S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/20/2016 - 14:55

ఖాట్మండు: పశ్చిమబెంగాల్‌కు చెందిన పర్వతారోహకుడు రజిబ్ భట్టాచార్య (43) నేపాల్‌లో మంచుతీవ్రతతో తాత్కాలిక అంధత్వానికి లోనై మరణించారు. ప్రపంచంలోనే ఏడవ ఎత్తయిన ధవళగిరి శిఖరాన్ని అధిరోహించేందుకు తన బృందంతో వెళ్లిన ఆయన లక్ష్యానికి చేరుకుని తిరుగుముఖం పడుతుండగా ఈ ఘటన జరిగింది. భట్టాచార్య గతంలోనే ఎవరెస్ట్, కాంచనజంగా పర్వతాలను అధిరోహించారు. అతని మృతదేహాన్ని బేస్ క్యాంప్‌కు చేర్చారు.

05/20/2016 - 13:55

నల్గొండ: రాక్ కైంబ్లింగ్ స్కూల్ డైరెక్టర్ శేఖర్‌బాబు నేతృత్వంలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు బయలుదేరిన బృందంలో అయిదుగురు శుక్రవారం ఉదయం లక్ష్యాన్ని చేరుకున్నట్లు సమాచారం. ఐపిఎస్ అధికారి సునీల్ శర్మ, ఆదిలాబాద్ ఎఎస్‌పి రాధిక, ఐఎఫ్‌ఎస్ అధికారి ప్రభాకరన్, ఇంజనీర్ బాలన్, భద్రయ్య ఎవరెస్ట్ శిఖరంపైకి చేరుకున్న ఘనతను సాధించారు. మరో ఇద్దరు వ్యక్తులు లక్ష్యానికి చేరువలో ఉన్నట్లు తెలిసింది.

05/20/2016 - 13:54

దిల్లీ: పలు రాష్ట్రాల అభ్యర్థన మేరకు ‘నీట్’ పరీక్షకు ఈ ఏడాది మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి జెపి నడ్డా శుక్రవారం ఇక్కడ ప్రకటించారు. ‘నీట్’ను వాయిదా వేసేందుకు కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇక్కడ జరిగిన కేంద్ర మంత్రిమండలి నిర్ణయంలో ఈ ఆర్డినెన్స్‌కు ఆమోదముద్ర లభించింది.

05/20/2016 - 12:06

తిరువనంతపురం : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి పరాజయం పాలుకావడంతో సిఎం పదవికి ఊమెన్ చాందీ రాజీనామా చేశారు. ఆయన శుక్రవారం ఉదయం ఇక్కడి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష కూటమి అఖండ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.

05/20/2016 - 12:04

దిల్లీ: మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లకు దేశవ్యాప్త ప్రవేశ పరీక్ష (నీట్)నుంచి రాష్ట్రాలకు ఈ ఏడాది మినహాయింపు ఇచ్చేలా ఆర్డినెన్స్ జారీ చేయాలని కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇక్కడ శుక్రవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ప్రారంభమైన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఈ ఆర్డినెన్స్‌పై చర్చ జరుగుతోంది. ‘నీట్’ నుంచి ఈ ఏడాది మినహాయించాలని ఇటీవల పలు రాష్ట్రాలు ప్రధానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.

05/20/2016 - 04:57

హైదరాబాద్, మే 19:‘చిదిమెకొద్ది ఎదిగనంట.. కోసెకొద్ది పూసెనంట’ అన్న గీతం ఇప్పుడు బిజెపి విషయంలో నిజమయింది. ఢిల్లీ, బిహార్ ఓటమితో డీలాపడిన కమలం ఇప్పుడు ఈశాన్య దేశంలో పాదం మోపింది. దక్షిణ భారతంలోని కర్నాటకలో పాగా వేయడానికి తీసుకున్న సమయం కంటే ఈశాన్య రాష్ట్రంలోని అసోంలో అధికారం చేజిక్కించుకునేందుకు తీసుకున్న సమయం తక్కువ. కర్నాటకలో అధికారంలోకి వచ్చేందుకు 15 సంవత్సరాలు పట్టింది.

05/20/2016 - 04:53

చెన్నై, మే 19: 14వ ఏటే హిందీ వ్యతిరేక ఉద్యమం ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించిన డీ ఎంకే చీఫ్ ఎం.కరుణానిధి.. తన రాజకీయాల్లో అధికారంలో ఉన్నా, లేకపోయినా.. శాసనసభ్యుడిగా ఏనాడూ ఓటమి పదాన్ని వినలేదు. 1957లో తొలిసారి తమిళనాడు శాసనభకు ఎన్నికైన కరుణానిధి. ఇప్పటివరకూ పోటీ చేసిన ప్రతిసారీ ఘన విజయాన్ని నమోదు చేసి చరిత్ర సృష్టించారు. 92 ఏళ్ల ఈ కురువృద్ధుడు 13వ సారి తమిళనాడు అసెంబ్లీకి తాజాగా ఎన్నికయ్యారు.

05/20/2016 - 04:51

న్యూఢిల్లీ,మే 19: ఈశాన్య రాష్ట్రం అసోంలో భాజపా భారీ విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకొన్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలలో పెద్దగా నమ్మకం పెట్టుకోని బిజెపి అసోంలో విజయం సాధించడంతో ఢిల్లీ అశోక్ రోడ్డులోని పార్టీ కేంద్ర కార్యాలయానికి పెద్దఎత్తున కార్యకర్తలు చేరుకొని మిఠాయిలు పంచుకొని బాణాసంచా కాల్చి, పరస్పరం అభినందనలు తెలుపుకుంటూ నృత్యాలు చేశారు.

05/20/2016 - 04:12

న్యూఢిల్లీ, మే 19: అసోం, కేరళ రాష్ట్రాల్లో ఓటమిని చవిచూసిన కాంగ్రెస్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వం మరోసారి ప్రశ్నార్థకం కావటంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాహుల్ నాయకత్వంలో బతికి బట్టకట్టగలుగుతామా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసోం, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రాహుల్ పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం చేశారు.

05/20/2016 - 04:05

న్యూఢిల్లీ,మే 19: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి సాధించిన విజయం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు సంవత్సరాల పరిపాలనపై రిఫరెండం అని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. మోదీ నాయకత్వంలో బిజెపి త్వరలోనే కాంగ్రెస్ ముక్త్భారత్ లక్ష్యాన్ని సాధిస్తుందని అమిత్ షా తెలిపారు.

Pages