జాతీయ వార్తలు

కేరళ సిఎంగా విజయన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం: కేరళ నూతన ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ (72) బాధ్యతలు చేపడతారని సిపిఎం అగ్రనేతలు సీతారాం ఏచూరి, ప్రకాష్ కారత్ శుక్రవారం ఇక్కడ ప్రకటించారు. ఇక్కడి సిపిఎం కార్యాలయంలో జరిగిన పార్టీ సమావేశంలో సిఎం పదవికి తొలుత మాజీ సిఎం అచ్యుతానందన్ (92) పేరు పరిశీలనకు వచ్చినప్పటికీ, ఆ తర్వాత మెజారిటీ నేతల అభిప్రాయం మేరకు విజయన్‌ను ఎంపిక చేశారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష కూటమి (ఎల్‌డిఎఫ్) అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఘోర పరాజయాన్ని చవిచూడడంతో ముఖ్యమంత్రి పదవికి ఊమెన్ చాందీ రాజీనామా చేశారు.