S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/14/2016 - 11:50

ఖమ్మం: పినపాక మండలం కరకగూడెంలో బుధవారం అర్ధరాత్రి గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో చోరీకి యత్నం జరిగింది. బ్యాంక్‌లోకి ప్రవేశించిన దొంగలు లాకర్‌ను పగులగొట్టేందుకు విఫలయత్నం చేశారు. గురువారం ఉదయం స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు బ్యాంక్‌కు చేరుకొని కేసు నమోదు చేశారు.

01/14/2016 - 08:26

హైదరాబాద్, జనవరి 13: నగరంలోని బోయిన్‌పల్లిలో ఓ స్టాక్ మార్కెట్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఎక్స్‌పర్ట్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో కంపెనీ భారీ మోసానికి పాల్పడింది. స్టాక్ మార్కెట్‌లో పెట్డుబడులతో అధిక లాభాలు గడించొచ్చని నమ్మించి ప్రజలకు సుమారు 4కోట్ల రూపాయలు కుచ్చుటోపీ పెట్టింది.

01/14/2016 - 08:19

సంగారెడ్డి, జనవరి 13: ధనుర్మాసంలో భాగంగా మెదక్ జిల్లా సంగారెడ్డి పట్టణ పరిధిలోని వైకుంఠపురం శ్రీ మహాలక్ష్మీ గోదా సమేత విరాట్ వేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రంలో బుధవారం నాడు స్వామి వారి కల్యాణోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. మూడు రోజులుగా పట్టణంలో మార్మోగుతున్న స్వామి వారి నామస్మరణ కల్యాణం రోజున భక్తులు మరింతగా పులకించిపోయారు.

01/14/2016 - 08:18

హైదరాబాద్, జనవరి 13: తెలంగాణ రాష్ట్ర సమితి దళితులను మోసం చేసిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్ రెడ్డి విమర్శించారు. బిజెపి అంటే భారతీయ జోకర్ పార్టీ అని విమర్శించిన రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తమకు సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి అలా మాట్లాడలేమని అన్నారు.

01/14/2016 - 08:17

మహబూబ్‌నగర్, జనవరి 13: రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకోవడంతో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగుల జాబితాను రూపొందిస్తున్నామని, జాబితా పూర్తి కాగానే ఉద్యోగుల క్రమబద్ధీకరణ త్వరతగతిన పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ వెల్లడించారు.

01/14/2016 - 08:16

చౌటుప్పల్, జనవరి 13: సంక్రాంతి పండుగ పర్వదినం వేడుకల్లో పాల్గొనేందుకు పొరుగు రాష్టమ్రైన ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద ఎత్తున ప్రజలు తరలివెళ్తుండఆంతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లాలో వాహనాల రద్దీ బుధవారం సాయంత్రం మరింత పెరిగింది. ఈ నెల 14, 15, 16 తేదీలలో జరుగుతున్న సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు వేల సంఖ్యలో ప్రజలు ఆంధ్రకు పయనమవడంతో హైవేపై అడుగడుగునా ట్రాఫిక్ జామ్ అవుతోంది.

01/14/2016 - 08:15

హైదరాబాద్, జనవరి 13: మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో పాతబస్తీలో అధిక శాతం డివిజన్లు రిజర్వ్ కావడంతో విజయంపై ఆలిండియా మజ్లిస్ ఇఫ్తెహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) పార్టీ తర్జన భర్జన పడుతోంది. జాతీయ స్థాయిలో విస్తరిస్తున్న తరుణంలో మజ్లిస్‌కు సొంత గడ్డపై ఈ ఎన్నికలు సవాలుగా మారాయి.

01/14/2016 - 08:17

హైదరాబాద్, నవంబర్ 13: బయ్యారంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై సెయిల్ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో శుక్రవారం సచివాలయంలో సమావేశమయ్యారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సెయిల్ కంపెనీలు బయ్యారంలో ఇనుప ఖనిజం లభ్యత, నాణ్యత, స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు గల అవకాశాలపై మార్చి నాటికి నివేదిక ఇస్తాయి.

01/14/2016 - 08:14

చౌటుప్పల్, జనవరి 13: చేనేత వస్త్రాల నాణ్యతను పెంచేందుకు దక్షిణ భారతదేశంలోని ఐదు రాష్ట్రాలలో రూ.62 కోట్లతో 31 చేనేత క్లస్టర్లను ఏర్పా టు చేయనున్నట్లు జాతీయ చేనేత అభివృద్ధి కమిషనర్ అలోక్‌కుమార్ తెలిపారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామంలో బుధవారం ఆయన పర్యటించారు. చేనేత సంఘాన్ని సందర్శించి చేనేత వస్త్రాలను పరిశీలించారు.

01/14/2016 - 08:13

వర్ధన్నపేట, జనవరి 13: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండ లంలోని ఐనవోలు మల్లికార్జుస్వామి జాతర బ్రహ్మోత్సవాలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. దేవాలయ ప్రాం గణంలో ఆగమశాస్త్రం ప్రకారం వేద పండితులు తెల్లవారు జాము న నాలుగు గంటల నుండి ప్రత్యేక అర్చణలు, శే్వత లింగానికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, మహానివేదన, మంత్రపు ష్పం నిర్వహించి భక్తులకు తీర్ధ ప్రసాదాల వితరణ నిర్వహించారు.

Pages