స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పఆచార్యుడు శిష్యులకు ఉపనయన సందర్భంలో చెప్పబడే మంత్రమే ఇది. ఉపనీత శిష్యులను ఉత్తములుగా తీర్చిదిద్దడమాచార్యుని విధి. శిష్యుల అభిరుచి, ప్రవృత్తి మనఃస్వభావం మున్నగునవి పరీక్షించి వారిని ఉత్తమ లక్ష్యాలుగల వారిగాచేసి తనకనుకూలంగా- విధేయంగా చేసుకోవలసియుంది. మనస్సును సంస్కరించాలంటే విద్యార్థుల లక్ష్యాలను పవిత్రంగా ఉదాత్తంగా మలచవలసి యుంటుంది. మనస్తత్వ వివేచనా జ్ఞానంలేకుండ ఇది ఎవరికి సాధ్యంకాదు. శిష్యుల మనఃప్రవృత్తుల ఆధారంగా వారి దుస్సకల్పాలను గ్రహించి అవి రెచ్చిపోని విధంగా సంస్కరించడం మనస్తత్వ నిపుణుడైన ఆచార్యుని ముఖ్య కర్తవ్యం. నిస్సందేహంగా ఇది కష్టసాధ్యమైనదే అయినా ఆచార్యత్వం మీ కళయందే సార్థకమవుతుంది.
ఆచార్య శబ్దానికి నిర్వచనం చెబుతూ యాస్కుడు ‘ఆచార్యః కస్మాత్? ఆచరాం గ్రాహయతి’ (నిరుక్తం.1-2-4) ‘‘ఆచార్యుడు ఎందువల్ల? ఆచారాలను ఆచరింపచేసేవాడు కావడం చేతనే’’. శిష్యుడిచేత ఆచారాల నాచరింప చేయడమన్నది ఆతడి సంకల్పాలను సంస్కరింపక సాధ్యంకాదు. అందుచేతనే ఉపనయన సందర్భంలో ఆచార్యుడు ‘అమీ యే వివ్రతా స్థన...వేత’ ‘‘జీవిత లక్ష్యాలులేని మీ అందరిని జీవిత లక్ష్యాల వైపునకు మరలిస్తున్నాను’’అని అంటాడు. నిజమే కదా! భవిష్యజ్జీవితానికొక లక్ష్యమే లేకుంటే ఇక మనస్సులో సంకల్పాలు ఏవి జనిస్తాయి?
లక్ష్యాలు నిర్ధారణ అయితే మనస్సు తదనుగుణమైన సంకల్పాలను సంకల్పించుకొంటుంది. అప్పుడు సంకల్పాలకనుగుణంగా లక్ష్యసాధనలో శిష్యుణ్ణి ఆచార్యుడు తీర్చిదిద్దగలుగుతాడు. అంటే ఆచార్యుడు శిష్యుడు సంకల్పించుకొన్న మార్గంలో సమర్థవంతంగా తీర్చిదిద్దగలుగుతాడన్నమాట. మనుస్మృతిలో మనువుకూడ ఈ అభిప్రాయానే్న వ్యక్తపరచాడు. చూడండి.
ఆచార్య స్త్వస్య యాం జాతిం విధవద్ వేదసారగః
ఉత్పాదయతి సావిత్య్రా సా సత్యాసా- జరామరా॥
‘‘వేదజ్ఞుడైన ఆచార్యుడు వేదాధ్యయనం ద్వారా తన శిష్యుడికి ఏ వర్ణం (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు) గలవానిగా తయారుచేస్తాడో అదే సత్యమైనది. అజరామరమైనది.’’
ఈ మంత్రంలోని పూర్వార్థంలో ‘‘మీ మనస్సులను-లక్ష్యాలను, సంకల్పాలను నాకనుకూలంగా త్రిప్పుకొంటున్నాను’’అన్న అర్థంకూడ ఉంది. అంటే విద్యార్థిని అధమస్థాయినుండి ఉన్నతస్థాయికి తెస్తున్నానని ఆచార్యుని శిక్షణా లక్ష్యంగా భావించాలి. వైదికాచార్యుని సంకల్పం మహోదారం. ఏ కాలానికయినా ఆదర్శం. శిష్యుడు ఆచార్యుని సంకల్పశుద్ధిని గ్రహించి ప్రణమిల్లి ఆయన వచనాలను శిరసావహిస్తాడు. ఈ విధంగా వినమ్రుడైన శిష్యుడు ఆచార్యునితో, ఆచార్యుడు శిష్యునితో పరస్పరం పలికే ఈ ప్రతిజ్ఞను ఆశ్వలాయన గృహ్యసూత్రమీవిధంగా వివరించింది.
మమ వ్రతే తే హృదయం దధామి మమ చిత్తమనుచిత్తం తే అస్తు
మమ వాచమేకమనా జుషస్వ బృహస్పతిష్ట్వా నియునక్తు మహ్యమ్‌॥
(అశ్వ.గృహ్య సూ.1-21-7)
నేను నా లక్ష్యసాధనలో నా హృదయాన్ని మీ హృదయంలో నిక్షిప్తం చేస్తున్నాను. నీ లక్ష్యసాధనలో నా హృదయాన్ని నీ హృదయంలో లగ్నం చేస్తున్నాను. నా మనసు మీ మనస్సునకనుకూలమై యుండుగాక! మీ మనస్సు నా మనస్సునకు అనుకూలమై ఉండుగాక! నా మాటను శ్రద్ధగా విను. భగవంతుడు నిన్ను నాకోసమే నియుక్తుని చేసాడు.
పతితోద్ధారకుడే ప్రశంసనీయుడు
అరమయః సరపసస్తరాయ కం తుర్వీతయే చ వయ్యాయ చ స్త్రుతిమ్‌
నీచా సంతముదనయః పరావృజం ప్రాంధం శ్రోణం శ్రవయన్త్సాస్యుక్థ్యః॥
భావం:- ఓ ప్రభూ! నీవు పాపులను శిక్షించి, శిక్షణనిచ్చి ఉద్ధరించేందుకు సంతోష పూర్వకంగా సంచరిస్తున్నావు. పాపోద్ధరణ కార్యార్థంగా నీవు అనేక సాధన సంపత్తిని విస్తారంగా చేకూర్చుకొని ప్రవర్తిస్తున్నావు. పతితులను ఉద్ధరిస్తున్నావు. పరిత్యజింపదగిన వారినికూడా దరిజేర్చుకొంటున్నావు. అంధులకు సన్మార్గాన్ని చూపుతున్నావు. చెవిటి వారికి సత్ప్రవచనాన్ని వినిపిస్తున్నావు. అట్టి నీవు అన్నివిధాలుగా కీర్తనీయుడవు.వివరణ:- అల్పజ్ఞత, అవిద్య, దురాగ్రహం మొదలైన దుర్గుణాల వలన మనిషి అపరాధాలు చేస్తాడు. అదే మనిషికి పతన దశ. పతితులను చూచి ఎగతాళిచేయడం దుర్జనుల పని.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512