స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
*
ఆ సాధనలో తాను కృతకృత్యుడను కాగలనో లేదో స్వయంగా పరీక్షించుకోవాలంటే సన్మార్గంతోబాటు వర్జనీయమైన మార్గంకూడ తెరువబడి సులభంగా ప్రవేశయోగ్యమైనప్పుడే కదా. కాబట్టి తననుతాను పూర్వవాసనా సముచ్చయంనుండి విముక్తిపొందగల సాధనకొరకే ‘వృజినం చ’ వర్జనీయ మార్గాన్నికూడ తెరువమని దైవాన్ని ప్రార్థించాడు. అయితే భగవానుడు సవికల్పసమాధి స్థాయికి చేరి తన దర్శనభాగ్యాన్ని పొందిన సాధకుడు వర్జనీయ మార్గానికి పోతూంటే చూస్తూ ఉంటాడా? ఆయన ఋజుమార్గప్రియుడు. అలా చేయడు ‘తయోర్యత్సత్యం యతరదృజీయ- స్తదిత్సోసోమో- వతి హంత్యాసత్’ (అథ.వే.8-4-12) ‘‘ఋజు మరియు వర్జనీయ మార్గాలలో భగవంతుడు ఋజుమార్గప్రియుడు. ఆ మార్గగామిని ఆయన రక్షిస్తాడు. మిథ్యామార్గాన్ని నాశనంచేస్తాడు’’ అని అథర్వణవేదం మర్మాన్ని విప్పి చెప్పింది.
అందుచేత పిల్లాపాపలుగల గృహస్థుడు తన బిడ్డల్ని రక్షించుకొనేందుకు ఆక్రోశిస్తూ వారివెంట పడినట్లుగా ఓ ప్రభూ! అస్వతంత్రులమైన మమ్ము రక్షింపుము. ‘మర్యో దేవ ధన్వ పస్త్యావాన్’అంటూ ప్రార్థించమని సాధకుడికి వేదం గురూపదేశం చేస్తూంది.
న్యాయశిక్షణా కేంద్రం ఇల్లే
భూమ్యా అంతం పర్యేకే చరంతి రథస్య ధూర్షు యుక్తాసో అస్థుః
శ్రమస్య దాయం వి భజంత్యేభ్యో యదా యమో భవతి హర్మ్యే హితః

భావం:- కొందరు లోకంలో భూమి చివరకు సంచరిస్తూ శ్రమజీవులై జీవిస్తూ ఉంటారు. మరికొందరు తిరిగే రథానికి గల ఇరుసునకు బిగించబడిన బండికన్ను ఆకుల మీద సుఖాసీనులై ఉంటారు. కాని భూమి చివరకు పరిశ్రమించి సంచరించే శ్రమజీవుల కష్టానికి తగిన ప్రతిఫలం గృహంలో వారి హితవును కోరే నియామకుడు ఉన్నప్పుడే లభిస్తుంది.
వివరణ:- శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని చెప్పే అద్భుత శ్రమవాద సిద్ధాంతానికి బీజ మీమంత్రంలో స్పష్టంగా కనబడుతుంది. దానితోబాటు శ్రమైకజీవుల శ్రమకు తగిన ప్రతిఫలమెందుకు సమాజంలో లభించడం లేదు? దానికి ముఖ్య కారణం- సమాజంలో దానిని నియంత్రించే నియంత్రణ వ్యవస్థ లేకపోవడమేనని ఒక గొప్ప సిద్ధాంతాన్ని ఆవిష్కరించింది. ఇది అత్యాధునిక సామాజిక న్యాయశాస్తవ్రేత్తలు సహితం కాదనరాని సత్యం. దీనిని వివరించే ఎన్నో సామాజిక న్యాయశాస్త్రాలు వచ్చాయి. కాని శ్రమజీవికి అతడి శ్రమకు తగిన ప్రతిఫలం లభించాలి అంటే ఏమిచేయాలి? అన్న విషయంమీద ఎన్నో సూత్రాలు వచ్చినా వేదమీ మంత్రంలో-
‘శ్రమస్య దాయం వి భజంత్యేభ్యో యదా యమో భవతి హర్మ్యే హితః’ గృహంలోనే యమః= నియంత్రించే నియామకుడున్నప్పుడే శ్రమజీవులు తమ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు’’అని సూచించిన పరిష్కారం మాత్రం అత్యద్భుతమైనది. ఎందుకంటే సమాజంలోని జనులు ఆ సమాజంలోని కుటుంబాలలోని సభ్యులేకదా! కుటుంబంలో శిక్షణ పొందని వ్యక్తులు సమాజంలో ఎక్కడుంటారు? అట్టివారుండాలంటే ముందుగా కుటుంబమే శిక్షణ కేంద్రమైయుండాలి. అంటే సర్వాధికారి, సర్వతంత్ర నియామకుడు మరియు కుటుంబ పెద్ద ఉన్నప్పుడే ఆ కుటుంబమావిధంగా ఈ విషయంలో సమాజ శిక్షణా కేంద్రమవుతుంది. కుటుంబపరమైన ఈ వ్యవస్థయే సమాజంలో పటిష్ఠంగా ఉన్నప్పుడు శ్రమజీవికి తగిన ఫలమందాలనే న్యాయం సహజంగా వెల్లివిరుస్తుంది. ఎన్నో వేల ఏండ్లకు పూర్వమే వేదం ప్రతిపాదించిన ఈ సత్యాన్ని సమాజమింకా గుర్తించనే లేదు.
శ్రమజీవి శ్రమను దోపిడీ చేసే సమాజంలోని దుర్వ్యవస్థను వేదం విడిచిపెట్టలేదు. కవితాత్మక భాషలో ‘్భమ్యా అంతం పర్యేకే చరంతి, రథస్య ధూర్షు యుక్తాసో అస్థుః’ ‘లోకంలో భూమి చివరివరకు తిరిగే శ్రమజీవులు కొందరుంటారు. మరికొందరు రథానికి బిగింపబడిన ఇరుసుమీద సుఖాసీనులై యుంటారు’’ అని వర్ణించింది. సమాజంలోని ఆర్థిక అసమతుల్యత నింత సూక్ష్మంగా విశే్లషించిన వేల ఏండ్ల నాటి వేద పరిశీలనా దృష్టికి సామాజిక న్యాయశాస్తవ్రేత్త ఎక్కడివాడైనా- ఎవడైనా జోహారు పలుకవలసిందే.
ఈ వేదానుశీలనను అందిపుచ్చుకొన్న నీతికారులెందరో ఉన్నారు. వారిలో భర్తృహరి ముఖ్యుడు. ఆయన శ్రమజీవులకు ఎదురయ్యే దగాకోరుతనాన్ని ‘భ్రాంతం దేశమనేక దుర్గవిషమమ్’ ‘‘ఎన్నో సంకట మరియు విషమ పరిస్థితుల నెదుర్కొంటూ దేశమంతా తిరిగాను’’ కాని నాకు ‘లబ్ధో న కాణవరాటకో- పి.’ ‘‘చిల్లిగవ్వ కూడ దొరకలేదు’’ అని కనులకు కట్టినట్లు చెప్పాడు.
సమాజంలోని ఈ దుర్వ్యవస్థ సరిదిద్దబడాలంటే ఒక పటిష్ఠమైన వ్యవస్థ ఉండాలని వేదం సూచించింది. అది ‘యమః’ ‘యముడు’గా కఠినంగా నిర్ధాక్షిణ్యంగా ఉండాలని కఠినంగా సూచించింది. యముడంటే దండధరుడని అర్థం. అంటే సమాజ నియమాలని ఉల్లంఘించేవారి ఎడల దండధరుడువలె కఠినంగా వ్యవహరించే సర్వతంత్ర సత్తాకమైన- నిష్పాక్షిక దృష్టిగల వ్యవస్థ ఉండాలని వేదాభిమతం. ఈ అభిమతాన్ని పేరు విన్నంతనే భయం కలిగే ‘యమ’శబ్దంతో వేదం నిర్దేశించింది. ఈ నిర్దేశంలో ‘మా హం రాజన్నన్యకృతేన భోజమ్’(ఋ.2-28-9) ‘‘పరుల సొమ్ము మేము భుజింపము’’అన్న సౌశీల్యం జనించాలని వేదమభిలషించింది. నిజంగా సమాజంలో ఈ భావనే దృఢపడితే శ్రమజీవి శ్రమను సమాజంలో దోపిడీచేసే వ్యవస్థకు కాళ్లు-చేతులు నరికివేయబడినట్టే. ‘అంతా శ్రీవైష్ణవులే, గంపెడు చేపలు ఎక్కడికిపోయినట్టు?’అన్న ప్రకారంగా పరుల సొత్తున కాశపడరాదన్న సూక్తి సమాజానికి బాగాతెలిసినదే అయినా ఎందుకో అదే దినదిన ప్రవర్ధమానమవుతూంది. దాని దుష్ఫలితమే సమాజంలోని శ్రమ దోపిడి.
***

ఇంకాఉంది