S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/19/2016 - 15:15

కోల్‌కత: పశ్చిమబెంగాల్ అసెంబ్లీలోని మొత్తం 294 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 212 చోట్ల గెలిచి అఖండ విజయాన్ని సాధించింది. కాంగ్రెస్‌కు 45, లెఫ్ట్‌పార్టీలకు 30, బిజెపికి 7 స్థానాలు దక్కాయి. వరసగా రెండోసారి మమతా బెనర్జీ తన పార్టీని మంచి మెజారిటీతో గెలిపించుకున్నారు.

05/19/2016 - 15:14

గౌహతి: అస్సాం శాసనసభలో మొత్తం 126 స్థానాలకు ఎన్నికలు జరపగా ఎక్సిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టు బిజెపి తొలిసారిగా అధికారాన్ని కైవసం చేసుకుంది. బిజెపికి 88, కాంగ్రెస్‌కు 22, ఎయుడిఎఫ్‌కు 13, ఇతరులకు 3 స్థానాలు దక్కాయి. ఎన్నికల్లో గెలిచిన ప్రస్తుత కేంద్రమంత్రి శర్వానంద సోనోవాల్ ముఖ్యమంత్రి కానున్నారు.

05/19/2016 - 15:14

తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష కూటమికి తిరుగులేని ఆధిక్యత లభించింది. అసెంబ్లీలోని మొత్తం 140 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా ఎల్‌డిఎఫ్‌కు 90, కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్‌కు 47, బిజెపికి 1, ఇతరులకు రెండు స్థానాలు దక్కాయి.

05/19/2016 - 15:13

తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో బిజెపి తొలిసారిగా ఓ అసెంబ్లీ స్థానంలో విజయం సాధించింది. నెమోమ్ నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి ఓ.రాజగోపాల్ గెలుపొంది ఈ ఘనతకు కారణమయ్యారు. మరికొన్ని నియోజకవర్గాల్లోనూ బిజెపి గట్టి పోటీ ఇచ్చింది. ఈసారి ఆ పార్టీకి ఓట్ల శాతం కొంతమేరకు మెరుగైంది. తొలిసారిగా కేరళలో తమ పార్టీ అభ్యర్థి గెలిచినందుకు ప్రధాని మోదీ ట్విట్టర్‌లో ఆనందం వ్యక్తం చేశారు.

05/19/2016 - 15:12

తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికల్లో యుడిఎఫ్ కూటమికి ఇంతటి పరాజయం ఎదురవుతుందని ఊహించలేదని కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ అన్నారు. ఎన్నికల ఫలితాలు లెఫ్ట్ కూటమికి అనుకూలంగా ఉన్నాయని ఆయన అంగీకరిస్తూ, తమ ఓటమికి దారితీసిన కారణాలను విశే్లషిస్తామని చాందీ గురువారం మీడియాతో అన్నారు. పరాజయానికి యుడిఎఫ్ చైర్మన్‌గా తాను బాధ్యత వహిస్తానన్నారు.

05/19/2016 - 15:12

దిల్లీ: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును తాము శిరసావహిస్తామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల్లో గెలిచిన పార్టీలను ఆయన అభినందించారు. కాంగ్రెస్ విజయం కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

05/19/2016 - 14:33

జమ్మూ: జమ్మూలోని వైష్ణోదేవి ఆలయ పరిసరాల్లో బుధవారం రాత్రి కార్చిచ్చు వ్యాపించింది. త్రికూట కొండల్లోని బన్‌గంగా లోయలో మొదలైన కార్చిచ్చు 10 కి.మీ.ల వరకు వ్యాపించి ఆలయ సమీపంలోకి వచ్చింది. హెలికాప్టర్లతో మంటలు అదుపుచేస్తున్నారు. యాత్రకు వచ్చిన ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని ఆలయ అధికారులు పేర్కొన్నారు.

05/19/2016 - 13:23

చెన్నై: డిఎండికె పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు కెప్టెన్ విజయ్‌కాంత్ ప్రభావం తమిళనాడు ఎన్నికల్లో ఈసారి నామమాత్రంగా లేకుండా పోయింది. సాక్షాత్తూ ఆయనే ఉలుందూర్‌పెట్టైలో తొలిరౌండ్ నుంచి వెనుకబడే ఉన్నారు. ఇక్కడ డిఎంకె అభ్యర్థి వసంతవేల్ ఆధిక్యతలో ఉన్నారు. మిగతాచోట్ల కూడా ఎక్కడా విజయ్‌కాంత్ పార్టీ ప్రభావం చూపలేకపోతోంది.

05/19/2016 - 13:23

చెన్నై: తమిళనాడు ప్రజలు కుటుంబ రాజకీయాలకు తెరదించారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత విజయగర్వంతో అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యత దిశగా తన పార్టీ దూసుకుపోతున్న సందర్భంగా ఆమె విలేఖరులతో మాట్లాడుతూ, కుటుంబ రాజకీయాలకు ఇది గుణపాఠం అని పరోక్షంగా డిఎంకెపై వ్యాఖ్యానించారు. వరసగా రెండోసారి అధికారాన్ని అప్పగించినందుకు ఓటర్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

05/19/2016 - 13:22

తిరువనంతపురం: క్రికెట్‌లో కష్టాలను చవిచూశాక, రాజకీయ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించిన మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌కు నిరాశే మిగిలింది. తిరువనంతపురంలో బిజెపి తరఫున బరిలో నిలిచిన ఆయన ఓటమి చెందారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి శివకుమార్ విజయం సాధించారు. శివకుమార్ గత ఎన్నికల్లోనూ ఇదే స్థానం నుంచి గెలిచారు.

Pages