S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరాజీయం

07/05/2017 - 22:13

గ్రామీణుడు పైగా 70 పైబడ్డవాడు. కాని లేఖ్రాజ్‌కి జరిమానా కూడా తగిలించారు. హిమాచల్‌ప్రదేశ్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ వారు గ్రామంలో అతనికి అలాట్ చేసిన ఇంటి సదుపాయాల నిమిత్తం 808 రూపాయలు ప్లస్ 40 రూపాయలు జరిమానా వేసి ‘లకోటా’ కొట్టారు. అంతేనా? పుండుమీద కారం జల్లినట్లు- ఈ మొత్తం కట్టకపోయినన్, కరెంటు, నీళ్లు, డ్రయినేజి సదుపాయం సహా అన్ని ‘ఎక్కలాగేస్తం’ అన్నారు.

07/03/2017 - 00:54

ముందు అట్టమీద ముఖ్యమంత్రి ఖట్టార్ గారి చిరునవ్వు మోము దర్శనమిచ్చింది అనుకోండి- సమస్యే లేదు- ఎందుకంటే అది హర్యానా రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రచురించిన ‘కృషిసంవాద్’ అనే పత్రిక. వ్యవసాయ శాఖవారి తరఫున రాష్ట్ర సమాచార శాఖవారు తయారుచేశారు- సమాచార శాఖవారు విడుదల చేసిన మార్చి సంచిక- మార్కెట్‌లోకి బాగానే మార్చ్ చేసిందిగాని- దాని వెనుక అట్టమీద బాంబు ప్రేలింది.

06/29/2017 - 00:32

బీహార్ ‘హైవే’లమీద అందాల వొయ్యారిలలామాలు, కాలేజీ టీన్స్‌లాగా జీన్స్ ఆపైన టీషర్టులు ధరించి ఓ అరడజను మంది బిలబిల వచ్చి చిన్న కార్లను, మోటారు శకటాలను హైవేమీద ఆపితే? ఆగక చస్తాయా?

06/26/2017 - 01:04

నగదు రహిత సమాజం సాధ్యమేమో కానీ, చెత్త రహిత వీధులు, యాచక రహిత జన్‌క్షన్లు, గోతుల రహిత రోడ్లు సాధ్యం కాదు. ఆ మధ్య గోవా ముఖ్యమంత్రి ముష్టివాడి వాసన లేకుండా తన గోవాని చేస్తానని అసెంబ్లీలోనే మాట ఇచ్చాడు కానీ -అక్కడైనా అది సాధ్యమైనదాని? మనదాకా అట్టి శుభవార్త రాలేదు.

06/19/2017 - 01:43

జూలై 24తో ఇప్పుడు రాష్టప్రతిగా వున్న ప్రణబ్ ముఖర్జీగారి పదవీకాలం ముగుస్తుంది. కొత్త రాష్టప్రతి పదవి ఎవరికి కట్టబెట్టాలి అన్న అంశం మీద మోదీగారికే ఒక ఆలోచన కుదరటంలేదు. రాష్టప్రతి ఎన్నిక లాంఛనప్రాయం కాదు- నల్లేరుమీద బండిగా పాలక పక్షాల ఇష్టప్రకారం కొనసాగేదిగా కూడా కనబడటంలేదు. ఎన్నికకి నామినేషన్ తేదీ - పోలింగ్ తేదీ - కౌంటింగ్ తేదీ అన్నీ ప్రకటించిన తరువాత కూడా ఎన్‌డిఏ అభ్యర్థి కూడా ఇంకా తేలలేదా?

06/12/2017 - 01:11

మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లాలో అటు కర్ఫ్యూ సడలిస్తూండగా ఇటు భోపాల్ దసరా మైదానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఉపవాస దీక్షకి కూర్చున్నాడు పాపం! రైతుల సమస్య పరిష్కరింపబడేదాకా ‘నేను పచ్చి మంచినీళ్ళు ముట్టను’ అన్నాడు. అలాగే, రైతు ఋణ పరిష్కార పథకం ఒకటి ప్రకటించాడు. ఈలోగా రైతులు రాళ్ళురువ్వుతూ కనబడ్డ వాహనాలు, బిల్డింగులను కూడా ‘పరశురామ ప్రీతి’ చేస్తూ పోలీసు బుల్లెట్లకు ఎదురొడ్డారు.

06/07/2017 - 22:10

గోవును అలాగే గేదెని రక్షించాలా? భక్షించాలా? అన్నదో పొలిటికల్ ప్రశ్న కాదు, అది ఒక రాజకీయ ఆయుధంగా అయిపోతోంది దేశంలో.. అట్టి తరి- కబేళాలకి వాటితోపాటు డయరీ ఫారాలకి కూడా గాలి తగిలింది. లైసెన్సు లేనిదే జంతు వధ నిషేధం; అలాగే లైసెన్సు లేనిదే గేదెల పాలు పితికి అమ్ముకోరాదు. మధ్యప్రదేశ్‌లో ఒక జట్టు వుంది. అలా అక్రమంగా 90 డయరీ ఫారాలున్నా యి. వీటికి లైసెన్సులు లేవు.

06/05/2017 - 00:33

నలభై ఆరేళ్ల అనిల్ కుంబ్లే, ఇరవై ఎనిమిదేళ్ల విరాట్ కోహ్లి- కురుక్షేత్రంలో కృష్ణార్జునుల్లా క్రికెట్ మైదానంలో ‘బస్తీమే సవాల్’గా రాణిస్తారని ఆశించాము. కాని ఇలా అత్తాకోడళ్ల మాదిరి అయిపోతారని అనుకోలేదండీ అన్నాడు నా చిన్నప్పటినుంచి క్రికెట్ మ్యాచ్ అంటే చూడ పరుగులు తీసి అరిచి అరిచి అలసి ఇంటికి తిరిగొచ్చే ఒక ‘టిపికల్ క్రికెట్ ఫ్యాన్’. చాంపియన్ ట్రోఫీ మన దేశానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కప్.

05/29/2017 - 06:15

ఎండల్ని మించి మండిపోతున్న వార్త ఏమిటి? సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా ‘కాలా కరికాళన్’ ఎ ప్పుడు రెడీ అవుతుందా? అన్నది కాదు. ‘రజనీకాంత్ ది గ్రేట్’ పోలిటిక్స్‌లోకి దూకుతాడా? లేదా? అన్నదీ కూడా కాదు- అసలు రజనీ అనగా ‘తలవై’ తమిళుడు ఔనా? కాదా? అన్నది వివాదం. అతను కన్నడిగుడు- కనుక, తమిళనాడు పరిపాలనకి తగడు అంటూ ‘నాన్ద తమిళ్’, ‘నాన్ తమిళ్’ అంటే- అరవలు, అరవలు కాని వారు అని అర్థం.

05/22/2017 - 07:38

బెజవాడకి ‘బ్లేజ్‌వాడ’ అన్నమాట కూడా దక్కలేదు- పోనీ, మావూరి రైల్వే స్టేషన్‌కి ‘శుభ్రంగా ఉంటోంది’ అన్న నెంబర్‌వన్ ర్యాంకు కూడా లభించలేదు. నెంబర్ ఫోర్‌ట! బందరు, బాపట్ల కూడా భగభగ మండి బ్లేజ్‌వాడలైపోతే ఇంకేం చెయ్యాలి? అంటూ వాపోయాడో దుర్గా నాగేశ్వరరావు- రసం జుర్రి మామిడి టెంక కూడా మొత్తం ఖతమ్ చేసేసి, దాన్ని బస్సు క్రిందకి విసరేసి- గుంటూరుకి పెదకారు (బస్సు) ఎక్కేశాడు.

Pages