జాతీయ వార్తలు

దర్యాప్తు సంస్థల్లో సర్కారు జోక్యం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 20: మాలేగావ్ పేలుళ్ల కేసు దర్యాప్తులో దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఎను రాజకీయ జోక్యంతో ప్రభావితం చేసినట్లు వచ్చిన ఆరోపణలను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తోసిపుచ్చారు. దేశంలోని దర్యాప్తు సంస్థలన్నీ పూర్తి స్థాయి స్వయంప్రతిపత్తితో పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. ‘మన దర్యాప్తు సంస్థలన్నింటికీ పూర్తి స్థాయి స్వయంప్రతిపత్తి ఉంది. మా వైపు నుంచి కాని ప్రభుత్వం వైపు నుంచి కాని ఎలాంటి జోక్యం లేదు’ అని ఆయన అన్నారు. సరిహద్దు భద్రతాదళం (బిఎస్‌ఎఫ్) శుక్రవారం ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి విడిగా విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. 2008నాటి మాలేగావ్ పేలుళ్ల కేసులో ఎన్‌ఐఎ గత వారం పూర్తిగా యు-టర్న్ తీసుకొని సాధ్వి ప్రజ్ఞాసింగ్, మరో అయిదుగురిపై ఉన్న అభియోగాలన్నింటిని ఎత్తివేసిన విషయం తెలిసిందే. లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్ సహా పది మంది నిందితులపై కఠినమైన మోకా చట్టం కింద నమోదు చేసిన అభియోగాలను కూడా ఎన్‌ఐఎ ఉపసంహరించుకుంది. పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి కేసులో దర్యాప్తు అధికారులు పాకిస్తాన్‌ను సందర్శించడానికి గడువు ఏమైనా ఉందా? అని ప్రశ్నించగా, ఈ అంశంపై ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులు చర్చించారని మంత్రి బదులిచ్చారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను రాజ్‌నాథ్ సింగ్ బిజెపికి లభించిన అద్భుత విజయంగా అభివర్ణించారు. బిజెపికి పార్లమెంటులో స్పష్టమైన ఆధిక్యత ఉందని, స్వతంత్రంగా కాని సంకీర్ణ కూటమిలో భాగస్వామిగా కాని బిజెపి 14 రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు. దేశంలోని ఓ పెద్ద భూభాగం ఇప్పుడు బిజెపి పరిధిలో ఉందని ఆయన తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలన్న ఆ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై ప్రశ్నించగా, అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయమని, అందువల్ల తాను ఆ విషయంపై వ్యాఖ్యానించదలచుకోలేదని రాజ్‌నాథ్ సింగ్ బదులిచ్చారు. వామపక్ష తీవ్రవాద ప్రాబల్యం గల ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పారా మిలిటరీ బలగాలకు స్పెషల్ రిస్క్ అలవెన్స్‌ను చెల్లించే విషయంపై కేబినెట్ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.

బిఎస్‌ఎఫ్ కార్యక్రమంలో సీనియర్ అధికారులతో
కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్