స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిత్యజింపదగిన వారినికూడా దరిజేర్చుకొంటున్నావు. అంధులకు సన్మార్గాన్ని చూపుతున్నావు. చెవిటి వారికి సత్ప్రవచనాన్ని వినిపిస్తున్నావు. అట్టి నీవు అన్నివిధాలుగా కీర్తనీయుడవు.
వివరణ:- అల్పజ్ఞత, అవిద్య, దురాగ్రహం మొదలైన దుర్గుణాల వలన మనిషి అపరాధాలు చేస్తాడు. అదే మనిషికి పతన దశ. పతితులను చూచి ఎగతాళిచేయడం దుర్జనుల పని. సజ్జనులు అట్టివారిపై దయ చూపుతారు. ఈ అభిప్రాయానే్న వేదం ‘అరమయః సరపసస్తరాయ కం...స్త్రుతిమ్’ ‘‘పాపులను ఉద్ధరించేందుకు సుఖంగా సంచరిస్తున్నావు’’అన్న వాక్యంలో ప్రకటించింది. ధార్మికులైనవారితో అందరు ప్రియంగానే ఉంటారు. కాని పాపులను వారి పాపాలనుండి నివారించి ఉద్ధరించడమే వీరత్వం. అది పాపులనుగాక పాపాలను అసహ్యించుకొనడం ద్వారా సాధ్యపడుతుంది. పాపాచరణ పాపుల దోషప్రవృత్తి. అట్టివారు కరుణాపాత్రులే గాని నిందనీయులుగారు. అందుచేత వేదం ‘నీచా సంతముదనయ? ...ఉక్థ్య?’ ‘‘పతితులైనవారిని ఉద్ధరించు. గ్రుడ్డివారికి దారిచూపు. చెవిటివారికి వినిపించు. ఈ పనులు సాధారణ జనులుకాక దివ్యులు చేసే పని’’అని ప్రోత్సహించింది. ఋగ్వేదం చెప్పిన ఈ మాటనే అథర్వణ వేదం-
ఉత దేవా అవహితం దేవా ఉన్నయథా పునః
ఉతాగశ్చ క్రుషం దేవా దేవా జీవయథా పునః॥ (అథ.వే.4-13-1)
‘‘దివ్య పురుషులు పతితులైనవారిని పదే పదే ఉద్ధరిస్తారు. పాపులను మరల మరల పాపాలు చేయకుండ ధర్మబోధ చేసి రక్షిస్తారు’’అని పునరుద్ఘాటించింది.
పాపంచేయడం నిజంగా మరణించడంతో సమానం. పాపులను ధర్మమార్గంలో నడిపించడమే వారికి ప్రాణదానం చేయడంతో సమానం. గ్రుడ్డివాడిని అడిగితే నేత్రాల విలువ ఏమిటో చెబుతాడు. చెవుల విలువ ఎంతటిదో చెవిటి వాని నడిగి తెలుసుకో.
గ్రుడ్డివాడికి కళ్లనీయడం వారికి ప్రాణదానం చేయడమే. అంధుని వలె పాపి హృదయ నేత్రాలు అంధమైపోతాయి. అందుచేత వారికి పాప-పుణ్య భేదాలు తెలియవు. జ్ఞాన నేత్రాల నిచ్చి వారి గ్రుడ్డిహృదయంలో కాంతులను నింపాలి. పతితోద్ధరణమే నిజమైన పవిత్ర కార్యం. దానినెంత ప్రశంసించినా అది స్వల్పమే.
**
భగవంతుని మన్యుశక్తి (ఆగ్రహం) ఏమి చేయలేదు?
న యస్య ద్యావాపృథివీ న ధన్వ నాంతరిక్షం నాద్రయః సోమో అక్షాః
యదస్య మన్యురధినీయమానః శృణాతి వీళు రుజతి స్థిరాణి॥ ॥
భావం:- భగవంతుడు సంపూర్ణమైన స్వశక్తి సామర్థ్యాలతో చూపే మన్యు= ఆగ్రహావేశాలతో సృష్టించే విధ్వంసాన్ని భూమి, ఆకాశం, అంతరిక్షం, జలం, పర్వతాలు, ఇవి ఏవీకూడ సృష్టించజాలవు.
వివరణ:- భూమ్యాకాశాలు, అంతరిక్షం, పర్వతాలు, సముద్రాలు వీనితో కూడిన సర్వజగత్తులోని సామర్థ్యాన్ని ఒక్కసారి పరిశీలించండి. సమస్త జీవులను పోషిస్తుంది కాబట్టి భూమికి పూష అని పేరు.

- ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512