S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/20/2016 - 04:05

న్యూఢిల్లీ, మే 19: భాజపాకు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా పార్లమెంటును సజావుగా సాగనివ్వకుండా చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ అసహన రాజకీయాలకు చెంపపెట్టని, కాంగ్రెస్, వామపక్షాల అపవిత్ర కలయిక, అవకాశవాద పొత్తులను ప్రజలు నిరాకరించారన్నారు.

05/20/2016 - 04:04

న్యూఢిల్లీ, మే 19: అసోంలో బీజేపీకి ఘన విజయాన్ని అందించిన ప్రజానీకానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ అభివృద్ధి సిద్ధాంతానికి అసోం ప్రజలు మద్దతు పలకడం కొత్త ఉత్సాహాన్ని అందించిందని అయన వ్యాఖ్యానించారు. ఈశాన్య భారతంలో మొట్టమొదటిసారి పార్టీ అధికారంలోకి రావటం బీజేపీకి పెరుగుతున్న ప్రజల మద్దతుకు సంకేతమని ఆయన అన్నారు.

05/20/2016 - 03:44

కోల్‌కతా, మే 19: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికార పగ్గాలు చేజిక్కించుకుంటోంది. లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి, బిజెపిని మట్టికరిపించేందుకు తృణమూల్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పన్నిన వ్యూహం ఫలించింది. మమతా జెనర్జీకి ఏకపక్షంగా ఫలితాలు వచ్చాయి. 61 ఏళ్ళ మమత ఒంటిచేత్తో రాజకీయాలు నడిపి ఘన విజయం సొంతం చేసుకున్నారు.

05/20/2016 - 03:42

న్యూఢిల్లీ, మే 19: పశ్చిమ బెంగాల్‌లో 213 సీట్లను కైవసం చేసుకుని రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్న తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ భావ సారూప్యత గల పార్టీలతో కలిసి జాతీయస్థాయిలో తృతీయ ఫ్రంట్ ఏర్పాటుకు పావులు కదుపుతున్నారు. ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్‌పై దృష్టి కేంద్రీకరిస్తూనే జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే సూచనలు కనిపిస్తున్నాయి. ‘నేను సగటు మనిషిని.

05/20/2016 - 03:41

చెన్నై, మే 19: భారత రాజకీయాల్లో తమిళ ప్రజలకు ఇన్నాళ్లూ ఒక రికార్డు ఉండేది. అయిదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చటం తప్ప.. అధికారంలో ఉన్న పార్టీకి తిరిగి పట్టం కట్టడం గత మూడు దశాబ్దాలలో ఎన్నడూ లేదు. ఎప్పుడో 1977లో మహానటుడు ఎంజీ రామచంద్రన్‌కు వరుస విజయాలను కట్టబెట్టి పదేళ్ల అధికారాన్ని అందించిన తమిళ ప్రజలు మళ్లీ ఇంతకాలానికి ఆయన వారసురాలు జయలలితకు మళ్లీ అవకాశం ఇచ్చారు.

05/20/2016 - 03:48

తిరువనంతపురం, మే 19: ఎగ్జిట్ పోల్స్ అంచనాల మేరకు కేరళలో ఈ నెల 16న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష ప్రజాస్వామ్య కూటమి (ఎల్‌డిఎఫ్) ఐక్య ప్రజాస్వామ్య కూటమి (యుడిఎఫ్)ను భారీ మెజారిటీతో చిత్తు చేసింది. ఎల్‌డిఎఫ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రి ఎవరనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలోను మెదులుతోంది.

05/20/2016 - 03:49

గౌహతి, మే 19: అసోంలో బీజేపీ మొత్తం మీద అనుకున్నది సాధించింది. పదిహేనేళ్ల గొగోయ్ శకానికి చరమగీతం పాడి అధికారం చేజిక్కించుకోవటం కమలనాథుల శిబిరంలో ఉత్సాహాన్ని నింపింది. ఈ విజయం వెనుక అత్యంత కీలకమైన పాత్ర పోషించిన ఒకే ఒక్కడు శర్వానంద సోనోవాల్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో గొగోయ్ పవర్‌పై నీళ్లు చల్లిన సోనోవాల్.. తాజా ఫలితాల్లోనూ మోదీ నమ్మకాన్ని నిలబెట్టారు.

05/20/2016 - 03:37

పుదుచ్చేరి, మే 19: అసోం, కేరళలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి చిన్న కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో భాగస్వామ్య పక్షమైన డిఎంకెతో కలిసి అధికారంలోకి రావడం కాస్త ఊరట కలిగించే అంశం. 30 స్థానాలు గల అసెంబ్లీలో కాంగ్రెస్-డిఎంకె కూటమి 17 స్థానాలు గెలుచుకొని సాధారణ మెజారిటీని సంపాదించింది.

05/20/2016 - 03:35

న్యూఢిల్లీ, మే 19: కేరళలో వామపక్ష (ఎల్‌డిఎఫ్) కూటమిని గెలుపు చరిత్రాత్మకమని, బెంగాల్‌లో ఓటమిపై సమిక్షించుకుంటామని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై గురువారం ఢిల్లీలో సిపిఎం ప్రధాన కార్యలయంలో ఏచూరి మాట్లాడుతూ ఎల్‌డిఎఫ్ కూటమిని కేరళలో ప్రజలు ఆదరించారని తెలిపారు.

05/20/2016 - 03:34

న్యూఢిల్లీ, మే 19: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్టు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. అస్సాం, కేరళలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. ప్రజల తీర్పును శిరసావహిస్తామని రాహుల్ అన్నారు. ‘ప్రజల తీర్పును వినమ్రంగా స్వాగతిస్తున్నాం.

Pages