స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరిరువురిలో నిష్కాములను దేవ= దివ్యులని అంటారు. ఈ నిష్కాములయినవారు ప్రీతిగా బోధించినా చాలమంది పెడచెవిని పెడుతూ ఉంటారని ‘అకామా విశే్వ వో దేవాః శిక్షంతో నోప శేకిమ’ (అథ.వే.6-114-3) ‘‘కామనారహితులమై నిష్కాములమైన మేము మిమ్మెంత శిక్షించినా (బోధించినా) కామనారహితులనుగా చేయలేకున్నాం’’ అని అథర్వణవేదం విచారాన్ని వ్యక్తం చేసింది. ఇట్టి నిష్కాములైన వారి మార్గం దేవయాన మార్గం. వీరినే దివ్యులని వ్యవహరిస్తారు. ఇట్టి నిష్కాములైన వారి మార్గం దేవయాన మార్గం. వీరినే దివ్యులని వ్యవహరిస్తారు. వీరు సత్యస్వరూపులై యుంటారు’’ ‘సత్యం వై దేవాః’ (అథ 1-1-4) అని శతపథ బ్రాహ్మణం వివరించింది. ఈ మాటనే ‘సత్యేన పంథా వితతో దేవయానః’ (ముండకోపనిషత్తు అథ.3-1-5) దివ్యులు పోవు దేవయాన మార్గం సత్యంచే విస్తృతంగా ఉంటుంది.
‘యేనా క్రామన్ త్వృషయో హ్యాప్తకామాః’ (ముండకోపనిషత్తు 3-1-6) ‘‘ఈ మార్గంలో కోరికలు లేని వారు ప్రయాణిస్తారు’’ అని ముండకోపనిషత్తు సమర్థించింది.
ఇక రెండవ మార్గం పితృయానం. ఈ మార్గంలో ప్రయాణించేవారు ముఖ్యంగా తల్లిదండ్రులవుతారు. అంటే జనన మరణ రూపమైన సంసార చక్రభ్రమణంలో చిక్కుకొంటారని భావం. సమస్త జగత్తు ఈ రెండు మార్గాలలోనే నడుస్తూంది. ఈ దేవయాన, పితృయాన మార్గాలను గురించి ముండకోపనిషత్తు క్రింది విధంగా రమణీయంగా వర్ణించింది.
ఇష్టాపూర్తం మన్యమానా వరిష్ఠం నాన్యచ్ఛ్రేయో వేదయంతే ప్రమూఢాః
నాకస్య పృష్ఠే తే సుకృతే= నుభూత్వేమం లోకం హీనతరం వా విశంతి
తపః శ్రద్ధే యే హ్యుపవసంత్యరణ్యే శాంతా విద్వాంసో భైక్షచర్యాం చరంతః
సూర్య ద్వారేణ తే విరజాః ప్రయాంతి యాత్రామృతః స పురుషోహ్యవ్యయాత్మా॥
(ముండకోపనిషత్తు 1-2-10,11)
ఇష్ట- అపూర్తాలే సర్వోత్తమమని తలంచే అతి మూఢ జనులు వానికంటె మిన్న అయిన శ్రేయస్సు లేదని భావిస్తారు. వారు పూర్వ, ప్రస్తుత జన్మ కర్మానుగుణమైన సుఖాలననుభవిస్తారు. కాని ప్రశాంతులైన విద్వాంసులు రిసన్న్యాసులైన వనాలలో ఉంటూ తపస్సును, శ్రద్ధను నిష్ఠగా అనుష్ఠానం చేస్తారు. అట్టివారు అవినాశి, అవికారి, అయిన పూర్ణపురుషుడగు పరబ్రహ్మముండే స్థానానికి సూర్యమండలం ద్వారా చేరుకొంటారు. కనీసం మోక్షమనే మాటను తలంపునకు రానీయక కేవలం శరీర సౌఖ్యమే సర్వస్వమని భావించి వానిని సాధించే ఇష్టాపూర్తాలను కొందరాచరిస్తూ ఉంటారు. వారావిధంగా సత్కర్ములైన కారణంగా ఆ కర్మలకనుగుణమైన సుఖమనే ఫలాన్ని ప్రస్తుత జన్మలో లేదా మరుజన్మలో అనుభవించి తిరిగి హీనజన్మలను పొందుతారు. కారణం సత్కర్మలు పుణ్యఫలాలను ప్రదానం చేసాయి కదా! వీరు దివ్యులు పోయే దేవయనా మార్గంలో ప్రయాణించక పితృయాన మార్గంలో ప్రయాణిస్తారు. వీరికి భిన్నమైన దివ్యులు లేదా జ్ఞానులు స్థిరంగా నిలిచి మోహమాయను జయించి శ్రద్ధాపూర్వకంగా తపస్సు నాచరిస్తారు. వాని ద్వారా పరమపురుషుని మహాధామానికి చేరుకొంటారు. వీరిది దేవయాన మార్గం. లోకంలో సర్వజనుల మార్గాలు ఈ రెండే. దేవయానం విరళం. పితృయానం బహుళం.
**
నేను మీ లక్ష్యాల దిశగా నడుపుతా
సం వో మనాంసి సం వ్రతా సమాకూతీర్నమామసి
అమీ యే వివ్రతా స్థన తాన్వః సం సమయామసి॥ 1॥

అహం గృభ్ణామి మనసా మనాంసి మమ చిత్తమను చిత్త్భిరేత
మమ వశేషు హృదయాని వఃకృణోమి మమ యాతమను వర్త్మాన ఏత॥ ॥
భావం:- మేము మీ మనస్సులను, లక్ష్యాలను, సంకల్పాలను ఉత్తమంగా తీర్చిదిద్దుతాము. ఎవరికి జీవిత లక్ష్యాలేవో వారిని జీవిత లక్ష్యాలు గలవారిగా చేస్తాము. నేను మీ మనస్సులను నా మనస్సుచేత వశపరచుకొంటున్నాను. మీరుకూడ మనఃస్ఫూర్తిగా నా మనసున కనుకూలంగా నడవండి. నేను మీ మనస్సులను నా వశంలో పెట్టుకొంటున్నాను. మీరు నా మార్గానికి అనుకూలురై నడుచుకోండి.
- ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512