్టకపోయినా కొందరు ఎంఐఎంవైపు, మరికొందరు టిఆర్‌ఎస్‌వైపు చీలిపోయారు. ఈ కాలనీలో ఈ రెండింటికే ఓట్లు పడే అవకాశం ఉంది.