S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/21/2016 - 05:16

న్యూఢిల్లీ, మే 20: మాలేగావ్ పేలుళ్ల కేసు దర్యాప్తులో దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఎను రాజకీయ జోక్యంతో ప్రభావితం చేసినట్లు వచ్చిన ఆరోపణలను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తోసిపుచ్చారు. దేశంలోని దర్యాప్తు సంస్థలన్నీ పూర్తి స్థాయి స్వయంప్రతిపత్తితో పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. ‘మన దర్యాప్తు సంస్థలన్నింటికీ పూర్తి స్థాయి స్వయంప్రతిపత్తి ఉంది.

05/21/2016 - 03:40

న్యూఢిల్లీ, మే 20: అత్యంత వివాదాస్పదమైన నీట్ (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష)ను ఏడాదిపాటు వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రాల బోర్డులకు మాత్రమే నీట్ పరీక్ష ఏడాదిపాటు వాయిదా వేశారని, కేంద్రం పరిధిలోని వైద్య కాలేజీలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, డీమ్డ్ వర్శిటీల్లోని యాజమాన్య కోటా సీట్లకు ఈ ఏడాది నీట్ పరీక్ష పాస్ కావలసిందేనని అంటున్నారు.

05/20/2016 - 18:01

తిరువనంతపురం: కేరళ నూతన ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ (72) బాధ్యతలు చేపడతారని సిపిఎం అగ్రనేతలు సీతారాం ఏచూరి, ప్రకాష్ కారత్ శుక్రవారం ఇక్కడ ప్రకటించారు. ఇక్కడి సిపిఎం కార్యాలయంలో జరిగిన పార్టీ సమావేశంలో సిఎం పదవికి తొలుత మాజీ సిఎం అచ్యుతానందన్ (92) పేరు పరిశీలనకు వచ్చినప్పటికీ, ఆ తర్వాత మెజారిటీ నేతల అభిప్రాయం మేరకు విజయన్‌ను ఎంపిక చేశారు.

05/20/2016 - 18:00

ముంబయి: తాజాగా జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ మ్యాజిక్ ఏమీ పనిచేయలేదని శివసేన పార్టీ వ్యాఖ్యానించింది. ఎన్నికల ఫలితాలపై శివసేన పార్టీ పత్రిక ‘సామ్నా’లో కొన్ని ఆసక్తికరమైన విమర్శలు చోటుచేసుకున్నాయి. అస్సాంలో ప్రాంతీయ పార్టీలను కలుపుకుపోవడం వల్లే బిజెపి విజయం సాధించిందని, బిహార్ ఎన్నికల తర్వాత ఈ విజయం ఆ పార్టీకి కొంత ఊరటనిచ్చిందని శివసేన పేర్కొంది.

05/20/2016 - 18:00

గౌహతి: అస్సాం ముఖ్యమంత్రిగా ప్రస్తుత కేంద్ర మంత్రి శర్వానంద సోనోవాల్ ఈనెల 24న ప్రమాణ స్వీకారం చేస్తారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో సోనోవాల్ నాయకత్వంలో బిజెపి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారని సోనోవాల్ శుక్రవారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు.

05/20/2016 - 17:59

రాంచీ: విశాఖ, రాంచీ, పాట్నా రైల్వేస్టేషన్లలో వైఫై సేవలను రైల్వే మంత్రి సురేష్ ప్రభు శుక్రవారం ప్రారంభించారు. రైల్వే స్టేషన్లలో వేచి ఉండే ప్రయాణికులు ఉచితంగా ఇంటర్నెట్‌ను వీక్షించేందుకు వైఫై సేవలను అందుబాటులోకి తెచ్చారు. భవిష్యత్‌లో 400 స్టేషన్లలో ఈ సేవలను అందించేందుకు కృషి చేస్తున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు.

05/20/2016 - 17:57

దిల్లీ: సాంప్రదాయ సంగీతంతో భారత్‌కు వనె్న తెచ్చిన సంగీత సామ్రాజ్ఞి భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి శత జయంతిని ఈ ఏడాది సెప్టెంబర్ 16న ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉత్సవాలను అధికారికంగా దేశవ్యాప్తంగా జరుపుతారు.

05/20/2016 - 17:56

కోల్‌కత: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించిన ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ శుక్రవారం ఆ పార్టీ శాసనసభా పక్షం నేతగా తిరిగి ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేలంతా ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆమె ప్రమాణ స్వీకారోత్సవం గురించి మాట్లాడేందుకు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో భేటీ అయ్యారు.

05/20/2016 - 16:35

ఢిల్లీ: ఉగ్రవాది అబ్దుల్ వాహిద్ ను ఎన్ఐఏ పోలీసులు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో శుక్రవారం అరెస్ట్ చేశారు. దుబాయ్‌లో ఉంటూ భారత్‌లో దాడులకు అబ్దుల్ కుట్ర చేస్తున్నాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇండియన్ ముజాహిదీన్‌ సంస్థకు చెందిన ఉగ్రవాదిగా పోలీసులు గుర్తించారు. అబ్దుల్ వాహిద్ దుబాయ్ నుంచి ఢిల్లీ చేరుకోగానే ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.

05/20/2016 - 14:57

దిల్లీ: మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్లకు నిర్వహించే ‘నీట్’ను వాయిదా వేసేందుకు ఆర్డినెన్స్ జారీ చేయవద్దని దిల్లీ సిఎం కేజ్రీవాల్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. చాలామంది రాజకీయ నాయకులకు సొంతంగా మెడికల్ కాలేజీలున్నాయని, ‘నీట్’ పరిధిలోకి రాకుంటే వారు మెడికల్ సీట్లను బ్లాకులో విక్రయించి భారీగా నల్లధనాన్ని కూడబెట్టుకుంటారని ఆయన పేర్కొన్నారు.

Pages