S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాధ్యాయ సందోహం

08/18/2019 - 22:16

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*

08/15/2019 - 22:11

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
వేద పరిభాషలో సర్వశబ్దాలు గిక శబ్దాలే కాబట్టి ఆవేశపూరితంగా ఏదేని కార్యాన్ని నిర్వహించడవని అర్థం. ఈ అర్థానే్న క్రింద ఋగ్వేద మంత్రం ఇలా వివరిస్తూంది.
మన్యురింద్రో మన్యురేవాస దేవో మన్యుర్హోతా వరుణో జాతవేదాః
మన్యుం విశ ఈళతే మానుషీర్యాః పాహి నో మన్యో తపసా సజోషాః॥

08/13/2019 - 18:48

భూమ్యాకాశాలు, అంతరిక్షం, పర్వతాలు, సముద్రాలు వీనితో కూడిన సర్వజగత్తులోని సామర్థ్యాన్ని ఒక్కసారి పరిశీలించండి. సమస్త జీవులను పోషిస్తుంది కాబట్టి భూమికి పూష అని పేరు. అందుకే వేదాలు భూమిని మాతగా ప్రశంసించాయి. మహామహా భారవంతమైన మహా పర్వతాలను, నదీ నదాలను, సముద్రాలను భూమి తన గుండెలపై పెట్టుకొని వహిస్తూంది. వీనినే కాక అనేక వస్తుజాలాన్ని కూడ భూమి వహిస్తూంది. అట్టి ఈ భూమి శక్తి ఎంతయో ఎవరు గణించగలరు?

08/12/2019 - 18:41

పరిత్యజింపదగిన వారినికూడా దరిజేర్చుకొంటున్నావు. అంధులకు సన్మార్గాన్ని చూపుతున్నావు. చెవిటి వారికి సత్ప్రవచనాన్ని వినిపిస్తున్నావు. అట్టి నీవు అన్నివిధాలుగా కీర్తనీయుడవు.

08/11/2019 - 19:23

పఆచార్యుడు శిష్యులకు ఉపనయన సందర్భంలో చెప్పబడే మంత్రమే ఇది. ఉపనీత శిష్యులను ఉత్తములుగా తీర్చిదిద్దడమాచార్యుని విధి. శిష్యుల అభిరుచి, ప్రవృత్తి మనఃస్వభావం మున్నగునవి పరీక్షించి వారిని ఉత్తమ లక్ష్యాలుగల వారిగాచేసి తనకనుకూలంగా- విధేయంగా చేసుకోవలసియుంది. మనస్సును సంస్కరించాలంటే విద్యార్థుల లక్ష్యాలను పవిత్రంగా ఉదాత్తంగా మలచవలసి యుంటుంది. మనస్తత్వ వివేచనా జ్ఞానంలేకుండ ఇది ఎవరికి సాధ్యంకాదు.

08/08/2019 - 19:54

వీరిరువురిలో నిష్కాములను దేవ= దివ్యులని అంటారు. ఈ నిష్కాములయినవారు ప్రీతిగా బోధించినా చాలమంది పెడచెవిని పెడుతూ ఉంటారని ‘అకామా విశే్వ వో దేవాః శిక్షంతో నోప శేకిమ’ (అథ.వే.6-114-3) ‘‘కామనారహితులమై నిష్కాములమైన మేము మిమ్మెంత శిక్షించినా (బోధించినా) కామనారహితులనుగా చేయలేకున్నాం’’ అని అథర్వణవేదం విచారాన్ని వ్యక్తం చేసింది. ఇట్టి నిష్కాములైన వారి మార్గం దేవయాన మార్గం. వీరినే దివ్యులని వ్యవహరిస్తారు.

08/07/2019 - 19:46

ప్రస్తుత మంత్రంలో ‘సహస్ర భృష్టి శతాశ్రీ’ అనే వజ్రాయుధం వర్ణింపబడింది. ‘శతాశ్రీ’ అనగా వందల కొలది పదనులు గలదని అర్థం. అంటే ఈ ఆయుధం వందల కొలది పదును అంచులు కలదై వేల కొలది శత్రువులను సంహరింపగల మారణాయుధంగా గ్రహించాలి.

08/06/2019 - 20:46

జ్ఞానులకీ మర్మం బాగా తెలుసు. అందుచేత ‘త్వా విశే్వ...్భరాయ’ జీవన సంగ్రామం కొఱకు, భరణ-పోషణల కొఱకు విద్వాంసులు ఆ పరమాత్మనే ముందుంచుకొని జీవనం గడుపుతారు. మూర్ఖులయినవారికి దీని భావం తెలియక ఎందుకు? ఏమిటి? అంటూ విద్వాంసులను ప్రశ్నిస్తూ వారితో వాదనలు చేస్తారు. అప్పుడు కూడ దైవాన్ని విశ్వసించిన విద్వాంసులు వారితో వాదనలు చేయక ‘వృణత ఇంద్ర మంత్ర’ ‘‘దైవానే్న ఎంచుకొని ఆయనతోనే ప్రసంగిస్తారు’’.

08/05/2019 - 17:41

యోగ్యతానుసారం సంస్కారవంతులను చేయి
తవ క్రత్వా తవ తద్దంసనాభిరామాసు పక్వ శచ్యా ని దీధః
ఔర్ణోర్దుర ఉస్రియాభ్యోవి ద్ళల్హోదూర్వాద్ గా అసృజో అంగిరస్వాన్‌॥॥
భావం:- నీవు నీ బుద్ధివిశేషంతో, కర్మలతో, దృష్టాంతాలతో పరిణతిలేని బుద్ధిగల వారియందు పరిపక్వతను నింపుము. జ్ఞాన కిరణాలపైగల అడ్డంకులను తొలగించు. జ్ఞానివై ఇంద్రియాలను హింసాప్రవృత్తినుండి విడుదల చేయి.

08/04/2019 - 22:08

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
చేతులెత్తి నమస్కరించు
వీతీ యో దేవం మర్తో దువస్యేదగ్ని మీళీతాధ్వరే హవిష్మాన్‌
హోతారం సత్యయజం రోదస్యోరుత్తానహస్తో నమసా వివాసేత్‌॥

Pages