స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
వేద పరిభాషలో సర్వశబ్దాలు గిక శబ్దాలే కాబట్టి ఆవేశపూరితంగా ఏదేని కార్యాన్ని నిర్వహించడవని అర్థం. ఈ అర్థానే్న క్రింద ఋగ్వేద మంత్రం ఇలా వివరిస్తూంది.
మన్యురింద్రో మన్యురేవాస దేవో మన్యుర్హోతా వరుణో జాతవేదాః
మన్యుం విశ ఈళతే మానుషీర్యాః పాహి నో మన్యో తపసా సజోషాః॥
(ఋ.10-83-2)
ఇంద్రుడు మన్యువు. దేవతలు మన్యువు. వరుణుడు, హోత, జాతవేదుడు మన్యువు. మానవులందరు మన్యువును పూజిస్తారు. కోరుకొంటారు. ప్రేమ పూర్వకంగా తపస్సునాచరించే మన్యూ! నీవు మమ్ము రక్షించు.
ఋగ్వేదం (10-83)లో మన్యువు అనేక పదార్థాలకు వాచకంగా చెప్పబడింది. కొన్ని వేదమంత్రాలలో మన్యు శబ్దం సేనానాయకునకు వాచకంగా చెప్పబడింది. ‘అగ్ని రివ మన్యో త్విషితః సహస్వ సేనానీర్నః సహురే హూత ఏధి’(ఋ.10-84-2) ‘‘ఓ మన్యూ! అగ్నివలె తేజోవంతుడవై అందరిని అణచివేయుము. సేనానాయకుడవై యుద్ధానికి ఆహ్వానింపబడి సమర్థుడవై యుద్ధం చేయి.’’
ప్రస్తుత మంత్రంలో మన్యు శబ్దానికర్థం భగవంతుని ప్రళయకారక శక్తి. అది చేసే విధ్వంసం సృష్టిలోని ద్యావాపృథువులు గాని, నదీనదాలు గాని, సముద్రాలు గాని, సూర్యాది గ్రహాలుగాని చేయజాలవు. కావున భగవానుని మన్యుశక్తికి సాటిరాదగిన మన్యుశక్తి సృష్టిలో ఏ పదార్థానికి సంభవంకాదు అన్నది ప్రస్తుత వేదమంత్రార్థం.
**
ఉత్తమ మనన (విచారణా) శీలుడే మనిషి
స యో న ముహే న మిథూ జనో భూత్సుమంతునామా
చుమురిం భునిం చ వృణక్పిప్రుం శంబరం శుష్ణమింద్రః
పరాం చ్యౌత్నాయ శయథాయ నూ చిత్‌॥
ఋ.6-18-8॥
భావం:- మోహంలో పడనివాడు, అసత్యవాది కానివాడు ‘మనిషి’ అని వ్యవహరింప బడతాడు. పాపాన్ని చూచి సహించనివాడు-...
- ఇంకాఉంది