స్వాధ్యాయ సందోహం
స్వాధ్యాయ సందోహం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
*
చీకటి మయమైన మా హృదయ గుహలో దాచినా అది నీకు ప్రత్యక్షమే. ఈ యజ్ఞం నిజంగా నీకోసమారంభింపబడినది కాదు. సుఖాభిలాషులమైన మాకొఱకు రచింపబడినదే. మాయందు దయతో ‘తేనేమం యజ్ఞ నో నయ స్వర్దేవేషు గంతవే’ ‘‘నీ అనంత బలసంపన్నత యందలి లవలేశంతో సుఖాభిలాషులైన మాకొఱకై ఈ యజ్ఞాన్ని దేవతలవద్దకు చేర్చుము’’. ‘ఋచేమం యజ్ఞం నో నయ స్వర్దేవేషు గంతవే’ నీ వేదవచనానుసారం ఆచరింపబడే మా ఈ యజ్ఞం సుఖప్రాప్తి కొఱకై నిజంగా దేవతల వద్దకు చేరుతుంది.
ఇక్కడ యాజ్ఞికుని అభ్యర్థన ద్వారా సత్యమైన మానవ మనస్తత్వాన్ని సర్వదేవతా నిష్ఠమైన ఏకైక భగవత్తత్త్వాన్ని వేదం ప్రకటించింది. స్వర్గం భోగ భూమి. దాని నందుకోవాలన్నదే మానవుని నిత్యాభిలాష. స్వాభిలాష తీరని మనిషి ఏ కార్యానికీ సుముఖుడుకాడు. ఈ మానవ మనస్తత్త్వాన్ని గుర్తించిన వేదం ‘స్వర్గ కామో యజేత’ ‘‘స్వర్గం కోరుకొనేవాడు యజ్ఞంచేయాలి’’అని ప్రోత్సహించింది. కాని అంతమాత్రం చేతనే మానవుడు తృప్తిపడాలని వేదోద్దేశ్యంకాదు. యజ్ఞపురుషుడైన భగవత్ప్రీత్యర్థంగా మాత్రమే యజ్ఞమాచరించాలని ‘ఆయుర్యజ్ఞేన కల్పతామ్... యజ్ఞోయజ్ఞేన కల్పతాం స్వాహా’(శు.య.వే.22-33) వేదమాదేశించింది. ఈ ఆదేశాన్ని శిరసావహించి యజ్ఞాన్ని భగవత్ప్రీత్యర్థంగా చేసేవారు నూటికోకోటికో ఒక్కరే. అందరు స్వర్గసుఖాభిలాషతో చేసేవారే. అయితే దేనిని ఆశించి యజ్ఞాన్ని చేసినా దాని ఫలప్రదాయకుడు మాత్రం ఆ పరదైవమే. ఈ స్పృహకలిగియున్నవాడే సత్యమైన యజ్ఞ్ఫలాన్ని పొందుతాడు. అందుకే హవిస్సును ప్రత్యక్షంగా దేవతలకుచేర్చి వారినుండి యజ్ఞ్ఫలాన్ని యాజ్ఞికునకు సంప్రాప్తింపచేసేవాడు అగ్నిదేవుడే అయినా ‘యేన వహసి సహస్రం యేనాగ్రే సర్వవేదసమ్’ ‘‘ఓ అగ్నిదేవా! ఎవని శక్తిసామర్థ్యాలచేత ఈ సహస్రాధిక బ్రహ్మాండాలను వహిస్తున్నావో, సర్వజీవులకు సమస్త సంపదలను లభింపజేస్తున్నావో’’ అని పరమాత్మశక్తితో స్వకార్యాలను నిర్వహిస్తున్న దేవతగా మాత్రమే అగ్నిదేవుని వేదం స్తుతింపచేసింది. అంటే యజ్ఞ్ఫలప్రదాత అగ్నిరూపంలో ఉండే పరమాత్మయే అని పరోక్షంగా వేదం ధ్రువపరచింది. ఈ వేద హృదయం మంత్రంలోని ద్వితీయ చరణమైన ‘తే నేమం యజ్ఞం నో నయ స్వర్దేవేషు గంతవే’అట్టి పరమాత్మద్వారా ఈ యజ్ఞాన్ని మా ఆనందంకోసమై దేవతల వద్దకు చేర్చుము’’అన్న వాక్యంలో సుస్పష్టమవుతుంది. కాబట్టి ఏ దేవతా ప్రీత్యర్థంగా యజ్ఞకర్మ చేసినా ఫలప్రదాత మాత్రం ఆ దేవతారూపంలో ఉండే పరమాత్మయే. దురదృష్టవశాత్తు ఏ కొందరికో తప్ప అనేక రూపాలలో ఉండే ఆ ఏకైక పరమాత్మభావన అందరి మనసులో నాటుకోవడం లేదు.
***
ఎవరికి మంచిబుద్ధి కలుగుతుంది?
ప్ర సప్తగుమృతధీతిం సుమేధాం బృహస్పతిం మతిరచ్ఛా జిగాతి
య ఆంగిరసో నమసోపసద్యో- స్మభ్యం చిత్రం వృషణం రయిం దాః॥
॥
భావం:- ఎవరు ప్రాణ విద్యలో నిపుణులో, నమస్కరిస్తూ సమీపింపయోగ్యులో- జ్ఞానేంద్రియాలు మనస్సు, బుద్ధి పొంద దగినవారో, సత్యవిచారణాశీలురో, ఉత్తమబుద్ధిశాలురో, మహాజ్ఞానులో వారే జ్ఞానకర్మలను పరిపూర్ణంగా పొందదగినవారు. ఓ దేవా! చిత్రమైన సుఖదాయకమైన ఆ ధనాన్ని మాకు ఇమ్ము.
వివరణ:- మతిః= జ్ఞానకర్మలు సప్తగుమ్= ఐదు జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి ఈ ఏడు మానవుడికే (ఆత్మకే) ముఖ్యమైనవి. జడులైన వానికి వానితో ప్రయోజనం లేదు. ఒక్క మానవుడికి తప్ప సృష్టిలోని జీవరాశికి దేనికీ జ్ఞానేంద్రియాలు, బుద్ధి, మనస్సు లేవా? అని భావించరాదు. అన్నింటికి ఉన్నాయి. కాని అవి అతి సామాన్యస్థాయిలోనివి మాత్రమే. అయితే వానికంటె మతిః= జ్ఞాన కర్మలు మానవుని యందు విశేషమైనవి. వానిచేతనే మానవుడు ఇతర జీవరాశులకంటె విశిష్టుడైయున్నాడు. ఆ విశిష్టతను పొందేందుకు తగిన సాధన అవసరం. దానిని మానవుడు మాత్రమే చేసి విశిష్టతను అనగా జ్ఞాన-కర్మలను సాధించగలడు. అయితే కొన్ని ప్రత్యేక విశిష్టగుణ సంపత్తిగల మానవుడు మాత్రమే జ్ఞానకర్మలను అనగా సన్మతిని పొందగలడు. ప్రస్తుత మంత్రమా గుణసంపత్తిని వివరిస్తూంది.
ఋతధీతిః:- ఋతమనగా సృష్టి శాసనాలు, ధర్మాలు, నియమాలు, ఇవి వేదాల రూపంలో మానవజాతికి భగవంతుడు అనుగ్రహించినవే. వేదాల ద్వారా ఆ ఋతాన్ని తెలిసికొని ఆచరణలోపెట్టే సచ్ఛీలుడు కావాలి మానవుడు.
సుమేధా:- ‘‘ఉత్తమ మేధాసంపన్నుడు కావాలి’’ విభిన్న విషయాలలో ఏకీకృతమైయుండే ప్రధానతత్త్వాన్ని గ్రహించగల సమన్వయబుద్ధి వైభవమే మేధ. ఈ మేధాశక్తిలేనివాడికి ఋతంలో బాహ్యంగాకానవచ్చే వైవిధ్యం మరియు వైరుధ్య విషయాలలో అంతర్లీనంగా ఉండే అంతస్సార తత్త్వం బోధపడదు. దానివలన అతడికి ఋతధర్మం పట్ల వైముఖ్యమేర్పడే ప్రమాదముంది. కాబట్టి మానవుడు ప్రథమంగా మేధావంతుడు కావాలి.
బృహస్పతిః:- ‘‘గొప్ప విద్వాంసుడు కావాలి’’. మేధావంతుడు కావడానికి ప్రథమ సోపానం విద్వాంసుడు కావడం అంటే సంపూర్ణ విద్యావంతుడు కావడం. విద్యావంతుడు కానివాడికి మేధాశక్తి ఎలా జనిస్తుంది? ఎలా ప్రవృద్ధమవుతుంది? మేధావంతుడు, విద్వాంసుడు కానివాడు ఋతాన్ని గ్రహించనే లేడు. ఇక ఆచరణ ఎక్కడ? కాబట్టి మనిషి బృహస్పతి కావడమత్యావశ్యకం.
అంగిరసః:- ‘‘ప్రాణవిద్యా నిపుణుడు కావాలి’’. జ్ఞానకర్మలను నిజ జీవితంలో సమన్వయించుకొని జీవనయానం సాగించేవాడు కావాలని దీని అర్థం. అట్టివాడే తాను జ్ఞానకర్మలను ఆచరిస్తూ సమాజంచేత ఆచరింప చేయగల ఆచార్యుడు కాగలడు.
ఈ సద్గుణాలు కలవాడినే వేదం ‘సమసోపసద్యః’ నమస్కార పూర్వకంగా చేరదగినవాడని ప్రశంసించింది. అట్టి సర్వజనవంద్యుడు కావడమే ఒక గొప్పధనం. ఓ భగవాన్! ‘అస్మభ్యం చిత్రం వృషణం రయిం దాః’ ‘‘అట్టి సుందరమైన మహాధనాన్ని మాకుకూడ ప్రసాదించు’’అని అందరు కోరుకోవాలని వేదం హితవుపలుకుతూంది. మరి మనం కూడ ఆ వేద హితాన్ని విని ఆచరిద్దామా?
**
ఋతంభరా ప్రజ్ఞ
పవిత్రేభిః పవమానో నృచక్షా రాజా దేవానాముత మర్త్యానామ్
ద్వితా భువద్రయిపతీ రరుూణామృతం భరత్సుభృతం చార్విందుః
॥
భావం:- క్రాంతదర్శి అయిన యోగి పవిత్రకర్మలను పవిత్రంగాచేస్తూ జీవన్ముక్తులైన యోగి జనులకు మరియు సామాన్యజనులకు పూజనీయుడైన తేజస్విగా (రాజు)అగును.
ఇంకాఉంది
సత్యం శివం సుందరం
సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం
- సాంధ్య శ్రీ 8106897404
సూర్యరథంమీది ఊరేగుతున్న నా ఆత్మ
పరంపరాగత తరంగ శీకరోద్భాసిత మిథున ప్రపంచమై
తనని తాను అలంకరించుకున్న వాస్తవం
వర్ణమిశ్ర ఫలకంమీద
రేయింబవళ్ళనే రెండక్షరాలను దిద్దుకుంటూ
సంధ్యను మండిగం మీద నిలుపుతుంది
ఈశాన్నాగేయాల మధ్య తారిష తరంగాల మీద తేలి
మానవ చరిత్రకు మేలుకొలుపు పాటను వ్రాస్తున్న జ్యోతిషాంపతిని
చూడలేని వాడు ప్రభాతాన్ని ప్రాంతీయ ద్వేషం చేసి
సాయంత్రాన్ని సగ్గెడలోకి వంచుకుంటాడు
తూర్పు జ్వాలల్లో తడిసిపోత్ను తులకింపు
నిత్యం నా అక్షరాల మధువునే త్రాకుతుంది
ఉదయ కిరణం హృదయ కుహరంలోని మధుర గీతాన్ని
తోట బాట కిచ్చివేసింది
భావికాలపు తమస్సుల్ని చీల్చుకుని ఉదయించే
నా అభివ్యక్తి అభినయాన్ని చుట్టుకొని
రెంటిని వెల్లువెత్తుతుంది
జీవన తృష్ణను తీర్చే పద్య ఛందస్సారాన్ని
నా దోసిట కుంకుమ నింపే ప్రత్యూష ధవళిమతో కలిపి
ఇదిగో తూర్పు ముఖబింబాన్ని స్వాగతిస్తున్నాను
స్నేహితుడా
జ్వలించే నా కోరికను నీ హృదయాధీనం చేసుకో
నువ్వు నాకు కావాలి...
ఇంకాఉంది