స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
అక్షద్రుగ్ధో రాజన్యః పాప ఆత్మపరాజితః (అథ.వే.5-18-2) ‘‘ఇంద్రియ ద్రోహంవలన రాజు (ఆత్మ) తనవారి చేతిలోనే పరాజితమై పాపి అయినది.’’అంటే ఇంద్రియాలు ఎప్పుడైతే ఆత్మకు వశం తప్పి ప్రవర్తించసాగాయో అప్పుడే జీవుడికి పాపావస్థ ఆరంభమవుతుందని భావం. అది ఎప్పటికి హేయమైన అవస్థయే. ఒక్కొక్క పాపమూ ఆత్మకు ఒక్కొక్క గాయమై బాధిస్తుంది. బాధించే ఆ పాపం నుండి ఎవడైనా ఒకడు వచ్చి రక్షిస్తే అతడు క్షత్రియుడవుతాడు. ఆ సమయంలో యజ్ఞమో- యాగమో-ఇష్టాపూర్తమో- దీర్ఘాయువో ఎవడూ కోరుకోడు? కో వనుతే దీర్ఘమాయుః? ‘‘ఎవడు దీర్ఘాయువును కోరుకొంటాడు?’’ అని. వేదమిక్కడ చెప్పిన మాటను కఠోపనిషత్తు దాదాపుగా అలానే చెప్పింది.
అజీర్యతామమృతానాము పేత్య జీర్యన్‌మర్త్యః క్వధస్థః ప్రజానన్‌
అభిద్వాయన్ వర్ణరతిప్రమోదానతిదీర్ఘే జీవితే కో రమేత?॥ (కఠ.ఉ.1-1-28)
భావం:- అక్షయులూ- అమరులూ అయిన వారివద్దకు చేరుకొని వారివద్దనుండి పొందగలిగే శ్రేష్ఠతమమైన వరాలను, ఆట-పాటల ఆనందాన్ని పొంది ఆ ఆనందమయ జీవితంలో దీర్ఘకాలమానందించాలని ఎవడు ఉత్సాహపడతాడు? కాని లోకంతీరు వేరుగా ఉంటుంది. శరీరమెంతో రోగగ్రస్థమై అంగవైకల్యమేర్పడి జీవితం గడవడం దుర్భరంగా ఉన్న మనిషి తాను మరణించాలని కోరుకోడు. చాల కాలం జీవించాలనే వాంఛిస్తాడు. ఆత్మకు చావు లేదు. అది అమరం. కాని శరీరమటువంటిది కాదు. అయినా మనిషి శరీరాన్ని కూడ అజరామరంగా ఉంచుకోవాలని అభిలషిస్తాడు. అందుకొరకే యజ్ఞ-యాగాదులను చేస్తాడు. ఇష్టాపూర్తాల నాచరిస్తాడు. పెద్దలనుండి సుదీర్ఘ జీవనంకోసం ఆశీస్సుల నర్థిస్తాడు. ఇది ‘యజ్ఞ కామః...దీర్ఘమాయుః’అన్న మంత్ర భాగానికొక అర్థమయితే ఎవడు యజ్ఞయాగాదులను ఇష్టాపూర్తాలను చేసి దీర్ఘాయుష్షును వాంఛిస్తాడు? ఎవరో కొందరు మాత్రమే అలా చేస్తారని అర్థం.
భగవంతుడు (వరుణుడు) అథరవ్వనకు ఒక ఆవును దానం చేసాడు. అది ‘పృశ్ని.’ అనేక వర్ణాలు కలది. బాగా పాలను కూడ ఇస్తుంది. పాలు కూడ శ్రేష్ఠమైనవే. దానివద్ద ఎప్పుడూ దూడ కూడ ఉంటుంది. ఆ ఆవు ఏమిటో తెలుసా? దానిని గూర్చి ఋగ్వేదంలోని మంత్రమీవిధంగా వివరించింది.
‘అధేన్వా చరతి మాయయైన వాచం శుశ్రువాన్ అఫలామపుష్పామ్’ (ఋ.10-71-5)
‘‘పుష్ప- ఫలరహితమైన మాటను విన్నవాడు గోవు కాని(నకిలీ) గోవువెంట తిరుగునట్టివాడే.’’ ఇక్కడ గోవు అంటే వేదవాక్కు అని అర్థం. దానిని వినక నిరర్థకమైన మాటలను శ్రద్ధగా వినేవాడు నకిలీ ఆవు వెంట తిరిగేవాడితో సమానమని అర్థం. ఆవుబొమ్మ ఆవులాగే ఉంటుంది. కాని అది పాలనీయదు. వేదం మానవుని ఆత్మకల్యాణంకోసమీయబడిన విజ్ఞానం. దానిని పెడచెవినిపెట్టి నిరర్థకమైన మాటలను వినేవాడు నకిలీ ఆవు వెంట పోయే మూర్ఖుని వంటివాడే.
వేదవాణియే పృశ్ని. అంటే మానవ కల్యాణాన్ని కలిగించే ఎన్నో వర్ణాలు (అక్షరయుతమైన వర్ణనలు) ఉన్నాయి. అది సదా వాగ్ధారలనే క్షీరాలను వర్షిస్తుంది. అది ఎల్లప్పుడు నిత్యవత్సయే. అంటే దూడలతోకూడి యుండేది. నిత్యఫలదాయిని అని భావం. మానవ సమాజానికి భగవంతుడు అట్టి నిత్యక్షీరధారలను వర్షించే వేదధేనువుననుగ్రహించాడు. కాని లోకంలో ఈ వేదధేను వాక్‌క్షీరాలను త్రాగి పుష్టిపొందే వారెందరు? శరీర-ఇంద్రియాలు మనిషి వశంలో ఉండటంలేదు. దానివలన మానవుడు జీవితంలో దుష్ఫలితాలనే పొందుతున్నాడు. కాని వేదం చాల కరుణాళువు.

ఇంకా ఉంది