స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యోగ్యతానుసారం సంస్కారవంతులను చేయి
తవ క్రత్వా తవ తద్దంసనాభిరామాసు పక్వ శచ్యా ని దీధః
ఔర్ణోర్దుర ఉస్రియాభ్యోవి ద్ళల్హోదూర్వాద్ గా అసృజో అంగిరస్వాన్‌॥॥
భావం:- నీవు నీ బుద్ధివిశేషంతో, కర్మలతో, దృష్టాంతాలతో పరిణతిలేని బుద్ధిగల వారియందు పరిపక్వతను నింపుము. జ్ఞాన కిరణాలపైగల అడ్డంకులను తొలగించు. జ్ఞానివై ఇంద్రియాలను హింసాప్రవృత్తినుండి విడుదల చేయి.
వివరణ:- ఇతరులకు హితోపదేశం చేసేందుకు మాటల కంటె క్రియల ద్వారా చేసే ఉపదేశమే చాల బలవత్తరంగా ఉంటుంది. గురువు పరిపక్వబుద్ధిలేని శిష్యునియందు పరిణతి తీసికొని రాదలంచితే అది కేవలం బోధచేయడం చేత మాత్రమే జరుగదు. స్వయంగా తానాచరించి చూపి బోధించవలసి యుంటుంది. ‘తవ క్రత్వా తవ...దీధః’ ‘‘నీ కర్మలచేత, ఉదాహరణల చేత అపరిపక్వ శిష్యులయందు పరిపక్వతను నింపుమని వేదమాదేశించింది. అలా పరిపక్వతను నింపాలంటే తానాచరించక కేవలం మాటలతో ప్రబోధం చేస్తే సిద్ధిస్తుందా? గురువు ఆచరించి చూపి ప్రబోధించింది శిష్యుడికి ఒక మంచి దృష్టాంతమై హృదయంలో నాటుకొని పరిపక్వత కలిగిస్తుంది.అయితే పరిపక్వతను పొందేందుకు శిష్యుడికి యోగ్యత ఉందోలేదో ‘శచ్యా ని దీధః’ గురువు స్వబుద్ధితో శిష్యుడిని పరీక్షించాలి. తదుపరి శిష్యుడిని సంస్కరించేందుకు ప్రయత్నించాలి. వేడినీళ్లు కావాలనుకొనువాడు ఎక్కువగా మంట పెడితే నీళ్లు ఆవిరైపోతాయి. మరీ తక్కువ మంట పెడితే నీళ్లు వేడే ఎక్కవు. కాబట్టి మంట మితంగాపెట్టాలి. వేడి ఎంత అవసరమో దానిననుసరించి మంట పెంచుటయో తగ్గించుటయో చేయవలసియుంది.
అట్లే ఏ శిష్యుడికి ఎంత సంస్కరణ అవసరమో గురువు పరీక్షించి తెలిసికోవాలి. ఈ విషయాన్నంతా వేదం ‘ఔర్ణోర్దుర ఉస్రియాభ్యో వి దృఢా’ జ్ఞాన కిరణాల ప్రసారంలోని అడ్డంకులను తొలగించుమన్న ఒక్కమాటలో నిక్షిప్తం చేసింది. జన్మ జన్మాంతరాలనుండి సంక్రమించిన దుష్ట సంస్కారాలు మనిషికి సత్యజ్ఞానాన్ని పొందనీయకుండ ఆటంకపరుస్తాయి.
అలసత్వం, ఏమరపాటుతనం, సుఖాభిలాష మొదలైనవి అలా జ్ఞానప్రాప్తిని ఆటంకపరచే వానిలో కొన్ని. అవి నివారింపబడకుండ జ్ఞానప్రకాశం శిష్యుడికి చేరదు కదా అని ఇంద్రియాలను హింసించి తద్వారా జ్ఞానం ప్రబోధింపరాదు. అట్టి హింస ద్వారా ఇంద్రియాలు పూర్తిగా పరాఙ్మఖులై జ్ఞానాభిముఖమే కావు. కాబట్టి వేదం ‘ఊర్వాద్‌గా అసృజో అంగిరస్వాన్’ ‘‘బుద్ధిమంతుడవై ఇంద్రియాలను హింసనుండి విముక్తం చేయి’’అని హెచ్చరించింది.
ఆ రీతిగా మృదుమార్గంలో పరిపక్వ జనులయందు పరిణతిని నింపుడని వేదం బుద్ధిమంతుల కాదేశిస్తూంది.
**
విద్వాంసులు మూర్ఖులతో వాదించరు
అధ త్వా విశే్వ పుర ఇంద్రదేవా ఏకం తవసం దధిరే భరాయ
అదేవో యదభ్యౌహిష్ట దేవాన్‌త్స్వర్షాతా వృణత ఇంద్రమత్ర॥॥
భావం:- ఓ ఇంద్ర! లోకంలోని విద్వాంసులందరు తమతమ రక్షణ-పోషణ భారాలను వహించుటకొఱకై మహాబలశాలివగు నినే్న ముందుంచుకొంటున్నారు. మూర్ఖులుకాబట్టి వారు జ్ఞానులతోడనే తర్కవితర్కాలకు పూనుకొంటారు. అయినా జ్ఞానులు మూర్ఖులుకాక అజ్ఞాన నివారకుడైన భగవానునే ఎంచుకొంటారు.
పప్రాథ క్ష్మాం మహి దంసో వ్యుర్వీముప ద్యామృష్వో బృహదింద్ర స్త్భాయః
అధారయో రోదసీ దేవపుత్రతే ప్రత్నే మాతరా యహ్వీ ఋతస్య॥ (ఋ.6-17-7)
భావం:- ‘‘జగదుద్ధారకుడైన భగవానుడు ఈ మహా పృథివిని, విశాల అంతరిక్షాన్ని, ప్రకాశమయమైన ద్యులోకాన్ని సృజించి స్థిరంగా ఉంచాడు. ఋతాచరణ యందు బలీయుడగు ఆ పరమాత్మ ద్యావాపృథువులను స్వయంగా తానే వహిస్తున్నాడు’’ ఆ ద్యావాపృథువులను స్వయంగా వహిస్తున్న పరమాత్ముడు సమస్తజీవుల భరణ పోషణభారాన్ని కూడ వహించకుంటాడా?

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు