వీరాజీయం

ఎక్కడైనా ‘సెల్’ ముద్దు.. క్లాస్‌రూమ్‌లో వద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుళ్లో బళ్లో రైల్లో హాల్లో కిచెన్లో బాత్రూంలో బెడ్‌రూమ్‌లో సరేసరి.. మార్నింగ్ వాక్‌లో హమేషా ఆఫీసులో మోపెడ్ మీద మోటారు కార్లోను- హియర్ దేర్ ఎవ్వెరి వేర్- నీ నీడను నేనేనంటూ ఉండేది ఎవ్వరు? ఏది? జవాబు చెప్పనక్కర్లేదు అందరికీ తెలుసు. కానీ- క్లాసు రూముల్లో వద్దండీ అంటున్నారు ‘సర్వే’యర్లు. ఇంతకన్నా మీ పిల్లలకి ఓ గ్రాము నల్లమందు ఇవ్వండి లేదా ఓ బా టిల్ విస్కీయో వైనో ఇవ్వండి కాని క్లాసు రూముకి మొబైల్ ఇచ్చి పంపకండి- ముఖ్యంగా స్మార్ట్ ఫోన్‌లు ఇవ్వకండి అని అంటున్నారు అధ్యాపకులు-సైకాలజిస్టులు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ విద్యా సదస్సులో పా ల్గొన్న విద్యా నిపుణులు, అధ్యాపకులు- ‘క్లాసురూముల్లో బ్లూఫిలింస్ వీక్షణలు, సెక్స్‌టింగ్-టెక్స్‌టింగ్ ఎక్కువ అయిపోయాయి. టీచర్లకి కూడా ఓచేత్తో సెల్ మరో చేత్తో డస్టర్లు అలవాటైపోయింది.’ అని ఆందోళన చెందారు.
ఇదే మాదిరి ఆందోళన పోయిన వారంలో లండన్‌లో జరిగిన ఓ స్టడీ సెమినార్లో కూడా వ్యక్తమైంది. ఎనిమిది గంటలకన్నా ఎక్కువసేపు మొబైల్ స్క్రీన్ చూస్తే, చెవిలో పెట్టుకుని ఇయర్ ఫోన్లతో వింటే నిస్సందేహంగా ఆ పిల్లల కళ్లు ఉత్త గోళీకాయలైపోతాయి అని నేత్ర వైద్య నిపుణులు-సెల్ పిచ్చి గాళ్లకి పునరావాస చికిత్సలు చేసే వైద్యులు గోలెట్టేస్తున్నారు. మాదక ద్రవ్యాలు కాలేజీ పిల్లకాయలు, ఇస్కూలు పిల్లకాయలు కూడా అతి రహస్యంగా సేవిస్తున్నారు అన్న రహస్యం ఇటీవల బయటపడి- అది ఇంతై అంతయి సినిమా రంగాన్ని చుట్టేసింది. నో ప్రాబ్లెం-వాళ్ల యోగక్షేమాలు వాళ్లే చూసుకోగలరు కాని స్టూడెంట్స్ మాటేమిటి? విద్యార్థికి కూడా ఇది స్టాటస్ సింబలేనా? వాళ్లకి కాదు వాళ్ల మమీ డాడీలకి-ఇద్దరూ ఉద్యోగాలు చేసుకోవాలి. వారంలో అయిదు రోజులు వర్కింగ్ డేస్ బిజీ, ఆనక వీకెండ్ బిజీ. 1970 దశకం చివరిదాకా మొబైల్ లేదు, 1990ల దాకా ఇంటర్నెట్ తెలీదు. తరువాత ఈ శతాబ్దంలో డేటాకార్డులు, హైస్పీడ్ వైఫైలు గట్రా రావడమే కాక -ఇంటింటికీ ఇంటర్నెట్.. ఊరంతా వైఫై అంటూ గవర్నమెంటులే జనాల్ని ఊదరగొట్టేస్తుంటే- పిల్లకాయలు ఆకర్షితులు అవరా? క్రికెట్ చూద్దామని, టెన్నిస్ చూద్దామని ఏ చానెల్ ఆన్ చేసినా- ‘అప్పో సప్పో చేసి సెల్‌ఫోను కొను.. సెల్ఫీ తీసుకుని తరించు’- అని అసలు ఆటకన్నా ఎక్కువ గ్లామర్ గోలతో ప్రకటనలు రుప్పేస్తాయి. ఒకప్పుడు కూల్డ్రింకులు, జీన్‌పాంట్లు వగైరా గ్లామర్. ఇప్పుడు మొబైల్ ఫోనే్ల ప్రధాన ఆకర్షణలు. తరగతి గదుల్లో పక్క పక్కనే కూర్చుని కూడా మెసేజీలు నొక్కుకుంటారు. కొత్త ఆట సెక్స్‌టింగ్- బూతు సందేశాలు.
నీలిచిత్రాలు ప్రధాన ఆకర్షణ. దానికో వేళా పాళా లేదు. అరచేతిలో స్వర్గం-అనుకుంటున్నారు. అదేదో తమ ప్రయోజనమే అనుకుంటున్నారు. టూజీ త్రీజీ ఉహు.. కాదు కాదు ఫోర్‌జీ.. ఇలాగ గొప్పలు చెప్పేసుకుంటూ ఐహిక ప్రపంచానికి దూరంగా వెళ్లి పోతున్నారు పిల్లలు. పెద్దాళ్లు సరేసరి- అది వాళ్ల హక్కు కదా?
ఇంటర్నెట్-వైఫై లాంటివి ఈ శతాబ్దపు అద్భుత వరాలు. కమ్యూనికేషన్ రంగంలో టాప్ దేశం మనది. కాని ఈ వ్యసనానికి విచక్షణ లేదు. అవసరం ఉన్నా లేకపోయినా వినోదం కోసం- అరచేతిలో చెత్త చానల్స్ కోసం పిల్లలు-టీనేజర్స్ ఎగబడుతూ ఉంటే, పది ఏండ్ల లోపు పిల్లలు ‘పోకేమన్’ గేమ్‌కు బానిసలైపోతున్నారని లెక్కలు చెబుతున్నారు. సుప్రీమ్‌కోర్టు దాకా కేసు వెళ్లడం, వాళ్లు గవర్నమెంటును ‘వీటిని అరికట్టాలంటూ’ సలహాలు ఇవ్వడం- అంతే మళ్లీ యూ ట్యూబు రెడీ. దీనిలో ఎవడు పడితే వాడు-ఏ బూతు పెడితే ఆ చెత్త తీయడం, అప్‌లోడ్ చేసెయ్యడం- ‘వైరల్’ అంటూ సోషల్ మీడియాలో అది స్వైర విహారం చేయడం-ఇది గాక పోర్నోగ్రఫీ అతి ముదురు అశ్లీల అక్రమ చెత్తని చూపించే సైట్లు- ఇవి అదనం. ఒక అమ్మాయి (ఇది వార్తే.. జోకు కాదు) నా శరీరం అందంగా వుంది కదా అని నేను నా నగ్న చిత్రాలు తీసి నా ఫ్రెండ్స్‌కి పోస్టు చేసాను- తప్పా? అన్నది.
అసలు యూ ట్యూబులోకి అప్లోడ్ చేయడానికి ఏమీ రూల్సు, రెగ్యులేషన్లు, ఫీజు లు, లైసెన్సులు లాంటివి ఏమీ ఉండవు. ఎవడో పెట్టాడు అం టే అందరూ చూసేస్తున్నారు. అది వైరల్ అయింది అంటూ దానికో వార్త-బోలెడంత హైపు. ఇదీ ధోరణి. తల్లిదండ్రులు అధ్యాపకుల వైపు వేలెత్తి చూపెడుతున్నారు. వాళ్లు అమ్మానాన్నలదే బాధ్యత అంటున్నారు. ఈ మధ్య తెలంగాణ విద్యాశాఖామాత్యులు- ‘టీచర్లు క్లాసులో సెల్ చాటింగ్ చేస్తూ వుంటే వీడియో తీసి పంపండి.. వాళ్లని ఉన్న పళాన సస్పెండ్ చేసేస్తా..’అన్నారు. ఈ సందర్భంగా ఒక టీచరు పేరు చెప్పకుండా అడిగింది- ‘ఎవరు వీడియో తియ్యాలి? క్లాసులో ఉండేది నేను-నా విద్యార్థులు-అంటే వాళ్లు నన్ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలి, ఔనా?’ ఏతావతా చెప్పొచ్చేది ఏమిటీ అంటే-స్టూడెంట్స్ దగ్గర స్మార్ట్ మొబైల్ ఫోనులు ఉండొచ్చుననేగా అర్థం? దేవాలయాల్లోకి మొబైల్స్ తేవద్దు అన్నట్టే క్లాసు గదిలోకి మొబైల్స్ తేనివ్వకండి. అంతేకాని మమ్మల్ని కాపలా కుక్కలుగా పెట్టకండి అని?
ఏడేళ్ల పాపాయికి ట్యాబ్ ఇస్తేగానీ ముద్ద ముట్టడు అంటూ చెబుతాడు వాళ్ల తాతగారు గర్వంగా-పదేళ్ల వాడు గేమ్సులో ఎక్స్పర్టు-టీనేజర్సు మాస్టర్స్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్-పేరెంట్స్ అనగా ఎవరు? తన బిడ్డ చదువుకి పెట్టుబడి-స్కూలుకి ‘రెంటు’లాగ ఫీజులు ‘పే’ చేసేవారు అని అర్థమట? పే ‘రెంటు’-బయ్ స్మార్టు ఫోను.. ఆనక మీ ఎంజోయ్మెంటు మీది- మా సరదా మాది అంటున్నారు కుర్రకారు. ఒక తల్లి పెద్ద ఉద్యోగమే చేస్తోంది అడిగింది టీచర్ని-‘మేము మా పాప భద్రతకి మొబైల్ ఇస్తున్నాము-ఈ మాయదారి రోజుల్లో స్కూల్ నుంచి ఇంటికి రావడమే ఎడ్వంచెర్-మేము అందుబాటులో ఉండాలనే ఇస్తున్నాం ఫోను-వాళ్లు మిస్యూజ్ చేయకుండా మీరు చూడాలి’- ఆ సంపన్న పడతి దూరం అయ్యేదాకా ఊరుకుని -తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది టీచర్- ‘అంతగా టచ్‌లో ఉండాలి అంటే ఓ డబ్బా ఫోను కొని ఇవ్వచ్చుగా?-స్మార్టు అంటూ వేలకొద్ది డబ్బు పోసి గేమ్సు, బూతులు పిల్లల చేతిలో పెట్టి మమ్నల్ని అనడమెందుకు? చెవిలో ‘పిక్క’ గుచ్చుకుని వాడు లేక అది ఇలా క్లాసులో కూచుంటే మేము మొహం అటు తిప్పుకుని పాఠాలు చెప్పి పోతున్నాము అంటారు. ఇక వాళ్ల గురించి వీళ్లు చెప్పిన కథ చెప్పకుండా చెప్తారు. ఈ సెల్‌ఫోను సొదా రొదా యూనివర్సల్ ప్రాబ్లెం. బూతు సైట్ల కన్నా మనలాంటి వేషాల్లో మన భాషలో వావి వరసలు మనవే పెట్టి-వేషాలు కట్టి తీసే ‘ఇనె్సస్ట్’ ఫార్సులను విచ్చలవిడిగా (ఏదో ఒకటి రెండు యాడ్స్ తెచ్చుకుని) వదిలిపెడుతూ వుంటే నెట్‌మీద వెతుక్కోనక్కర లేకుండా అవి ‘కళ్లకు’ చుట్టుకుని-యువతీ యువకులను పెడదోవలోకి (మొదట ఆలోచనలోనే అనుకోండి) చోద్యం చూస్తూ ఊరుకుంటున్న మహిళా సంఘాలు- తల్లిదండ్రులు-టీచర్లు ఏమి చేస్తున్నట్టు? ఒక వికారి ఇటీవల తన పడగ్గది కార్యక్రమాన్ని నేరుగా ‘లైవ్’ చేసేశాడుట! రేప్‌లు, సెల్ఫీ మరణాలు పెరగడానికి కారణం- మొబైల్ వాడకం మీద-వాటి కోసం వచ్చే ప్రకటనలమీద- ముఖ్యంగా అడ్డూ అదుపులేని అప్లోడింగ్స్ మీద నిఘా, ఆంక్షలు, అతిక్రమిస్తే కఠిన శిక్షలు-కావాలి అన్న ఆందోళన సర్వత్రా రావద్దా?
ఇండిస్క్రిమినేట్ ‘అప్లోడింగ్’ ఈజ్ ఎ డెలిబ్రేట్ సోషల్ క్రైమ్
*