వీరాజీయం

హార్వే పెనుతుఫాన్ : టాక్సీ ఎక్కిన డేగ! (వార్త- వ్యాఖ్య)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెక్సాస్ అమెరికా ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన పెనుతుఫాను ‘‘హార్వే’’ జలభూతం హోస్టన్ మహానగరాన్ని పీకలదాకా ముంచేసింది. కొంప కొల్లేరు అన్న సామెతని నిజం చేస్తూ ఇండ్లన్నీ చెరువులైపోగా మొండిఘటం ఒకడు వివియన్ సల్దానా ‘‘ఇంటికి వెతుక్కుంటూ చేపలోచ్చాయని పొంగిపోయి - తన డ్రాయింగ్ హాల్ చెరువులోకి దూకి చేపల్ని ఉత్త చేత్తో పట్టుకుని పొంగిపోవడం మొదలుపెట్టాడు. అంత సులువేమీ కాదు ఇటు వేటాడితే అటు దుమికి నీళ్ళల్లోకి దూరిపోతున్నాయి ‘‘జలపుష్పములు’’ - మునక, గెంతు - ఓహో కోరమీను ఆహా ఇది మరో రకం అంటూ కేరింతలు అతను - వాళ్ళావిడ బయట గోడెక్కి దీన్ని వీడియో తీసింది. అతి కీలకమైనది అమెరికాలోనే నాల్గవ పెద్ద నగరమయిన హోస్టన్ జలార్నవమైపోయింది. ఒక టాక్సీ డ్రైవర్ విలియం బ్రూసో సరుకులు తీసి నీట తేలిన డాబా మీద దించి, బయట చక్రాలు సగం మునిగి ముక్కుతున్న తన టాక్సీ దగ్గరికి వచ్చేసరికి వెనుక సీట్లో బేరం రెడిగా ఉంది. విప్పారిన మొహంతో ‘‘హాయ్ బడ్డీ’’ అని బ్రూస్ తొంగి చూసేసరికి - ఒక పెద్ద ‘‘డేగ’’ గారు పల్కరించింది - భలే బేరమే అనుకుంటూ ఇష్ ఉష్ అని దాన్ని తరిమివేయ్యాలని చూశాడు - ఉహున్... కదలదే... ఎట్టకేలకు తీసివున్న టాక్సీ తలుపు మీదకి ఎక్కి కూర్చుంది - ఎక్కడికి వెళ్ళాలి సారూ అంటూ అతని చేతి మీదకి ఎక్కింది - ఎలా వదిలించుకోవాలో తెలియక - ఇంట్లోకి తీసుకుపోయి బాగా బెదిరింది పైగా - ఆకలి కూడా వేస్తున్నదేమో అనుకుంటూ చిటెన్ బిస్కట్లు తినిపించాడు - అవతల వాన; లోన నీటికొలను. మర్నాటికి పక్షుల రక్షణ కేంద్రం ‘‘అమ్మడు’’ వచ్చి ‘‘అయ్యో వెర్రి ముండా! దెబ్బకొట్టిందే నీకు హార్వే రాక్షసీ!’’ అని ఎత్తుకుంది. దాని పేరు హార్వ్ హాక్ - (తుఫాన్ డేగా) అన్నాడు బ్రూస్ టాక్సీవాలా - ఇట్లా మనుషుల పెంపుడు జంతువులతో పాటు అడవి పక్షి జంతు జాలాన్ని కూడా తాకిన హా‘‘ర్వేయ్’’ - వేళలో - జాతి కుక్క ఒకటి కేవలం ‘‘డాగ్‌ఫుడ్’’ అనే కుక్కలకి పెట్టే బిస్కెట్లు వగైరా వున్న పెద్ద డబ్బాని ఒక ఇంట్లోనుంచి దొంగతనం చేసింది. పొడిగా ఉన్న రోడ్ మీదకి పరుగులు తీసింది - దాన్ని వీధికుక్కలు అనుసరించాయి. దాని యజమాని ‘‘ఎవరా?’’ అని పోలీసులు తంటాలు పడ్డారు - ఇలాగే పదమూడు ఏండ్లలో అతిపెద్దయిన ఈ హార్వే - హార్రోర్‌ని అమెరికా టెక్సాస్ రాష్ట్రం ఎదుర్కొంటున్నది - తిరిగి పోతూ మరో దెబ్బ తెస్తుంది హార్వే - రెడీగా ఉన్నారు జనం. అదండీ టెక్సాస్ తాజా ఖర్మ.

కుక్కని తింటే తప్పా?
భారత స్వాతంత్య్ర దినోత్సవంనాడు మోదీలాల్ ఖిల్లా మీద గంభీరంగా ఉపన్యాసం చేస్తూ వుంటే, ఢిల్లీకి ఐఏఎస్ పరీక్షలు రాయడం కోసం ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చి మకాం పెట్టిన ఇద్దరు యువకులు డేవిడ్ హోకిన్స్, లాల్ మిన్సాంగ్ హోప్ఖంగ్ అనే వాళ్ళు ఆనందంగా పంద్రాగస్టు విందు చేసుకునే ఏర్పాట్లలో వున్నారు. తప్పేమిటి? కాని వాళ్ళు వండుకుని ఆరగించినది ఒక ఊరకుక్క మాంసం. మునర్కాలోని వసంత విహార ప్రాంతంలో ఊరకుక్కలు తక్కువ(!)ట. వేకువనే కుక్క వేటకి వీధులు వెతికి వెతికి - రోడ్డు మీద ఓ కునుకు తీస్తున్న కుక్కని ఇటుక రాయితో మోది చంపేసి ఈ... రా.. కుర్రాళ్ళు ప్లాస్టిక్ బ్యాగ్‌లో కుక్కి ఆనక దాన్ని కనపడకుండా ఇంకో గోతంలో పెట్టి తెచ్చుకున్నారు - మరో ఇద్దరు ఈ.శా. కూర్రాళ్ళతో కలసి తినేశారు. కాని, ఢిల్లీ నుంచి పల్లె దాకా ఇవాళ నిఘా కెమెరాలు ఉంటాయని ఎరుగరు - దొరికిపోయారు. కుక్క మాంసం మా ఊళ్ళో మేము హాయిగా రోజూ తింటాం. అలా తినడం ఢిల్లీలో నేరమని - ‘‘మీమీద ఒట్టు’’ ‘‘మాకు’’ ‘‘తెలవది సారూ’’ అన్నారు.

-వీరాజీ