స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
భగవంతుని మాటలను వినాలని కోరికఉంటె ముందుగా విద్వాంసుడవు కమ్ము. ఎందుకంటె ‘దేవో దేవా యగృణతే’ విద్వాంసుడు విద్వాంసునితోనే మాటలాడతాడు.గురుకులంలో స్నాతకోత్సవం పూర్తిఅయిన పిమ్మట గురువు ‘సత్యం వద’ సదా సత్యమే పలుకుము అని ఆజ్ఞాపిస్తాడు. ‘ఇదమహమనృతాత్’ వ్రతాచరణకు పూనుకొన్నవాడు ‘ఋతస్య సద్మ వి చరామి విద్వాన్’ (ఋ.3-55-14) నేను బాగా అర్థంచేసుకొని ఋతమనే గృహంలో సంచరిస్తాను అని దృఢ నిశ్చయంతో ఉండాలి. జీవితం తొలి సంజలో ‘అగ్నే వ్రతపతే...చరిష్యామి’ మరియు ‘ఇదమహమ్... ఉపైమి’అని మలి సంజలో ‘అగ్నే వ్రతపతే వ్రతమచారిషం తదశకం తనే్మ- రాధీదమహం య ఏవాస్మి సో-స్మి’(యజు.వే.2-28) ఓ వ్రతరక్షక! నేను నీ దయవలన వ్రతాన్ని పరిపూర్ణం చేసాను అని మానవుడు భగవంతుని మ్రోల వినమ్రంగా పలుకగలగాలి.
**
సర్వేశ్వరా! నీవు చెప్పినట్లుగానే భోగాలననుభవిస్తాను
అత్రా తే రూపముత్తమమపశ్యం జిగీషమాణమిష ఆ పదే గోః
యదా తే మర్తో అను భోగమానళాదిద్ గ్రసిష్ఠ ఓధీరజీగః॥

భావం:- విషయాలు ఇంద్రియాల నాకర్షించినట్లుగా ఆకర్షణీయుడవు విజయశీలుడవైన నిన్ను నేను అన్నివైపుల చూస్తున్నాను. మానవుడు నీవు చెప్పిన దానికి విధేయంగా భోగాలనెప్పుడనుభవిస్తాడో అప్పుడే సర్వపాపాలను బాగా హరించివేసే ఓషధీ రసాలు బహిర్గతమవుతాయి.
వివరణ:- నిర్వికల్ప సమాధిలో యోగులకనుభవమయ్యే ఏ అనుభూతి ఉందో దాని వివరణయే ఈ మంత్రంలో చెప్పబడింది. సమాధిలో భగవద్రూప సందర్శనమైనంతనే యోగి ఆనంద భరితుడై ‘అత్రా తే రూపముత్తమమ పశ్యమ్’ ‘‘ఇక్కడే నేను నీ సర్వోత్తమ దివ్యరూపాన్ని దర్శించాను’’అని పలికే వాక్యంతో యోగి ఆనందానుభూతి వర్ణన ఈ మంత్రంలో ఆరంభమయింది. భగవద్దర్శనం పొందిన అనుభవాన్ని ఈశోపనిషత్తు (16) ‘యతే రూపం కల్యాణతమం తత్తే పశ్యామి’ ‘‘సర్వోత్తమ కల్యాణ కారకమైన నీ స్వరూపాన్ని నేను దర్శిస్తున్నాను’’అని వేద వచనానే్న అనువదించింది. దైవదర్శనం పొందిన యోగికది ఎంత ఆకర్షణీయమో వివరిస్తూ ‘జిగీషమాణమిష ఆ పదే గోః’ ‘‘విషయాలు ఇంద్రియాలను ఎలా బలంగా ఆకర్షిస్తాయో ఆ రీతిగా నీ విజయశీలమూ- ఆకర్షణీయమూ అయిన రూపం ఆకర్షిస్తున్నది’’అని సోపమానంగా వివరించాడు.ఇక మంత్రంలో రెండవ భాగంలో మానవుడు భోగాలననుభవించదగిన పద్ధతి వివరింపబడింది. పరమాత్మ కరుణాళువు. అందుకే జీవులను సృష్టించడంతోబాటు అవి సుఖపడేందుకు, భోగాలను అనుభవించేందుకు ఎనె్నన్నో సుఖ- భోగస్థానాలను, వానికవసరమైన పదార్థజాలాన్ని సృష్టించాడు. వానితోబాటు వాటిని అనుభవించే విధానాన్నికూడ తెలుపుతూ ధర్మశాస్త్ర గ్రంథాన్నికూడ ఇచ్చాడు. దానిననుసరించి ఎన్ని భోగాలు, సుఖాలను మానవులు అనుభవించినా ఆయనకు ప్రీతికరమే. అయితే మానవుడు తద్విరుద్ధంగా సృష్టిలోని సుఖ-్భగాలను అనుభవించేందుకు ప్రయత్నిస్తాడు. వేదం అట్టి విరుద్ధకార్యానికి పూనుకోవద్దని హెచ్చరిస్తూ ‘యదా తే మర్తో అను భోగమానట్ అదిద్ గ్రసిష్ఠ ఓషధీరజీగః’ మనుష్యుడు ఎప్పు డు నీకనుగూలంగా భోగాలననుభవిస్తాడో అప్పుడే కర్మలలోని దోషాలను హరించే ఒషధీరసాలు విశేషంగా స్రవిస్తాయి’’అని హితవు పలికింది. అంటే సృష్టిలోని సుఖ-్భగానుభవంకోసం మానవుడు చేసే కర్మలకు వేద ధర్మాచరణ స్పర్శవలన అవి దోష నిర్ముక్తమై, బగవత్ప్రీతి పాత్రమవుతాయని భావం.

ఇంకా ఉంది