స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ ప్రభూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, అనే అరిషడ్వార్గాలచే నిండిన నేను అపవిత్రుడను. కాని నీవో ‘మియేధ్య’ పవిత్రుడవు. నీ పవిత్రతాగుణాలను నాలోకూడ నింపుము. ఓ సర్వేశ్వరా! నీవు గర్భస్థశిశువునకు సహితం ఆహారాన్ని సమకూరుస్తావు. సమస్తజీవులకు భోగ సామగ్రిని నీవే ప్రదానం చేస్తున్నావు. ఓ మహేశా! నీవు దేవతలకు హవ్యాన్నిచేర్చే హవ్య వాహనుడవే కాదు. దేవవాహనుడవు కూడ. ‘స దేవాన్ ఏహ వక్షతి’ (ఋ.1-1-2) దేవతలను కూడ ఇక్కడకు గొనిరాగలవాడవు.
అందుచేత మా ప్రార్థన ఏమంటే ‘స ఆ వహ పురుహూత ప్రచేతసో- గ్నే దేవాన్ ఇహ ద్రవత్’ (ఋ.1-44-7). ‘‘ఓ పురుహూత! ఉత్తమ జ్ఞానులైన దేవతలను నీవిక్కడకు గొని రా’’అనియే. ఇక్కడకంటే ఎక్కడకు? ప్రభో! ‘దేవాన్ ఇహా వహ ఉపయజ్ఞం హవిశ్చనః’ (ఋ.1.12-10). ‘‘దేవతలను మా యజ్ఞాలవద్దకు-అర్పించే హవిస్సులవద్దకు తీసుకొని రమ్ము’’అనియే. నీవు ‘ప్రావితాభవ’ (ఋ.1-12-8). ‘‘మమ్ము సర్వవిధాల రక్షించు’’. విశ్వవిధాతా! నీవు అమృతుడవు. నేను నిన్ను స్తోత్రం చేస్తున్నాను. ఎందుకంటే ‘స్తోతా వో అమృతః స్యాత్’ (ఋ.1-38-4). ‘‘నిన్ను స్తోత్రంచేసినవాడు స్వయంగా అమృత స్వరూపుడే అవుతాడు’’ పూజ్యతమ! నీవు ‘యజిష్ఠః’ ‘‘యాజ్ఞికులలో సర్వశ్రేష్ఠుడవు.’’ నేను కూడ యజ్ఞంచేస్తాను. ‘యజామ దేవాన్ యది శక్నవామ’ (ఋ.1-27-13). ‘‘మేము యథాశక్తిగా దేవయజ్ఞాన్ని చేస్తాము.’’ దేవాధిదేవా! నేను అజ్ఞానిని. నీ స్తుతిచేసే విధానం తెలియనివాడను. అందుచేత మా వినతి ఏమంటే ‘ఇమం స్తోమం జుషస్వ నః’ (ఋ.1-12-12). ‘‘మా ఈ స్తోత్రాన్ని స్వీకరించు’’. సర్వేశ్వరా! వాస్తవంగా ఇది నీవనుగ్రహించినదే. అందుచేత ‘త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే’ జ్ఞానప్రదాతా! నీవు నాకు ప్రసాదించిన దానినే నీకు కానుకగా సమర్పిస్తున్నాను.
ప్రియమైన వేదజ్ఞానాన్ని పరమేశ్వరుడే ప్రబోధించాడు
యో అదధాజ్జ్యోతిషి జ్యోతిరంతర్యో అసృజన్మధునా సం మధూని అధ ప్రియం శూషమింద్రాయ మన్మ బ్రహ్మకృతో బృహదుక్థాదవాచి॥ ॥
భావం:- సూర్య, చంద్రాది జ్యోతిర్మండలాలలో జ్యోతిని నింపినవాడు- మధుర పదార్థాలలో మాధుర్యాన్ని నింపినవాడు అయి న ఆ పరమేశ్వరుడే జీవులకు హితకరమైన బలవర్ధకమైన, విచారణాత్మకమైన, శ్రేష్ఠమైన జ్ఞానాన్ని వేదాలనుండి ప్రబోధించాడు.
వివరణ:- భగవంతుడే జ్యోతిర్మయ స్వరూపుడు. సూర్యాది జ్యోతిర్మండలాలలో ఆయనే జ్యోతిస్సును నింపాడు. సృష్టిలోని సమస్త పదార్థాలలో మధువును అనగా ఆస్వాదనీయతను ఆయనే నింపాడు. జీవులకేది ప్రియంగా ఉంటుందో ఆ విధంగా సృష్టిని రచించి జీవులకు పరమాత్ముడు వరప్రదానం చేసాడు. ఆయన జీవుల ఎడల సృష్టి రచనా రూపమైన కారుణ్యభావాన్ని శుక్లయజుర్వేదం ఈవిధంగా శ్లాఘించింది.
స్వాద్వీం త్వా స్వాదునా తీవ్రాం తీవ్రేణామృతామమృతేన
మధుమతీం మధుమతా సృజామి సంపోమేన॥ యజు.వే.19-1॥
‘‘రుచికరంగా రుచికరమైన వస్తువులను, ఉత్తేజకరంగా ఉత్తేజకరమైన వస్తువులను అమృతాయమానంగా అమృతమయ వస్తువులను, మాధుర్యవంతంగా మధుర పదార్థాలను నీకోసమే కల్పించాము.’’ ఈ విధంగా భగవంతుడు సమస్తజీవులు మోక్షంతోబాటు భోగాల ననుభవించేందుకు కూడ విశ్వరచన చేసాడు. అయితే ఆ భోగాలను, మోక్షాన్ని ఎలా పొందాలో కూడ తెలుపుతూ సృష్ట్యాదిలోనే జీవులకు వేదాల ద్వారా జ్ఞానాన్ని చెప్పాడు. ఆ జ్ఞానమెట్టిది? ప్రియమ్= ప్రీతికరమైనది. శూషమ్= బలవర్థకమైనది. బృహత్= చాలా శ్రేష్ఠమైనది. అందుకే భగవదత్తమైన ఈ జ్ఞానం భోగ- మోక్ష ప్రదాయక సమర్థమైనది. కాబట్టి మానవుడుగా జన్మించిన ప్రతి వ్యక్తికి ప్రథమ కర్తవ్యం.

ఇంకా ఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు