స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందుచేత ఏ విధంగా జీవితంలో సత్ఫలితాలను పొందాలో వేదమీవిధంగా ఉపదేశించింది. ‘బృహస్పతినా సఖ్యం జుషాణో యథావశం తన్వః కల్పయాతి’ ‘‘బృహస్పతితో ప్రీతిపూర్వకమైన మైత్రిని నెరిపేవాడు శరీరాన్ని- ఇంద్రియాలను వశపరచుకొని సమర్థవంతంగా నడిపించుకో గలుగుతాడు.’’ ఆయన మైత్రివలన మనిషిలోని సర్వదోషాలు హరింపబడతాయి. కాకపోతే మనిషి దైవంతో నిష్కపటంగా మిత్రత్వాన్ని నెరపాలి. మిత్రుడికి మిత్రుడి మీద మిక్కిలి ప్రేమాభిమానాలు ఉండటం సహజంకదా. ఆ దృష్ట్యా మిత్రుడు మిత్రుణ్ణి యథేచ్ఛగా దేనినయినా కోరగలుగుతాడు. మిత్రుడుగా భక్తుడు చనువుతో భగవంతుని అర్థించే క్రింది అభ్యర్థనను పరిశీలించండి.
దేహి ను మే యనే్మ అదత్తో అస్తి యుజ్యో మే సప్తపదః సఖాసి
(అథ.వే.5-11-9)
‘‘నీవు నాకీయనిదేదియుందో అదే నీవు నాకియ్యి. మరి నీవు సదా నావెంట ఉండే సప్తాపదీనుడవైన మిత్రుడవుకదా’’ మిత్రత్వ దృష్ట్యా దైవం భక్తుడికిచ్చేది శరీరేంద్రియాలపైన ఆత్మకు సంపూర్ణ అధికారమే. దానినే ప్రతిభక్తుడు అర్థించాలి. ‘యథా వశం తస్వః కల్పయాతి’అని వేదం మానవుడిని హెచ్చరిస్తూంది.
**
అసత్యాన్ని విడువు- సత్యాన్ని పట్టుకో
అగ్నే వ్రతపతే వ్రతం చరిష్యామి తచ్ఛకేయం తనే్మ రాధ్యతామ్‌
ఇద మహ మనృతాత్ సత్యముపైమి॥ యజు.వే.1-5॥
భావం:- వ్రతరక్షకా! ఓ పరమేశ్వరా! నేను వ్రతాన్ని ఆచరింపగోరుతున్నాను. దానిని నేను తప్పక చేయగలను. నేను చేసే వ్రతం సఫలమగుగాక! నేను అసత్యాన్ని విడిచి సత్యాన్ని పొందుతాను.
వివరణ:- ఒక వ్రతాన్ని ఆచరణకారంభం చేసే సమయంలో ఈ మంత్రం పఠింపబడుతుందని శతపథ బ్రాహ్మణంలో చెప్పబడింది. నిజానికీమంత్రం ఆర్యుడైన వ్యక్తి ఆరంభించే జపమంత్ర సందర్భంలో పఠింపబడుతుందని భావించాలి. భగవంతుడు సత్యస్వరూపుడు. సత్యరక్షణ మరియు సత్యవ్రతుల సంరక్షణ ఆయనయే నిర్వహిస్తాడు. తైత్తిరీయ సంహితలో క్రింది ప్రార్థన ఇలా కనబడుతుంది.
ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి, తన్మామవతు, తద్వక్తార మవతు
ఋతాన్ని పలుకుతాను. సత్యాన్ని పలుకుతాను. సత్యస్వరూపుడైన భగవంతుడు నన్ను రక్షించుగాక! సత్యవాదిని రక్షించుగాక’’! సత్య వచనమే సర్వరక్షకమని ఋగ్వేద మీవిధంగా చెప్పింది.
‘సా మా సత్యోక్తిః పరిపాతు విశ్వతః’ (ఋ.10-37-2) ఆ సత్యవచనం అన్ని దిశలనుండి నన్ను రక్షించుగాక! వేదం సత్యపక్షపాతి. సందర్భానుసారంగా పలుచోట్ల వేదం సత్యపాలనను శాసించింది.
తేనె సత్యేన జాగృతమధి ప్రచేతునే పదే (ఋ.1-21-6) ఆ సత్యంతోబాటుగా దంపతులైన మీరు చైతన్యాన్ని కలిగించే వాక్కుకోసం జాగరూకులై యుండండి.
అభూదు పారమేతవే పంథా ఋతస్య సాధుయా (ఋ.1-46-11) తరించేందుకు ఋతమార్గమే ప్రశస్తం.
ఋతస్య దేవా అనువ్రతా గుః(ఋ.1-65-2) విద్వాంసులు ఋతానుసరణానే్న వ్రతంగా ఆచరిస్తారు.
శతపథ బ్రాహ్మణంలో అగ్నే వ్రతపతే... మంత్ర వ్యాఖ్యానంలో ‘సత్యమేవ దేవాః’ సత్యమే విద్వాంసులు అని వ్రాయబడింది. వేదంలో చెప్పబడిన ‘ఋతస్య దేవా అనువ్రతా గుః’అన్నది మరియు ‘సత్యమేవ దేవాః’ అన్నది శబ్దాలలో భేదమే గాని అర్థ విషయంలో రెండూ అభిన్నమే. ‘ఇద మహ మనృతాత్సత్యముపైమి’ ‘‘నేను అసత్యాన్ని విడిచి సత్యానే్న స్వీకరిస్తున్నాను’’అన్న ప్రతిజ్ఞ పూనినప్పుడే అతడు విద్వాంసుడుగా మారనారంభించాడనటానికి చిహ్నం.

ఇంకా ఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512