వీరాజీయం

కరోనా గుప్పిట భూగోళం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో పనె్నండు రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలు- కరోనా వైరస్ గుప్పిట యిరుక్కున్నాయి. పని పాటలు బంద్ అయిపోయి, విలవిల్లాడుతున్నాయి. ఇది మొన్న మంగళవారంనాటి పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా మొత్తంమీద కరోనా రక్కసి కొరడా ఝుళిపిస్తున్న దేశాలు నూట నలభై అయిదు. ‘‘ఇండియాలోనే, ఇది మిగతా అభివృద్ధి చెందిన దేశాలలోకన్నా పరిమితంగా నియంత్రణతో ఇంతవరకూ వున్నది. ‘‘రేపటి సంగతి చెప్పలేం’’- అన్నదో యిల్లాలు, రుూ మాటలు వింటూనే.
దేశాల మధ్య సరిహద్దులు మూతబడుతున్నాయి. మనుషుల మధ్య కోవిడ్-19 ‘అట్టాక్’లో వున్నా, లేకపోయినా- మనిషికీ, మనిషికీ మధ్య ఆరేసి అడుగుల ఎడం వుంచుకోమంటున్నారు. కరోనా యమర్జెన్సీ విధించిన మన వర్తమానం యిదీ. పనిపాటలే బంద్ అంటూంటే- ఆట పాటలు అంటావేమిటయ్యా? అవన్నీ బుల్లితెరలకే అంకితం.
సార్క్ సమావేశాలు మొదలు సామాన్య పెళ్లిళ్లదాకా ‘వయా’ టెలివిజన్ జరిగిపోతున్న రుూ ప్రపంచంలో కరోనా వ్యాధి వ్యాప్తి ఎప్పటికి తగ్గుతుందీ? అంటే, అంచనావేసే నాధుడు లేడు. ‘‘ప్రస్తుతానికి ‘నోరు’ మూసుకుని పబ్లిక్‌గా తుమ్మకుండా, దగ్గకుండా- వున్నదేదో మితంగా తింటూ, వెచ్చగా వున్నచోట పడుక్కోండి’’ అంటున్నారు వైద్య ‘‘కోవిదు’’లు.
ఇవాళ కోవిడ్-19 మీద అందరూ కోవిదులే! ఎలా వస్తుందీ? ఎలాపోతుందీ? అన్న ప్రశ్నల మీద- ‘‘నో, ఆన్సర్’. కానీ, నువ్వూ, నేనూ, వాడూ, ఆమె- అందరూ ఎక్స్‌పర్ట్ కామెంటరీ ‘‘యిచ్చుకో’’వచ్చును. ‘‘చారు త్రాగు. అల్లం తిను. హోమియో మాత్రలు మింగు, కరక్కాయ, ఉసిరికాయ బుగ్గన పెట్టుకో’’- అంటున్నారు. ఎక్కడ చూసినా, రోడ్లమీద నర సంచారం బంద్ అయిపోయింది. ఇండ్ల మధ్య, ఇండ్ల లోపల పిల్లల సందడి ‘టొపారం’ లేపేస్తోంది. ఏం తోచక, టీవీలో పాత క్రికెట్ వీడియోలు చూడలేక ‘లైవ్‌షో’లకు అలవాటుపడిన బడి పిల్లలు- ‘ఇళ్లుతీసి పందిరి వేస్తున్నారు. ‘‘రోడ్లమీదకు పోయి, అడ్డమయిన ఆటలూ ఆడేసి వచ్చి, తిండి తినేస్తున్నారు. ఆనక కాల్చుకు తింటున్నారు’’ అంటున్నారు మాతృమూర్తులు.
‘‘స్కోరెంత?’’ అంటే మహారాష్టల్రో 32, ఆంధ్రాలో-2; తెలంగాణాలో 4’’- అంటున్నారు. కరోనా అంతటా విధిస్తున్న ‘కర్‌ఫ్యూ’తో జనం అల్లడుతూంటే ఆంధ్రప్రదేశ్‌లో, రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌కీ ముఖ్యమంత్రికీ మధ్య- ‘ఎన్నికల వాయిదా’ పడ్డ, విపత్కర పరిస్థితిలో ‘‘ప్రకటిత యుద్ధమే’’ జరుగుతోంది.
ఎన్నికలు కరోనా ఫోబియా కారణంగా- ఒడిశాలో కూడా వాయిదా వేశాడు- అక్కడి ఎన్నికల కమిషనర్. బ్రిటన్‌లో పోయిన శుక్రవారమే, ఇంగ్లండ్‌లో వాయిదాపడ్డాయి ఎన్నికలు. అన్నిరకాల లోకల్ ఎలక్షన్లనీ, మే 7న జరగాల్సిన వాటిని వాయిదావేస్తూ, గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది.
ఆఖరికి, ‘‘ఇదంతా ఉత్త భయమేనేమో?’’నన్న ట్రంప్ దొర కూడా అమెరికాలో కోవిడ్-19, ఆంక్షలువేస్తూ పది మందికన్నా ఎక్కువమంది ఎక్కడైనా కలిసి నిలబడ్డారో - వాళ్లందరినీ ‘‘మూసేస్తాం’’ అంటూ, కరోనా ఫోబియాతో చెప్పాడు. తనకి ‘నెగిటివ్’వచ్చినా, పరీక్షలో- దేశం మొత్తానికీ రాష్ట్ర గవర్నర్‌లకీ, అందరికీ- హడలి ఛావమనీ, భద్రతా చర్యలు తప్ప మరింకే పనిపాటలూ పెట్టుకోవద్దనీ, వార్నింగ్ యిచ్చాడు అత్యవసరంగా ఉత్తర్వులు.
ఎన్నడూ లేని విధంగా ఫుట్‌బాల్ లీగ్ మ్యాచ్‌లు వాయిదా. 142 సంవత్సరాలుగా ఎన్నడూ వాయిదా పడని ‘కెన్‌టకీ డెర్బీ’కూడా, మే 7న జరగాల్సిందాన్ని యిప్పుడే వాయిదా అని ఆర్డర్లు వేసేశారు.
ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ దేశాలు- చైనా, ఇటలీలకన్నా ఎక్కువ భయంతో వొణుకుతున్నాయి. భూగోళం మొత్తం కరోనా గుప్పిట విలవిల్లాడుతోంది. అందరికీ యిప్పుడు దేవుఁడు గుర్తుకువస్తున్నాడు. ‘‘పాపం! ఆ పెద్దమనిషికి నిత్యకళ్యాణ మహోత్సవాల దగ్గరనుండీ నిత్యభోగందాకా- అన్నీ ‘క్యాన్సిల్’ అయిపోతున్నాయి’ అన్న బెంగతో వున్నాడల్లే వుంది- వూరేగింపులకి కూడా దూరమైపోయాడు.
చైనావాడు మొత్తానికి భలే పనిచేశాడు. ‘‘అందరికీ తెద్దునా? కొందరికే తెద్దునా?’’ అన్న వివక్ష లేకుండా అందరికీ కోవిడ్-19ని, పంపించేశాడు. అయినా, ఆశావహమైన వార్త (16నాటికి) కరోనా కోరల్లో యిరుక్కున్న లక్షా ఢెబ్భై నాలుగువేల తొమ్మిది వందల తొంభై అయిదు (1,74,995) కేసుల్లో- డెబ్భై ఏడు వేల ఆరువందల ఏభై ఎనిమిది మంది- ‘కోలుకున్నారు’- అన్నది ప్రోత్సాహకరమైన వార్త కాగా- మృతుల సంఖ్య యింతవరకు ఏడువేలకన్నా తక్కువగా వున్నది. కాకపోతే, రుూ వ్యాధికి వ్యాక్సీన్ లేదు. ఫలానా మందు అని నిర్ధారణగా చెప్పలేకపోతున్నారు. వాషింగ్‌టన్‌లో ఒక వ్యాక్సీన్ తయారుచేశారుట. దాన్ని, ఓ నలభై మంది త్యాగమూర్తుల మీద ప్రయోగించి చూస్తార్ట! అద్వతన భావిలో- ‘‘మీ పిల్లల్ని స్కూలుకి పంపించండి కరోనా టీకాలు వేస్తాం’’- అనే శుభదినం వస్తుందేమో చూడాలి. రష్యా, జర్మనీలు కూడా ప్రయత్నిస్తున్నాయి.
ఐక్యరాజ్యసమితిలో 195 దేశాలుంటే అందులో 145- అగ్ర, ఉగ్ర రాజ్యాలు కూడా కరో’డా’దెబ్బలకి విలవిల్లాడడం చూస్తున్నాం... రుూ అత్యంత అధునాతన కాలంలో మునె్నన్నడూ ఇలా లేదు.
ఇది చాలా గొప్పకాలం- అనుకున్న సైంటిస్టులు- రోబోట్‌ల వేపు చూస్తున్నారు.- ‘ఏదైనా తరుణోపాయం, అవి యిస్తాయేమో’నని. పంచభూతాత్మకమైన మానవాళి మనుగడ- ‘తుమ్ము’ని, అపశకునం, అంటూ ఎన్నాళ్లగానో భయపడుతున్నదే గానీ- ఇప్పుడు- ‘ఆచ్ఛి’మంటే ఆమడదూరం పరిగెడుతోంది విజ్ఞాన లోకం!
అందరిచేతా, ‘నమస్తే’ పెట్టించేసుకుంటున్న కరోనా రక్కసి,- రుూ ‘ఉగాది పురుషుడి’గా కనబడుతున్నది. గాలిలోనా? వెల్తురులోనా? నీళ్లలోనా? ఎక్కణ్నుంచి వ్యాపిస్తుంది? అంటే, తెలీదు. తెరలు తీసేస్తున్నారు, ముక్కులకు ముసుగులేసుకుంటున్నారు- మందు భారుూలు, పేకాట రాయిళ్లూకూడా - దూరందూరంగా- ఎడం ఎడంగా- తంటాలు పడుతున్నారు. కానీ, ఎందుకైనా మంచిది- ‘చారు’- అంటే. మిరియాల చారు తాగుతున్నారు. బజార్లో మిరియాలు గల్లంతా? అయితే ఇంగువ చారు, లేదా ధనియాలు, జీలకర్ర నీళ్లు ఏవో త్రాగుతూ- రుూ క్రింది భద్రతలు పాటించుడీ!
కోవిడ్-19- ముక్కునుంచీ, ముక్కుకీ, అది వున్న వస్తువులనుంచీ కూడా ‘జంప్’చేస్తుందిట. బివేర్!! ఫుడ్, డ్రింకూ, ‘ఓ.కే.’గానీ- కరోనా బాధితులు తాకిన కార్డుబోర్డు వస్తువుల మీద, రుూ ‘వైరసుడు’ యిరవై నాలుగ్గంటలు మాత్రం జీవిస్తాడు. కానీ, అది ప్లాస్టిక్, స్టైన్‌లెస్ స్టీల్ వస్తువుల మీద మూడురోజులు కాపురం పెట్టి- వాటి ద్వారా సంక్రమించే ప్రమాదం వుంటుందిట. బట్టతల అయితే, నోప్రాబ్లెం- గానీ, జుత్తుంటే మాత్రం, రుూ వైరస్ మూడుగంటలలో- మరొకళ్ల మీదికి లంఘించడానికి సిద్ధంగా వుంటుందిట. కాబట్టి ఎవరి ‘సవరాలు’వాళ్లవే- ఎవరి క్రాపింగులు వాళ్లవే. దూరం...దూరం లోపల దూరిన వైరస్ బయటపడడానికి 14రోజులు పడుతుందిట. ‘‘నో కరోనా, నాకు’’, అనుకోకండి. అది ఉంటుంది అజ్ఞాతంగా దాక్కున్న కంప్యూటర్ ఫైర్ లాగా- బివేర్ ఆఫ్ ఎవ్విరిమూమెంట్! టేక్కేర్... తస్మాత్ జాగ్రత్త!
ఏమిటీ? సానిటైజర్‌లు, మాస్కులూ, ‘‘గాయబ్’’ అవుతున్నాయా? మామూలు సబ్బుబిళ్ల చాలండీ- అవి తెచ్చి, యింట్లో స్టాకు పెట్టుకోండి. బైది బై- సైంటిస్ట్ కమ్ సైకాలజిస్ట్ కమ్ కరోనా స్పెషలిస్ట్ ఒకరు చెప్పాడు- ప్రతివాడూ లేక ఆమె, గంటకి ఇరవైమూడుసార్లు తన ముక్కూ, మొహం తడుముకుంటూ వుంటాడుట సాధారణంగా.. అంచేత, ‘‘శుబ్బరంగా’’ వుండాలి- చేతులూ అవీ అందుకనే నాప్‌కిన్స్, కర్చ్ఫ్సీ లాంటివి ముక్కు తుడుచుకోడానికి కాకుండా - మొహం తుడుచుకోడానికి వేరే వాడుకోడం బెటర్. ఔనూ! మరి మొబైల్ ఫోన్‌లు ఒకరివి ఒకరు తాకితే, డేంజరా? ఏమో తెల్దుకానీ ఎక్కువ ‘రింగ్’ చెయ్యకండి! చెవులకు కరోనా సోకుతుందేమో? జాగ్రత్తగా వుండడం బెటర్!
ఈ సూత్రం భాజపా మహానాయకులకి కూడా వర్తిస్తుంది. కానీ, ఒక సామెత వుంది- ‘‘ఊరందరికీ చెప్పాను గానీ ఉల్లిపాయల పులుసు వద్దని- గానీ, యింట్లో వద్దు.. అన్నానుటే?’’ అని ఓ ఆయవారపు బ్రాహ్మడు, ఇంటి ఇల్లాలిమీద ‘్భర్త నాట్యం’ చేశాడుట. అట్లాగా భాజపా నాయకుడు- కర్ణాటకా ముఖ్యమంత్రి వరేణ్యుడు, శ్రీమాన్ ఎడ్యూరప్పగారు జనాలందరికీ వారంరోజులపాటు అన్నిరకాల విందు, వినోదాలూ బంద్- వంద మందికన్నా ఎక్కువమంది ఏ కళ్యాణానికీ హాజరుకాకూడదు.. అంటూ ఆర్డర్లువేసి- తానుమాత్రం కేవలం రెండువేల మంది బలగంతో బంగలూరుకీ అయిదు వందల కిలోమీటర్ల దూరంలో వున్న ‘‘బెలగావి’’ అనే వూరికిపోయి- రాష్ట్ర మండలి చీఫ్‌విప్‌గారి ఇంట పెళ్లికి పోయి- షడ్రశోపేతమైన పెళ్లిభోజనం చేసి భేష్ అంటూ, ‘‘బ్రేవ్’’ మన్నాడుట! వారి ధైర్యసాహసాల్ని మోదీగారు, ‘షా’గారూ తప్ప ఎవ్వరూ హర్షించరు’’ అన్నారుట, అప్పోజిషన్‌వారు- ఔరా! కఠినాత్ములు!
‘కరోనా! కరోనా! గో అవే నెవర్ టు కమ్ ఎగైన్!’’

veeraji.columnist@gmail.com 92900 99512