స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్ఞానులకీ మర్మం బాగా తెలుసు. అందుచేత ‘త్వా విశే్వ...్భరాయ’ జీవన సంగ్రామం కొఱకు, భరణ-పోషణల కొఱకు విద్వాంసులు ఆ పరమాత్మనే ముందుంచుకొని జీవనం గడుపుతారు. మూర్ఖులయినవారికి దీని భావం తెలియక ఎందుకు? ఏమిటి? అంటూ విద్వాంసులను ప్రశ్నిస్తూ వారితో వాదనలు చేస్తారు. అప్పుడు కూడ దైవాన్ని విశ్వసించిన విద్వాంసులు వారితో వాదనలు చేయక ‘వృణత ఇంద్ర మంత్ర’ ‘‘దైవానే్న ఎంచుకొని ఆయనతోనే ప్రసంగిస్తారు’’. అంటే జ్ఞానులు మూర్ఖులతో వాదానికి సిద్ధపడరని భావం. వారికి దైవమే ఆదర్శం, ఆరాధ్యం.
**
విశ్వకర్మ సహస్ర భృష్టి వజ్రాన్ని నిర్మించుగాక!
అధ త్వ షా తే మహ ఉగ్ర వజ్రం సహస్రభృష్టిం వవృతచ్ఛతాశ్రీమ్‌
నికామమరమణసం యేన నవంతమహిం సం పిణగృజీషిన్‌॥ ॥
భావం:- ఓ విశ్వకర్మా! ఏ ఆయుధం లొంగదీసుకోదగిన భయంకరమైన శత్రువును పూర్తిగా అణచివేయగలదో అట్టి వేల మందిని చంపే వందల పదును అంచులు గల సహస్ర భృష్టి అనే వజ్రాయుధాన్ని నీవు నిర్మాణం చేయుము.
వివరణ:- వేదాలలో వందల మారణాయుధాల నిర్మాణం మరియు ప్రయోగాల గురించి ప్రస్తావనలున్నాయి. వానిలో చాలా ప్రధానమైనది, శక్తివంతమైనది వజ్రం. వజ్రాయుధాలలో చాలా రకాలున్నాయి. వానిలో ఒకటి ‘ఆయన వజ్రం.’
దీనివర్ణన వేదంలో చాలచోట్ల కనబడుతుంది. ఉదాహరణకు- ‘హరివాన్ దధే ‘హస్తయోర్వజ్ర మాయసమ్’ (ఋ.1-81-4) ‘‘శత్రు సంహారం చేయగల వీరుడు చేతిలో ఆయన వజ్రాయుధాన్ని ధరిస్తాడు’’. ఆయన శబ్దానికర్థం లోహమని. అంటే లోహ నిర్మితమైనట్టిది ఆయస వజ్రమని గ్రహించాలి.
‘హిరణ్య వజ్రాయుధ’ మన్న మరో వజ్రాయుధ ప్రసక్తి వేదాలలో కనబడుతుంది. చూడండి- ‘త్వష్టా యద్వజ్రం సుకృతం హిరణ్యయం సహస్రభృష్టిం స్వపా అవర్తయత్’ (ఋ.1-85-9) ఉత్తమ శిల్పకారుడైన త్వష్ట గొప్పగా హిరణ్యయ సహస్రభృష్టి వజ్రాన్ని నిర్మించాడు’’ సహస్ర భృష్టి శబ్దానికర్థం ఒక్కమారుగ వేల మందిని హతమార్చు మారణాయుధమని.
మరో వజ్రాయుధం ‘సాయక వజ్రం’ ఋగ్వేదంలో ‘వజ్రం హిన్వంతి సాయకమ్’ (ఋ.1-84-11) ‘‘యుద్ధంలో సాయక వజ్రం శత్రువులను హింసిస్తున్నది’’ అని ప్రస్తావన కనబడుతుంది.
- ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512