స్వాధ్యాయ సందోహం
స్వాధ్యాయ సందోహం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
*
మానవుల మధ్యనే కాదు తల్లి-తండ్రి, భర్త-బిడ్డ ఇలా రక్తసంబంధం గలిగిన ఆత్మీయుల ఎడలకూడ తరతరాలుగా మానవ జాతి గమనం ఒకటిగా కాదు కదా తద్విరుద్ధంగా మారిపోయింది. కలిసి ఒకటిగాఉండక కలహించుకొంటూ ఉన్నారు. విరోధభావన- వైమనస్య భావనలు కలిగిన మానవ సమాజాన్ని చూచి సంక్షుభితమైపోయిన వేదమాత తన బిడ్డలను చూచి 3సం గచ్ఛ్ధ్వం సంవదధ్వం సం వో మనాంసి జానతామ్2(ఋ.10-191-2) 34కలిసి నడవండి. కలిసి ఒకటి పలకండి. కలిసి ఒకటే ఆలోచించండి22అని ఎంతో లాలనతో హితవుచెప్పింది. చెబుతూనే ఉంది. కాని ఆ హితాన్ని ఎందరు వింటున్నారు? తరతరాలుగా మానవ జాతి గమనం ఒకటిగా కాదు కదా తద్విరుద్ధంగా మారిపోయింది. కలిసి ఒకటిగా మాటలాడుకోవడం కాదుకదా కలహించుకొంటూ ఉన్నారు. మనస్సులొకటిగా ఆలోచించడం లేదు. విరుద్ధంగా ఆలోచిస్తున్నాయి. ఈ దుఃస్థితి సమాజంలో నెలకొన్నంతకాలం మానవ శరీరధారులు కోట్లకొలది ఉండవచ్చునేమో గాని మానవులన్న వారెందరెక్కడుంటారు? సమాజమెందుకీ విధంగానే తరతరాలనుండి ఉంటూంది? దీనికి సమాధానంగా వేదమే ‘ద్వితీయాద్వై భయం భవతి’ ‘‘రెండవది ఉన్నదన్న మనోభావన వలననే భయం జనిస్తూంది’’అని దానివల్లనే మనిషి మరొక మనిషిని తనకంటే వేరుగా చూచి భయం పొందుతున్నాడని పేర్కొంది. నిజంగా మనిషి మనిషి వేరువేరైనవారా? కాదు. అంటే ఒక మనిషిలో అతడి తల్లిదండ్రుల ఇద్దరి రక్తం ప్రవహిస్తూ ఉంటున్నది అందరికి తెలిసిన విషయమే. కాని తెలిసినా విస్మరించే విషయమేమంటే తనలో తన తల్లిదండ్రుల రక్తంతోబాటు వారి తల్లిదండ్రులైన నలుగురి రక్తం కూడ కలిసి ప్రవహిస్తూ ఉందని. అలా మరికొంత దూరం విచారిస్తే వారి వారి ఎందరో పూర్వుల రక్తం తనలో ప్రవహిస్తూ ఉందని సులభంగా అర్థమవుతుంది. అంటే తనకు తన పూర్వులైనవారి జనులెందరితోనో గల రక్తసంబంధం చేత అందరూ సోదర-సోదరీమణులే కదా. ఈ సూత్రాన్ని సమష్టి మానవ జాతికి అన్వయిస్తే సమస్త మానవజాతికి మూల పురుషుని రక్తమే మానవజాతి సమష్టి రక్తం. కాబట్టి మానవులందరు రక్తసంబంధీకులే. ఈ దృష్ట్యా చెప్పబడిన ఆ మానవజాతి మూలపురుషుడే ‘మనువు’. మనువుకు పుట్టినవారు కాబట్టి ‘మానవులు’అయ్యారని మానవశబ్దానికి నిర్వచనం చెప్పబడింది. ఈ నిర్వచనం కేవలం భారతదేశానికే పరిమితమైనది కాదు. పాశ్చాత్యులు చెప్పే మేన్ శబ్దానికి నిర్వచనం కూడ దీనికి సన్నిహితమైనదే. మరి మానవుడు మరొక మానవుని చూచి వేరువాడని భావించి భయపడవలసిన పని ఏముంది? వైరుధ్య- వైమనస్యభావాలతో కలహించుకోవలసిన పని ఏమిటి? ఈ మహార్థానే్న లక్షించి వేదం ‘మనుర్భవ’ ‘‘మానుషత్వంగల మానవుడవుకమ్ము’’అని ఆదేశించింది.
వేద భగవతి ‘మనుర్భవ’ ‘‘మనుష్యుడవు కమ్ము’’అని సందేశమిచ్చి మిన్నకుండలేదు. ఎలా కావాలో కూడ కొన్ని సూచనలను చేసింది. అందులో మొదటిది ‘తంతుం తన్వన్ రజసో భానుమన్విహి’ ‘‘ప్రపంచమనే వస్త్రాన్ని నిర్మాణం చేస్తూనే ప్రకాశవంతమైన జ్ఞానమార్గాన్ని అనుసరించి అలా నడుచుకో’’అన్నది. అంటే ఓ మానవుడా! నీవుచేసే ప్రతి కర్మ జ్ఞానమార్గాన్ని అతిక్రమించరాదని ఆంతర్యం. దానికేమిచేయాలో కూడ వేదమే భాను మన్విహి ‘‘ప్రకాశమానమైన జ్ఞానప్రకాశం వెంట నడువు’’మని సూచించింది. సూచనవరకు ఉచితమే. కాని ఆ జ్ఞానప్రకాశం మెరుపుతీగలా చంచలమైయుంటే దాని ననుసరించడం సాధ్యమా? కాబట్టి ఆ జ్ఞానప్రకాశాన్ని మెరుపుతీగలా చంచలమైయుంటే దానిననుసరించడం సాధ్యమా? కాబట్టి ఆ జ్ఞానప్రకాశాన్ని సుస్థిరంగా ఉండే విధంగా రక్షించుకోమంటూ ‘జ్యోతిష్మతః పథో రక్ష ధియా కృతాన్’ బుద్ధివిశేషం చేత కల్పింపబడిన జ్ఞానప్రకాశమయమార్గాలను సంరక్షించు’’మని వేదం హెచ్చరించింది.
ఈ వేద సందేశం చాల విశాలమైనది. గంభీరమైనది. ఆదరణీయమైనది. ఎందుకంటే విజ్ఞానం ఒక్కరోజున హఠాత్తుగా జనించినట్టిది కాదు. అనేకులు తమ నిరంతర పరిశోధనా చక్షువులతో శోధించి కనుగొనగా రూపుదాల్చిన అమూల్య అపూర్వసంపద అది. అది గ్రంథరూపంగా ఉండవచ్చు. కళాఖండాలుగా ఉండవచ్చు. అద్భుత నిర్మాణరూపంగా ఉండవచ్చు. ఏవి ఎలాఉన్నా అవన్నీ పూర్వులు తాము ఆర్జించిన విజ్ఞానాన్ని తరువాత తరాలవారికి అందించి వెళ్లిపోయిన వారసత్వ జ్ఞాన భాండాగారాలు. వానిని కాపాడుకోవడం మానవుల ప్రథమ కర్తవ్యమని వేదం ఆదేశించింది. దానిని విస్మరించిన జాతికి జ్ఞానపథ ప్రయాణంలో పురోగతికాదు అధోగతియే.
ఒక్క ఉదాహరణ గమనించండి. రామాయణంలో పుష్పక విమానం చెప్పబడింది. పురాణాలలో విమాన ప్రస్తావనలెన్నో ఉన్నాయి అని ఇప్పటికి గొప్పలు చెప్పుకుంటే నేడు మనం విమానయానం చేయగలిగేవారమా? మొదట పక్షి నింగిలో ఎగరడం చూచి మనిషి దానిలా గగనవిహారం చేయాలని ముచ్చటపడి ఒంటికి పక్షిలా రెక్కలుకట్టుకొని ఎగిరి క్రిందపడ్డాడు. దానిని చూచి భయపడి తరువాత వచ్చిన వైజ్ఞానికులు ఎంత అవిరళ కృషిచేసారు! రైటుసోదరులు ఎలాగో ఒక విమానాన్ని కనుగొన్నారు. శాస్తజ్ఞ్రులు దానితో తృప్తిపడ్డారా? దానిలోని సాంకేతిక విజ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని నేడు ఎంత సౌకర్యవంతమైన విమానాలను అభివృద్ధిపరిచారు? అది ఎలా సాధ్యపడింది? అంటే తమకు ముందుతరం శాస్తజ్ఞ్రుల విజ్ఞానానికి తమ బుద్ధికౌశలాన్ని జతచేసి అభివృద్ధిచేయడం ద్వారానేకదా! మానవుడి పురోగతికి మూలబీజమైన ఈ మార్మికసూత్రాన్ని వేదమేనాడో ‘జ్యోతిష్మతః పథో రక్ష ధియా కృతాన్’ ‘‘బుద్ధికౌశలంచేత ఆవిష్కరింపబడిన జ్ఞానమార్గాలను రక్షించు’’మని ప్రబోధించింది. జ్ఞానమార్గాలను రక్షించడమెలా? అన్నదానికి బదులుగా ‘నమఃఋషిభ్యః పూర్వజేభ్యః’ అని వేదం పేర్కొంది. అంటే ‘ఋషిభ్యః’ క్రాంతదర్శనులయిన పూర్వ మహర్షులకు అంటే పూర్వ విజ్ఞానవంతులకు ‘నమః’ నమస్కారం అనగా వారి ఆవిష్కరించిన వైజ్ఞానిక విషయాలను అధ్యయనంచేయడం ద్వారా వారి యెడల మన్ననభావాన్ని చూపండి’’అని మార్గాన్ని చూపింది.
వేదమాత ‘జనయా దైవ్యం జనమ్’ ‘‘దివ్య జనులను జనియింపచేయి’’అని కూడ ఆదేశించింది. వారివలన మానవ సమాజం కేవలం మానవ దేహధారులతోకాక పైన పేర్కొనబడినట్టి సర్వలక్షణ సంపన్నులైన జనులతో తామరతంపరగా వర్ధిల్లాలన్నది వేదమాత హృదయాభిలాషగా కనీస ఇంగిత జ్ఞానమున్నవాడు సులభంగానే గ్రహించగలడు. ఇంతకూ వేదం చెప్పిన ‘దైవ్యం జనమ్’అంటె ఎవరు? బోధాయనగృహ్య సూత్రం విపులంగా వారినిగూర్చి ఇలా వివరించింది.
బ్రాహ్మణేన బ్రాహ్మణ్యాముత్పన్నః ప్రాగుపనయనాజ్ఞాతః ఇత్యభిధీయతే॥ కేవలం బ్రాహ్మణ-బ్రాహ్మణి అయిన దంపతులకు జన్మించి ఉపనయనం కాని వయస్సులోఉన్న బాలుడు ‘జాతుడు’అని పిలువబడతాడు.‘ఉపనీతమాత్రో వ్రతాచారీ వేదానాం కించిదధీత్య బ్రాహ్మణః’‘‘బ్రహ్మచర్యవ్రత నిష్ఠుడై ఉపవీతుడై కొద్దిపాటి వేదాధ్యయనం చేసినవాడు’’ ‘బ్రాహ్మణుడు’.‘ఏకాం శాఖామధీత్య శ్రోత్రియః’ ‘‘వేదశాఖలలో ఒకదానిని అధ్యయనం చేసినవాడు’’ ‘శ్రోత్రియుడు’.‘అంగాన్యధీత్యానూచానః’ ‘‘వేదషడంగాలను చదివినవాడు’’ అనూచానుడు.‘కల్పాధ్యారుూ ఋషికల్పః’ ‘‘వేదకల్ప విద్యను పఠించినవాడు’’ ‘ఋషికల్చుడు.’‘సూత్ర ప్రవచనాధ్యారుూ భ్రుణః’ ‘‘సూత్రాలను వ్యాఖ్యానాలతో చదివినవాడు’ ‘భ్రూణుడు. ’చతుర్వేదాద్ ఋషిః ‘‘నాలుగు వేదాలను చదివినవాడు’’ ‘ఝషి’.‘అత ఊర్ధ్వం దేవః ‘‘ఈ అన్నింటిని అధిగమించి సర్వమూ అధ్యయనం చేసినవాడు దేవుడు’’అనగా ‘దివ్యుడు’ఇట్టి దివ్యుని జీవనం వేద ధర్మానుసారంగా పరిపుష్టమై ఉంటుంది. అంటే స్వార్థరహితమై లోకోపకార నిష్ఠమైన జీవనమే దివ్యజీవనం. అట్టి దివ్యజీవనుడే దివ్యుడు. వేదమట్టి దివ్యజీవనులను సమాజంలో జనింపచేయుము ‘జనయా దైవ్యం జనమ్’అని శాసించింది. ఇలా ‘మనుర్భవ’మరియు ‘జనయాదైవ్యం జనమ్’అనే వేదమాత శుభాకాంక్షలతో కేవలం మానవ శరీరధారుల బాహుళ్యంతో నిండిన మానవ సమాజం ఉన్నతమైన మానవత్వంగల మానవ సమాజస్థాయికి ఆపై దివ్యజన సంపన్నమైన సమాజ స్థాయికి ఎదిగి సమున్నతంగా పరిఢవిల్లే ఆ సాకార శుభదిన మెప్పుడో మరి.
***
- సమాప్తం