స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
బాగా ఆలోచించి పనులను చేసేవాడు మనిషి అని వ్యవహరింపబడతాడు. ప్రజలను భయ కంపితులను చేసేవానిని, తన పొట్టమాత్రమే పోషించుకొనే వానిని ప్రజాసుఖాన్ని నిరోధించే వానిని, ప్రజలను పీడించే వానిని నగరాల లోనికి గ్రామాలలోనికి ప్రవేశించి నిద్రపోయేందుకు కూడ అవకాశం లేకుండా చేసి బాధించే వానిని మనిషి అని చెప్పలేము.
వివరణ:- ఈ మంత్రం ‘మనిషి’శబ్దానికి పర్యాయంగా ‘సుమంతు’ శబ్దాన్ని ప్రయోగించింది. దానర్థం ఉత్తమ మనన శీలుడైనవాడని. మనిషి శబ్దానికి కూడ అర్థం దాదాపు ఇదే. వైదిక నిఘంటువైన నిరుక్తంలో ‘మత్వాకర్మాణి సీవ్యంతి’ (నిరుక్తం 3-2-7) మననంచేసి అంటే బాగా ఆలోచించి పనిచేసేవాడు’’అని మనిషి శబ్దానికి నిర్వచనం చెప్పబడింది. మనుష్యుడు, సుమంతు, మనువు, మనిషి ఈ పదాలన్నీ ఒక దానికొకటి పర్యాయ వాచకాలే. అన్నింటిని బాగా మననంచేసి అనగా ఆలోచించి పనులను చేసేవాడనియే అర్థం. ఆలోచనకు వ్యామోహం విరోధి. అది ఆలోచనను క్రమంగా పారనీయదు. అంతేకాక బుద్ధిని కూడ నశింపచేస్తుంది. మనిషి అట్టి మోహానికి లొంగనివాడుగా ఉండాలి. మోహానికి మరో గుణముంది. అదేమంటే సత్యాన్ని అసత్యంగా అసత్యాన్ని సత్యంగా భావింపచేసే గుణం. మంత్రమాలక్షణానే్న మిథ్యగా పేర్కొంది. అంటే మనిషి సక్రమమైన ఆలోచనచేత అట్టి మోహజనితమైన మిథ్యా ప్రభావానికి వశం కారాదు. మనిషి సదా విచారణాశీలుడై మిథ్యాభావానికి దూరంగానే ఉండాలి. అట్టి లక్షణ లక్షితుడయిన మనిషి ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో మంత్రం చాలా వివరంగా వర్ణించింది. ఆ లక్షణాన్ని వేదమీవిధంగా విపులంగా వర్ణించింది.
1. చుమురిన్= ప్రజలను హింసించేవారిని
2. ధునిమ్= ప్రజలను భయకంపితులను చేసే వారిని
3. పిప్రుమ్= తమ పొట్టమాత్రమే పోషించుకొనే స్వోదర పోషకులను
4. శుష్ణమ్= ప్రజలను పీడించుకొని తినే వారిని
వీరిని గ్రామాలలో గాని, పట్టణాలలోగాని ప్రవేశించి కనీసం నిద్ర కూడ పోనీయకుండా దూరంగా తరిమికొట్టేవాడుగా ఉంటాడని, ఉత్తముడైన ఆ మనిషి అధర్మ అన్యాయ విరోధ శీలాన్ని ఆవిష్కరించింది. ఇందులో చెప్పబడిన అంశాలు నాలుగు. అట్టి అధర్మ, అన్యాయాలకు సూచకంగా గ్రహించాలి.
సహజంగా మనిషిగా ఈ ధర్మాలను నిర్వహించడమంత సులభం కాదు. ఆ ప్రయత్నంలో ఆత్మ హాని కూడ సంభవింపవచ్చు. దానికి భయపడక మనిషిగా స్వధర్మాన్ని నిర్వహించాలని సంకల్పించినవాడు కేవలం మనిషి మాత్రమే కాదు ధీరుడైన మనిషి అని ఈ వేదార్థానే్న విస్తరించి నీతి శతకమిలా చెప్పింది.
నిందంతు నీతినిపుణా యది వా స్తువంతు
లక్ష్మీః సమావిశతు గచ్ఛతు వా యథేష్టమ్
అద్వైవ వా మరణమస్తు యుగాంతరే వా
న్యాయాత్పథః ప్రవిచలంతి పదం న ధీరాః॥
భర్తృహరి నీతి శతకం 84.
‘‘నీతి నిపుణులు నిందించ లేదా స్తుతించనీ సంపదలు రానీ లేదా పోనీ వెంటనే మృత్యువే సంభవించనీ లేదా యుగయుగాలు చిరాయువుగా జీవితం సాగనీ కాని మనిషి న్యాయమార్గాన్ని మాత్రం విడువరాదు. అలా విడువని వాడే ధీరుడైన మనిషి.’’ భర్తృహరి నీతిమార్గాన్ని విడువవద్దని చెప్పింది.
- ఇంకాఉంది