స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుత మంత్రంలో ‘సహస్ర భృష్టి శతాశ్రీ’ అనే వజ్రాయుధం వర్ణింపబడింది. ‘శతాశ్రీ’ అనగా వందల కొలది పదనులు గలదని అర్థం. అంటే ఈ ఆయుధం వందల కొలది పదును అంచులు కలదై వేల కొలది శత్రువులను సంహరింపగల మారణాయుధంగా గ్రహించాలి.
ఇలా వజ్రాయుధాల వర్ణనలే గాక అనేక ఇతర మారణాయుధాల ప్రస్తావనలు కూడ వేదాలలో కనబడతాయి. కొన్నింటిని చూడండి- 1. తేజిష్ఠావర్తని 2. శితాగభస్తి 3. అశని 4. విద్యుత్ 5. ఋష్ఠి 6. ముష్టి 7.స్వాధి 8. పవి 9. వాశీ 10.వకుర 11. పరశు 12. ఇషు 13. శర 14. సాయక 15. నిషంగ 16. ధుని 17. ఖాది మొదలయినవి.
వీని స్వరూప స్వభావాలు, ప్రయోగ పద్ధతులు, శక్తిసామర్థ్యాలు నేడు ఎవరికీ తెలియవు. వేదాలకు ఉపవేదమని చెప్పబడే ధనుర్వేదంలో వీని వివరణలు ఉన్నాయి.
అగస్త్యుడు, భరద్వాజుడు, ఉశనుడు మొదలయిన ఋషులు ఆ ధనుర్వేదాన్ని వ్రాసిన వారిలో కొందరు. ఆధునిక కాలంలో క్షత్రియ విద్యలు అంతరించడంతో వీని విజ్ఞానం కూడ నేడు కనుమరుగయింది.
**
మార్గాలు రెండే
ద్వే స్త్రుతీ అశ్రుణవం పిత్రూణామహం దేవానాముత మర్త్యానామ్‌
తాభ్యామిదం విశ్వమేజత్సమేతి యదంతరా పితరం మాతరం చ॥ ॥
భావం:- మరణధర్మం గల మానవులకు సంబంధించిన పితృయానం మరియు దేవయానమనే రెండు మార్గాలను గురించి విన్నాను. వానిలో మాతాపితృ సంబంధం చేత నడిచే పితృయాన మార్గం చేతనే ఈ లోకమంతా నడుస్తూ ఉంది. పుట్టి మరల నశిస్తూ ఉంది.
వివరణ:- మానవులు రెండు విధాలుగా ఉంటారు. మొదటివారు నిష్కాములు. రెండవవారు సకాములు. చేసే పనివలన తమకు ఏమి లాభం కలుగుతుంది అన్న ఆలోచనతో పనులను చేసి లాభం కలుగనప్పుడు ఆ పనిని చేయనివారు సకాములు. చేసే పనివలన తమకు ఏమి లాభం కలుగుతుందని ఆలోచింపక ఆ పని చేయడమే తమ విధ్యుక్త ధర్మమని భావించి ఆ పనులను హృదయ పూర్వకంగా చేసేవారు నిష్కాములు.
- ఇంకాఉంది