వీరాజీయం

గణపయ్య..దారి విడువుమయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్‌లోని ధేమ్స్ నదిలో కూడా సంబరంగా వెళ్లి మునిగే ఏకైక తొండం దేవుడు ఓ బొజ్జ గణపయ్య విశ్వవ్యాప్తారాధ్యమూర్తి! ముంబైలో గణపతి బప్పా మోరియా మైసూరు గౌరీహబ్బా మనకి ఉమ్మడి రాజధానిలో జైగణేశ్ అయిన ఓ బొజ్జ గణపయ్యకి-నవరాత్రి ఉత్సవాలు పదకొండు రోజులు చేసే ఘనత హైబ జంటనగరాలదే. ముంబయిని పూనాని కూడా మహా గణపతి ఉత్సవాల విషయంలో తోసిరాజన్న భాగ్యనగరంలో పదకొండు పగల్లని పది రాత్రుల్ని ఏకం చేసి కోలాహల సంబరాలు పూజలు ఓహోమని జరుగుతున్నాయి. వీటికి రెండు తెలుగు రాష్ట్రాలనుంచే కాదు పొరుగు రాష్ట్రాలనుంచి కూడా వస్తారు. దేశంలోనే భారీగణపతి విగ్రహాలకి ముఖ్యంగా 63 ఏళ్లుగా ఏడాదికోఏడాది జనప్రియం అంతర్జాతీయ ప్రఖ్యాతం అయివున్న ఖైరతాబాద్ ఉండ్రాళ్ల స్వామి 57 అడుగుల ఎత్తున ఈసారి శ్రీ చండీ కుమార అనంత మహాగణపతి అవతారంలో నలభై టన్నుల బరువుతో కొలువుతీరి, మొట్టమొదటి పూజ ఉభయ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌గారి చేత స్వీకరించడం-జనరంజకం ఐన వేడుక. 120మంది మచిలీపట్టణం, ఆదిలాబాద్‌కు చెందిన శిల్ప కళాకారులు మూడుమాసాలు అంకితమై రూపొందించిన ఈ గణనాధుడు పద్మశాలీల అమూల్య కానుక 75 అడుగుల నిడివిగల కండువాని, జంధ్యాన్నిధరించి విరాజమానుడై భాసిల్లుతున్నట్టే, నగరంలో ఉభయ రాష్ట్రాల్లో ఇంటింటా వీధి వీధినా ఉండ్రాళ్లు జిల్లేడుకాయలు మోదకములు పూలు పండ్లు వీటితోనే ఊరుకోక భక్తుల గుంజీళ్లు ఊరుకోక లెంపలు కూడా వేయిస్తున్నాడు పాపం. డిజిటల్ యుగం రావడంతో కళాకారులు, కవులు పండితులు హరిదాసులు నటులు గాయకులు మొదలైన వాళ్లు ఈ భారీ కాయుని ముందు నిలిచి ‘్భక్తుల’ చప్పట్లు అందుకునే ఛాన్స్ పోగొట్టుకుంటున్నారు.ఎంతసేపు స్వామి విగ్రహాల తయారీకై పైకం పంతం పరిశ్రమా చెల్లిపోతున్నాయి. గలీ గలీ జైగణేష్‌జీ చేస్తున్న రాస్తా బంద్‌లే -్భగ్యనగరంలో క్రాస్‌రోడ్స్ అంటే చౌరస్తాలు ఇంకా ‘వై’ జంక్షన్లు వగైరా వుంటాయి కాని ఎటుపోయినా రంగురంగుల తొండం దేవుడి బొమ్మలు దేదీప్యమానంగా మంటపాలు లౌడ్‌స్పీకర్లు టీవీసెట్లు బారులు తీరిన భక్తులు ఇవే దృశ్యాలు.
‘నువ్వు చూసినవా?’ అంటే ‘లేదు రేపు పోవలనుకున్నాం’-అనుకుంటూ భక్తులు సకుటుంబంగా బాలగణపతి మొదలు అతి పెద్ద బంగారు వెండి పాలరాయి గణపతి రూపాలు అందాల మంటపాలు దర్శించుకుంటున్నారు. రాంలీలా ఉత్సవాలకి తెనాలి దుర్గమ్మ ఊరేగింపులకి బెజవాడా, గణపతి ఉత్సవాలకి-మన హైదరాబాదు మస్తుగుంటాయి. వూరేదైనా-చెరువు సరస్సు కాలువ నదీ ఆఖరికి సముద్రం ఏదున్నా ముందు బుక్ అయిపోవాల్సిందే. భాద్రపద శుద్ధ చవితినుంచి అనంత చతుర్దశి దాకా జేగీయమానంగా జరిగే బొజ్జయ్య పండుగలో ఏకదంతుని వైవిధ్య భరిత ఆకారం విగ్రహం ఇవీ ప్రధాన ఆకర్షణలు. దేవాలయాల్లో కదు వీధిన వీది మొగన నాలుగురోడ్లు కలిసేచోటా దొంతర్ భవనాల లోగిల్లల్లో, దుకాణాలమీద జాలిగా వేలాడే పత్రికల మొహాల మీద అంతటా ఈ మూషిక వాహనుని దివ్యమంగళ విగ్రహమే. అసలు ఓం గణేశ్, శ్రీ గణేశ్ చెయ్యనిదే రోదసి యాత్ర కూడా మొదలవదు అంటారు.
వినాయక చవితి దేశం మొత్తంమీద వచ్చే కొత్త పండుగులకు ‘లైన్ క్లియర్’ ఇస్తూ ‘దువ్వరా’లు పరిచే, మోదక మోదం కలిగించే సప్తవర్న భాసిత స్వాగత భేరి. ఒక్క హై.బా లోనే కాదు వందల కోట్ల రూపాయలు బప్పా ‘గణపతి మోరియా’కి కైంకర్యం అయిపోతాయి. ఎందుకనో ఇవాళ ‘మధురానగరిలో చల్లనమ్మి వచ్చితిని దారి విడుము కృష్ణా’ అన్న గోపిక అభ్యర్థన పాటే స్ఫురిస్తోంది.ఎటు చూసినా పద్మవ్యూహం లాగే వుంది. ఏ గల్లీకి పోయినా స్వామివారి వీపు అడ్డం వస్తుందో? ఏ వీధి ఏ మార్గము వినాయక వ్యూహంలో ఇరుక్కు పోతుందో ఆ ఏకదంతునికే ఎరుక. ఆటో ఎక్కుతామా? విద్యానగరమైనా, వంస్థలిపురమైనా, ఏదైనా ఈ విగ్రహాల కళావైభవాన్ని, ఠీవీని, దర్పాన్ని చూసి మురిసిపోతూ-‘అరె అరె రోకోభాయ్ బాజు గల్లీ మే జానా’ అంటాము/‘నాయి జాతే యహీన్చ్ ఉతరో’ అని దింపేస్తాడు ఆటోభాయి. ఇలా పాదయాత్రలో మజా తెలుస్తుంది కూడా. ‘స్వామీ! దారి విడుము నీకు మ్రొక్కెదన్’ అనుకుంటూ ఆ గోపికలాగ దారి తడుముకుంటూ పోవడమే కర్తవ్యమ్. భారీకాయుడు సామి నడగొండ లాంటివాడు-ఈసారి బెజవాడలో కూడా వినాయకుడి భారీ కాయం ఎత్తు ‘ఇకో ఫ్రెండ్లీ’గా బాగా పెంచేశారు. ఖైరతాబాద్ 57 అయితే జింఖానా క్లబ్బు (బెజవాడ) వినాయకుడు 72 అడుగుల ఎత్తుకు లేచాడు. విశాఖలో గాజువాక విఘ్నేశ్వరుడికి మేఘాల్‌తోచెలగాటం-ఇలా జనాలు-ఎలకమీద ఊరేగే దేవుణ్ణి-క్రేనులుతో ఎత్తి భారీ లారీల మీద మండపాలకి చేరవేయడం మొదలై వారం దాటింది. జంటనగరాలలో వీటి రవాణా దృశ్యాలే జనాల్ని నివ్వెరపరుస్తూ అసలే చిక్కిరి బికిరిగా వున్న ట్రాఫిక్ని ‘ఖడేరావ్’గా నిలదీస్తూ వుంటే-పనులకు లేటు అయిన ప్రతీవాళ్లకి అదే సాకు. ‘ఏం చేయాలెం?-్ధల్పేట నుంచి గణపతి ట్రక్కులు వస్తూ దారికడ్డం పడిపోతే’ అంటున్నారు.
కాకపోతే, ఈ ఏడాది మట్టి బొమ్మలకి ఎక్కడ లేని గిరాకీ వచ్చింది. పర్యావరణమైత్రికి ఆలంబన కాగల భక్తికి మంచి ప్రచారం వచ్చింది. లక్షల సంఖ్యలో మట్టి గణేశ్ మూర్తులను ఉచిత పంపిణీ కూడా చేశారు. ప్లాస్టరాఫ్ పారిస్‌తోను ప్లాస్టిక్, లోహరేకులుతోను చేసే బొమ్మలు వేలల్లో లేదా కొన్ని లక్షల రూపాయల్లో ధన వ్యయాన్ని చేస్తున్నాయి. మనిషిలోని అహంకారాన్ని, అనవసర దర్పాన్ని డాంబికాన్ని చాటే ఈ విగ్రహాల పోటీ ఎలక్ట్రిక్ తీగల్ని తెంచేస్తున్నది. నెలల తరబడి తయారైన లోహమయ మూర్తులను మళ్లీ భారీ వాహనాల మీద భాజా భజంత్రీల మధ్య తీసుకుపోయి జలార్పరణం చేసి కొంపకి చేరాలి. బొజ్జయ్య తిన్నగా ఎలకనెక్కి వెళ్లిపోతాడు కానీ ఈవిగ్రహాలు మాత్రం నీట కరగకుండా శిథిలం కాకుండా జనాలకు హాని కారణాలవుతున్నాయి. ఒకటా రెండా? లక్షలసంఖ్యలో అరగని కరగని చెరగని విగ్రహాలను బంగాళా ఖాతం కూడా పొట్టన పెట్టుకోలేదు-గొప్పే కానీ హుస్సేన్ సాగర్ విషపూరితమై పోతోంది అంటూ మేల్కొన్న గవర్నమెంటు వేరే చెరువులు సరస్సులు అవీ ఏర్పాటుచేస్తోంది. కానీ ఈ లోహ విగ్రహాల శిథిలాలనే కాదు-కుండపెంకు వినాయకులను కూడ నీరు కరిగించలేదు. మొహంజదారో హరప్పల నాటి చిల్లపెంకులే-ఇంకా వుంటే ఈ ప్లాస్టిక్కు శిథిలాలు భావి తరాలకు చరిత్రని గాక దుర్గతినే చూపిస్తాయి. చవితి ఉదయం చిన్నపిల్లగాళ్లు బజార్లో -బామ్మా, ఆ పెద్ద ఇనాయకుడు కావలె అంటూ అడుగుతూ వుంటే- ఓ బామ్మగారు చెప్పింది-నీ ఐదో ఏటనుంచి కొంటున్న రంగురంగుల్ కుండ విగ్రహాలు షో కేసులో వున్నాయిగా వాటితోపాటే ఇదిగో ఈ మట్టి వినాయకున్ని పెట్టి- పూజ అయిన మూడోరోజున మట్టి దేవుడ్ని మన దొడ్లొ బావిలో పడేస్తే సరి-నీ రంగుల బొమ్మలు వచ్చే ఏడాదికి మళ్లీ పాలవెల్లినిండా నిండుగా వుంటాయి’ అని
మట్టిలో విత్తనాలు కలిపి బొమ్మలు చేసి ఈ ఏడాది కొంతమంది పర్యావరణ ప్రియులు మినీ గణేశ్‌లని కొన్ని చోట్ల-ఉదాహరణకి హైబా ప్రగతి నగర్లాంటి చోట్ల పంచారు. ఈ మట్ట విగ్రహాలకి బక్కెట్ నిమజ్జనం కూడా బాగానే వుంటుంది. దొడ్లో మట్టిలో కలిపితే మూల మొక్కలు లేస్తాయి-చిన్న పిల్లలకి ఇటువంటి ప్రలోభాలు పనిచేస్తాయి గాని-లోకుల సొమ్ములు వసూలు చేసి-చందాలు మామ్మూల్స్ దండి ఆర్భాటంగా-మందుకి విందుకి వినియోగించే ‘్భక్తులు’ మనకి పేట పేటకీ ఉంటారు.
‘ఒక ఐడియా’ అన్నాడు-మండపాలలో మందు విందు చిందులు చేత రాని ఒక పరీక్షల పిచ్చి యువకుడు. మన ఇంట్లో కుండ బొమ్మలు దాచినట్టే ఈ భారీ లోహ మూర్తులను కూడా షెడ్డులోకి ఉద్వాసన చెప్పి హారతి పట్టి దాచేస్తే తప్పేముంది? బామ్మగారు తన మనుమడి సరదా రంగు కుండ బొమ్మలు దాచడం లేదా? అల్లాగే, ఓహో నిమజ్జనం చేయకపోతే గణనాధుని పూజయొక్క పూజ ఫలితం దక్కదు కదూ? అందుకని ఓ ‘ఉత్సవ’ విగ్రహం మట్టితో-నీట కరిగిపోయే ఇతర పదార్ధాలతో చెయ్యడం- దాన్ని తిరుపతి వెంకన్న ఉత్సవ విగ్రహాలను తేరు వీధిలో మాడ వీధిలో వూరేగించినట్టు మేళ తాళాలతో తీసుకుపోయి జలార్పణం చేయడం-చేస్తే, నిమజ్జన మహోత్సవ మజా దక్కుతుంది. చెరువులు సరస్సులు నదులు బతుకుతాయి...కళాకారులకి శామియానాలకి బాజా భజంత్రీలకి-ఇతరత్రా గణపతి నవరాత్రుల మీద నాలుగు రాళ్లు చేసుకునే వాళ్లకే కాదు అందరికీ మేలు జరుగుతుంది...ఇక లడ్డు యవ్వారం-అది ఎంతయినా మనుషుల పొట్టలోకి పోయేదే-వేలం వేస్తే పైకం సంఘ-సేవకి పోయేదే కనుక -నోప్రాబ్లం-మోదకం వినాయక ప్రియం గనుక చేయండి- శాలిబండ అంత లడ్డూ, వూరి చివరి గుట్టంత లడ్డూ చేయించండి-స్వామివారికి నైవేద్యం చేయించండి-ఆరగించండి-జైగణేశ్ జేగణేశ్ పాహిమాం రక్షమాం అని కీర్తించండి తరించండి-వినాయకుడి భారీ కాయాన్ని ఎలుక మోసినట్టు భక్తులు తమ నెత్తిమీద మోస్తేనే పుణ్యం పురుషార్ధం-క్రేనులు, బుల్డోజర్లు లారీలు, ట్రాక్టర్లు అవీ అక్కరలేదు అన్న లెక్చర్ ఇచ్చాడు తాతయ్య ఒకడు- అతను ఇంటర్నెట్ యుగానికి ముందు పుట్టినవాడు. ఖైరతాబాద్ గాజువాక బెజవాడల కీర్తికి లడ్డూ సైజుతో ముడిపెట్టుకోండి..అవ్వా బువ్వా రెండు దక్కుతాయి-పర్యావరణం పరమారోగ్యం మన ఆరోగ్యం రెండూ దక్కుతాయ్-మట్టి వినాయకుడే ముద్దు-లోహ గణపతి వద్దు అని సంప్రదాయాన్ని మార్చండి అంటే ఏమంటారు?
మేక్‌ది ఫెస్టివల్ ఎకో ఫ్రెండ్లీ అండ్ ప్లీజ్ గణేశ్‌జీ!

veeraji.columnist@gmail.com