S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరాజీయం

04/24/2017 - 04:05

ఎండాకాలంలో ‘గంటల శకటాలు’ అంటే అగ్నిమాపక దళాల వాహనాలు- అలా మ్రోగుతూనే వుండడం ఎక్కడో కొంపలు తగలపడ్డాయ్ అని జనాలు మెడలు రిక్కించి చూసి- ఎండ వేడిమికి తట్టుకోలేక మొహం త్రిప్పుకొని తమ దారంట పోతూండటం బెజవాడలోని నిత్య నూతన దృశ్యాలు. కాని ఇటీవల ‘అందాక ముఖ్యనగరం’గా పేర్గాంచిన విజయవాడ మహానగరంలో ‘ఎఱ్ఱ దీపాల’ వాహనాల బెడద ఎక్కువైంది.

04/17/2017 - 01:44

క్రైస్తవ మిషనరీ స్కూళ్ళు, ప్రైవేటు కార్పొరేటు విద్యాలయాలు- వీటికి వున్న ప్రత్యేకతలేమిటి? వీటికి రెండు కొమ్ములు అదనంగా వచ్చాయా? ప్రభుత్వ రంగంలో వున్న స్కూళ్ళు కేవలం మధ్యాహ్నం బువ్వ పెట్టడానికేనా పరిమితం? ఏటా ఎండాకాలం వచ్చినట్లే ప్రైవేటు స్కూళ్ల బాసులు వాళ్ల శక్తిననుసరించి ఫీజులు ఇంకా రకరకాల స్పెషల్ ఛార్జీలను కూడా ఎడాపెడా పెంచేస్తారు! ఇంచుమించు మన మహానగరాలన్నింటా ఇదే తంతు.

04/10/2017 - 00:51

ఈసారి శ్రీరామనవమి నాడే క్రికెట్ జాతర ఐ.పి.ఎల్ కలిసి వచ్చింది. రాజకీయ నాయకులకు ఉదయం అటు తలంబ్రాల పండుగ, యిటు బాబూ జగజ్జీవన్‌రామ్ జయంతి వేడుక- దేశం అంతా క్రికెట్ వ్యామోహంలో మొహం మొత్తిందా? అన్నట్లుగా ‘పిచ్’ మీద ఇండో- ఆస్ట్రేలియన్ వార్ చండ ప్రచండంగా సాగింది. మండుటెండలకు స్వాగతం పలుకుతూ వెళ్లిపోయింది.

04/03/2017 - 00:23

భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ‘సైకిల్ యుగం’లో వున్నాం అనేవారు. ఇవాళ మనం చాలా దూరం ‘మోదీ’ యుగంలోకి వచ్చేశాం. సైకిలో, మోటర్ సైకిలో ఎవడూ ఎక్కడు- కనీసం మూడుచక్రాల ఆటో లేదా నాలుగు చక్రాల టాక్సీ (క్యాబ్) అయినా వుండాలి. మిడిల్ క్లాసు మాష్టర్లకి, మాడమ్స్‌కి ఇప్పుడు ‘క్యాబ్’ మోజు..

03/27/2017 - 00:17

సుప్రీం కోర్టు మొత్తానికి కరాఖండీగా ఓ మాట చెప్పింది. థాంక్స్ టు శ్రీమాన్ సుబ్రహ్మణ్యస్వామి. ఎందుకంటే- ఆయనే ‘ఈ కేసు సంగతి ఏమిటో త్వరగా తేల్చండి మహాప్రభో!’ అంటూ మొరపెట్టుకోబట్టే- ఈడిగల పడ్డ కేసు మళ్లీ కదిలింది.

03/20/2017 - 01:05

గవర్నమెంటు కాలేజీల్లో అటెండెన్సు బాగుంటే ముందు, ఆ తర్వాత అన్నీ వాటికవే బాగుపడతాయ్- అన్న విశ్వాసం ఒకటి చాలాకాలంగా వుంది. ఖాళీ పొట్టలతో పోలేక విద్యార్థులు మధ్యాహ్నం క్లాసులకి ఎగనామం పెడుతున్నారన్నది ఒక పరిశీలన. ఈ విషయంలో తెలంగాణ గవర్నమెంటు చాలా తీవ్రంగా యోచిస్తున్నది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలలో ఈ సంగతి వెల్లడి అయింది. నిజానికి సిఎం కెసిఆర్ ధ్యేయమే కె.జి. నుంచి పి.జీ.దాకా ఉచిత విద్యాబోధన.

03/13/2017 - 01:04

ఈ వారమంతా మార్నింగ్ వాకర్స్‌కి ఓ కొత్తరకం కాలక్షేపం తటస్థపడ్డది. ‘ఏం సామీ..! రైట్ అబౌట్ టర్న్ కొట్టేస్తున్నారా?’ అంటూ పలకరించాడు ఓ పెద్దమనిషి. నవ్వుతూ చూసిన ఆ మొదటి సీనియర్ సిటిజనుడు ‘ఎక్కడైనా ఏటిఎమ్ లేవేనా తెరిచి వున్నాయా? మీరొచ్చేదారిలో! అనడగాలనేగా.. మీ ఉద్దేశం?’ అంటూ ఎదురుప్రశ్న వేశాడు.

03/06/2017 - 07:33

అబ్బ! ఎండాకాలం వచ్చేస్తోంది.. వచ్చేసింది..’’ అనకూడదు. కాస్త మాడ్రన్‌గా అనాలి అంటే- ‘‘ఓ గాడ్! సమ్మరొచ్చేసింది!’’ అనాలి. ఇకనేం? ‘‘వేస్కో కోకోకోలా!’’ అని ఒకడనగానే- ‘‘లేదు దానికి వేళాపాళా’’ అనాలి అతవలివాడు.

02/27/2017 - 00:27

యు ట్యూబ్ రెండువైపులా ‘వాడి’గల కత్తి. ‘యూట్యూబ్- వైరల్’- ఈ మాటలు అరిగిపోయినంత యిదిగా నిత్యం వినబడుతూంటాయ్. కానీ, రుూ ట్యూబ్ విశేషాలు నిత్య నూతనాలు. గట్టిగా చెప్పాలీ అంటే నిత్య దారుణాలు. అది ‘‘వైరల్’’అయిపోయింది- అంటే, చూస్తేచాలు జన్మ కలుషితమైపోతుంది. చూస్తే చాలు భయం, గగుర్పాటు- రక్తనాళాల్లో జలతరంగిణి వాయిస్తుంది’- అనిపిస్తుంది.

02/20/2017 - 07:21

ఇవాళ ఎవరైనా- ‘ఈసురోమని మనుషులుంటే’ అని అన్నా, ‘మనవాళ్లు ఉత్త వెధవాయలోయ్’- అని అనబోయినా, ఆ మాత్రం.. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ వున్నవాడు సైతం చెంపలు ఛెళ్లు ఛెళ్లుమనిపించేస్తాడు. గత జూన్ నెలలోనే ఆంధ్రప్రదేశ్‌లోని ‘షార్’ రేంజ్ నుంచి ఒక్క రాకెట్ విసురున ఏకంగా ఇరవై శాటిలైట్స్‌ని (కృత్రిమ ఉపగ్రహాల్ని) రోదసి కక్ష్యలోనికి తీసుకుపోయి వదిలిపెట్టింది. ఆ ఇరవైలో 13 ఘనత వహించిన అమెరికా వారివి.

Pages