S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాధ్యాయ సందోహం

10/09/2019 - 18:28

త్వం దాతా ప్రథమో రాధసామస్యసి సత్య ఈశానకృత్‌
తువిద్యుమ్నస్య యుజ్యా వృణీమహే పుత్రస్య శపసో మహ.॥॥
భావం:- ఓ సర్వేశ్వరా! సమస్త ధనాలను ప్రదానంచేసే ప్రథమ ప్రదాతవు నీవే. భూత భవిష్యత్ వర్తమానాలలో పరిణామం చెందని సత్యస్వరూపుడవు. సమస్త శాసనకర్తవు -రాజాధిరాజువు నీవే. తేజశ్శాలివి, బలశోధకుడవు, పూజ్యుడవు అయిన నీ సాంగత్యాన్ని మేము కోరుకొంటున్నాం.

10/07/2019 - 19:03

ఆ జ్ఞానమెట్టిది? ప్రియమ్= ప్రీతికరమైనది. శూషమ్= బలవర్థకమైనది. బృహత్= చాలా శ్రేష్ఠమైనది. అందుకే భగవదత్తమైన ఈ జ్ఞానం భోగ- మోక్ష ప్రదాయక సమర్థమైనది. కాబట్టి మానవుడుగా జన్మించిన ప్రతి వ్యక్తికి ప్రథమకర్తవ్యం ‘దేవత్తం బ్రహ్మ గాయత’(ఋ.1-37-4) ‘‘పరమాత్మచే ప్రదానం చేయబడిన వేదాన్ని గానం చేయి’’అని ఋగ్వేదం శాసిస్తూంది.

10/03/2019 - 18:55

ఓ ప్రభూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, అనే అరిషడ్వార్గాలచే నిండిన నేను అపవిత్రుడను. కాని నీవో ‘మియేధ్య’ పవిత్రుడవు. నీ పవిత్రతాగుణాలను నాలోకూడ నింపుము. ఓ సర్వేశ్వరా! నీవు గర్భస్థశిశువునకు సహితం ఆహారాన్ని సమకూరుస్తావు. సమస్తజీవులకు భోగ సామగ్రిని నీవే ప్రదానం చేస్తున్నావు. ఓ మహేశా! నీవు దేవతలకు హవ్యాన్నిచేర్చే హవ్య వాహనుడవే కాదు. దేవవాహనుడవు కూడ.

09/30/2019 - 18:45

ఈ మాటనే వేదం మరో సందర్భంలో ‘జివ్రీ యువానా పితరా కృణోతన’ (ఋ.1-110-8) వృద్ధ తల్లిదండ్రులను యువకులుగా చేయి’’అని పునరుద్ఘాటించింది. యువకులుగా చేయమంటే వార్థక్యంలో దుఃఖం కలుగకుండా చేయుమని అంతరార్థం.

09/29/2019 - 22:14

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*

09/26/2019 - 19:02

‘నిశ్చర్మణో గామరిణీత ధీతిభిః’ ఈ వాక్యానికి సాయణాచార్యులు ‘‘ఆవు చర్మాన్ని తీసివేయి’’అని అర్థం వ్రాసారు. ఇది సరియైనదికాదు. అంతేగాక వేదశిరస్సుపై గోహత్యాదోషం మోపబడినట్లు అయింది. ఇది ఏవిధంగానూ న్యాయమైనది కాదు. వేదంలో ఆవు అఘ్న్యా= చంప తగినది కాదు అని వర్ణించబడింది. ఇప్పుడు సాయణాచార్యుల అర్థం వేద వచన విరుద్ధమైనదని చెప్పవలసియుంది. వేదాలు గోహింసా విషయంలో పరస్పర విరుద్ధంగా చెప్పాయని భావించరాదు.

09/25/2019 - 18:47

గురువు లక్షణాలు
సామ ద్విబర్హా మహి తిగ్మభృష్టిః సహస్రరేతా వృషభస్తువిష్మాన్‌
పదం న గోరపగూళ్హం వివిద్వానగ్నిర్మహ్యం ప్రేదు వోచన్మనీషామ్ ॥

09/23/2019 - 18:59

అందుచేత ఏ విధంగా జీవితంలో సత్ఫలితాలను పొందాలో వేదమీవిధంగా ఉపదేశించింది. ‘బృహస్పతినా సఖ్యం జుషాణో యథావశం తన్వః కల్పయాతి’ ‘‘బృహస్పతితో ప్రీతిపూర్వకమైన మైత్రిని నెరిపేవాడు శరీరాన్ని- ఇంద్రియాలను వశపరచుకొని సమర్థవంతంగా నడిపించుకో గలుగుతాడు.’’ ఆయన మైత్రివలన మనిషిలోని సర్వదోషాలు హరింపబడతాయి. కాకపోతే మనిషి దైవంతో నిష్కపటంగా మిత్రత్వాన్ని నెరపాలి.

09/22/2019 - 22:12

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*

09/19/2019 - 18:58

ఇక జీవునిపరంగా ‘‘ఇతరులచేత పలుకబడిన శబ్దాలను విని గ్రహించగల శక్తి కలుగుతుంది’’అని రెండవ అర్థం. అంటే బాలుడు స్వయంగా పలుకలేకపోయినా తల్లి మొదలగువారు పలికిన మాటలను విని అర్థంచేసుకోగల శక్తి కలిగియుంటాడని భావం. భగవద్దత్తమైన జన్మనే జీవుడు స్వీకరించి ఆతడు చేసుకొన్న కర్మఫలాలను జీవుడు అనుభవిస్తాడన్న ఈ అథర్వణవేద సిద్ధాంతాన్ని ఋగ్వేదం కూడ ఇలా సమర్థించింది.

Pages