జాతీయ వార్తలు

నీట్ ఏడాది వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 20: అత్యంత వివాదాస్పదమైన నీట్ (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష)ను ఏడాదిపాటు వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రాల బోర్డులకు మాత్రమే నీట్ పరీక్ష ఏడాదిపాటు వాయిదా వేశారని, కేంద్రం పరిధిలోని వైద్య కాలేజీలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, డీమ్డ్ వర్శిటీల్లోని యాజమాన్య కోటా సీట్లకు ఈ ఏడాది నీట్ పరీక్ష పాస్ కావలసిందేనని అంటున్నారు. దీనికి సంబంధించి కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఆర్డినెన్స్‌కు రాష్టప్రతి ఆమోద ముద్రపడి ఉత్తర్వులు జారీ అయితే తప్ప అన్ని వివరాలు వెలుగులోకి రావు. రాష్ట్రాల బోర్డులను నీట్‌నుంచి ఏడాదిపాటు మినహాయించేందుకు ఆర్డినెన్స్‌ను జారీ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. దీనిపై ఆర్డినెన్స్ జారీకి కేబినెట్ ఆమోదించిన అనంతరం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి పంపించారు. రాష్టప్రతి ఆమోదముద్ర పడగానే నీట్‌ను ఏడాదిపాటు వాయిదా వేసేందుకు సంబంధించిన ఆర్డినెన్స్ జారీ అవుతుంది. విద్యార్థులు పాత సిలబస్ ప్రకారం సిద్ధంకావడం, దక్షిణాదికి చెందిన విద్యార్థులు స్టేట్ సిలబస్‌తో చదువుకోవటం, ప్రాంతీయ భాషల్లో రాష్ట్రాల బోర్డులు నిర్వహించిన పరీక్షలు పాసైన విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండటంవంటి కారణాల వల్ల ఇప్పటికిప్పుడే నీట్ నిర్వహించడం మంచిదికాదని కేబినెట్ అభిప్రాయపడినట్టు తెలిసింది. నీట్‌కు విద్యార్థులు అలవాటుపడేందుకు కొంత సమయం అవసరం కాబట్టి వచ్చే ఏడాది నుంచి దాన్ని నిర్వహించడం మంచిదనే అభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం. కేబినెట్ ఆమోదించిన ఆర్డినెన్స్ జారీ అయితే తప్ప అన్ని వివరాలు వెలుగులోకి రావు. వైద్య విద్యకు దేశవ్యాప్తంగా ఒకటే ప్రవేశ పరీక్ష నీట్ నిర్వహించాలని న్యాయమూర్తి ఎఆర్ దవే సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం మే 9న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును పలు రాష్ట్రాలు, ప్రైవేటు మెడికల్ కాలేజీలు సవాల్ చేస్తూ రివ్యూ పిటిషన్లు దాఖలు చేయగా తమ తీర్పును మార్చుకోవలసిన అవసరం కనిపించటం లేదని త్రిసభ్య ధర్మాసనం తదుపరి తీర్పులో స్పష్టం చేసింది. అయితే సుప్రీం కోర్టు ఆదేశం మేరకు నీట్ నిర్వహించటాన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలతోపాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యతిరేకించాయి. హడావుడిగా ఏర్పాటు చేసిన నీట్ పరీక్షలకు తమ రాష్ట్రాల విద్యార్థులు సిద్ధంగా లేరని ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. నీటిపై దేశవాప్తంగా తీవ్ర అభ్యంతరాలు రావటంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా గతవారం రాష్ట్రాల వైద్య శాఖల మంత్రుల సమావేశం నిర్వహించారు. నీట్‌ను ఆమోదిస్తూ ఏర్పాట్ల కోసం ఒకటి, రెండేళ్ల మినహాయింపు ఇవ్వాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి సూచించాయి. నడ్డా సమావేశం జరిగిన రోజే ఆర్థిఖ మంత్రి అరుణ్‌జైట్లీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి నీట్ నిర్వహణపై చర్చలు జరిపారు. కేంద్రం ఈ రెండు సమావేశాల్లో వ్యక్తమైన అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకునే శుక్రవారం నీట్‌ను ఏడాదిపాటు వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు.

చిత్రం... కేబినెట్ సమావేశం నుంచి బయటకు వస్తున్న మంత్రులు