స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నిశ్చర్మణో గామరిణీత ధీతిభిః’ ఈ వాక్యానికి సాయణాచార్యులు ‘‘ఆవు చర్మాన్ని తీసివేయి’’అని అర్థం వ్రాసారు. ఇది సరియైనదికాదు. అంతేగాక వేదశిరస్సుపై గోహత్యాదోషం మోపబడినట్లు అయింది. ఇది ఏవిధంగానూ న్యాయమైనది కాదు. వేదంలో ఆవు అఘ్న్యా= చంప తగినది కాదు అని వర్ణించబడింది. ఇప్పుడు సాయణాచార్యుల అర్థం వేద వచన విరుద్ధమైనదని చెప్పవలసియుంది. వేదాలు గోహింసా విషయంలో పరస్పర విరుద్ధంగా చెప్పాయని భావించరాదు. ఎందుకంటె వేదాలు వ్యాఘత దోష రహితమైనవని అనగా పరస్పర విరోధరహితమైనవని వేదర్షులందరూ అంగీకరించారు. ఒక విధంగా సాయణుల అర్థమే సరియైనదని భావిస్తే ఈ మంత్రంలో ‘నిశ్చర్మణం గామకురత’అని ఉండాలి గాని ‘నిశ్చర్మణో గా మరిణీత’ ‘‘చర్మరహితంగా అవును పొందుము’’ అని ఉండరాదు. చర్మరహితంగా ఆవు ఎలా ఉంటుంది? అట్టి దానిని పొందడమెలా? కాబట్టి మంత్రంలోని వాక్యానికి సాయణులు చెప్పిన అర్థంగాక మరొక అర్థముండాలి. గోశబ్దానికి ఆవు అనే అర్థంతోబాటు ‘మాట’ అనే అర్థంకూడ దీనిననుసరించి ఈ వాక్యానికర్థం మాటను చర్మరహితంగా తెలుసుకొనుము అని చెప్పాలి. మాటకు చర్మమంటే మాటకు బహిరంగంగా ఉండే అర్థమని గ్రహించాలి అది లేకుండా అంటే బాహ్యార్థంగాక మాటలోని అంతరార్థాన్ని గ్రహించాలి అని అర్థం.
వేదం తదుపరి వాక్యంలో ‘జరంతా యువశా తాకృణోతన’ వృద్ధ తల్లిదండ్రులను యువకులుగా చేయ’’మని సమాజానికి హితవుచెప్పింది.
ఇంకా ఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512