S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరాజీయం

01/15/2018 - 00:48

ముక్కు కోస్తూ వుంటే రక్తం తాగే మొండి ఘటాలు మనకి సామెతల్లోనే కానవస్తారు అనుకోకండి- ఇలలో కూడా వుంటారు. శ్రీమాన్ లల్లూ ప్రసాద్ యాదవ్- బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఆర్‌జెడి చీఫ్‌కి మూడున్నర ఏండ్ల జైలుశిక్ష- పది లక్షల జరిమానా పడగానే కథ ముగియలేదు. ఇంకా రెండు కేసులు ఉన్నాయి.. ఎప్పుడో ఇరవై ఏండ్లనాడు తినేసిన పశుగ్రాస నిధుల గురించి ఇవాళ బాధ ఏముంటుంది? అరిగిపోయేయిగా..

01/08/2018 - 02:37

ట్వీట్ అంటే చిలక పలుకు కాదు.. అది అంబ పలుకు అనుకొనేలా చేశాడు ముఖ్యంగా మన నమోజీ- ఆదేశాలు సంతాపాలు శుభాకాంక్షలు అన్నీ ట్వీట్లమీదే ఒగ్గుతున్నారు ఘనాపాటీలనుంచి కుర్రకారు దాకా; ఇవాళ రేపూ జగమంతా ట్వీట్లమయమే- అమెరికా అధ్యక్షుడు అతి ముఖ్యమైన సంగతి ఏదైనా ముందుగా ట్వీట్ ఇస్తాడు. ఆనక ఆలోచిస్తాడు. ఆ తరువాత అధికార ప్రకటన వగైరాలు వెలువడతాయి. భారత ప్రధాని మోదీజీ ట్వీట్ అంటే అది రాజముద్ర పడ్డ తాఖీదే..

01/02/2018 - 00:31

ఏదొ ఒక కొత్త వింతని తీసుకురావాలి. కనీసం చొక్కా తిరగేసి తొడుక్కోవాలి. అసలు చొక్కా తొడుక్కోకపోయినా అదీ ఒక ఆవిష్కరణే..

12/25/2017 - 00:39

గజం మిధ్య.. పలాయనం మిధ్య అన్నట్లుగా వుంది పటియాలా హవుస్ స్పెషల్ కోర్టు తీర్పు - 2011 మార్చిలో ఏర్పాటు చేయబడ్డ స్పెషల్ కోర్టు సుమారు ఏడు సంవత్సరాల విచారణ తరువాత - ప్రధాన నిందితుడు టెలికం శాఖ మాజీమంత్రి రాజా ఏ పాపము ఎరుగడు నిర్దోషి అని, అందుచేత కరుణానిధి తనయ కనిమోళి అమ్మళ్ - నిర్దోషి అని - మిగతా పదిహేడు మంది ముద్దాయిలు - ముద్దుకేమో?

12/18/2017 - 00:50

ఫోను మీద - పొట్టి సందేశాలు నాకు రావు. నేనేమైనా కుర్రవాణ్ణా? సెలెబ్రిటీనా? అనుకోనక్కర లేదు - నీకో ఫోను ఉండాలేగాని టెలికాం వాళ్లు ఇంగ్లీషులోను లేదా ఇంగ్లీషు అక్షరాలలో రాసే హిందీలోను -ఎస్‌ఎంఎస్‌లను ఎంతో మక్కువతో నువ్వు వద్దన్నా రోజూ - కొడతారు. ఏమిటి? ఇవాల్టి ఉల్లిపాయల ధరా, కోడిగుడ్ల ధరా కాదు - మీ మొబైల్‌ని ఆధార్కార్డుతో లింకి చేసు‘కోప్చే’సుకోవాలి.

12/11/2017 - 02:01

ఎట్టకేలకు, కాంగ్రెస్ పార్టీకి డిఫ్యాక్టో బాస్‌గావున్న రాహుల్ భయ్యా అధికారికంగా ముళ్లకిరీటం ధరించాడు. 89 సెట్ల నామినేషన్లు పడ్డాయి. ఒక్కటైనా ఇంకొకరు ఫార్మాలిటీకి మరో నామినేషన్ వేస్తే బాగుండేది. కాని, 19 సంవత్సరాల తరువాత ఇందిరమ్మ కోడలు- సోనియమ్మకి ప్రసంగాలు చూసి చదివే యాతన తప్పింది.

12/04/2017 - 00:20

హైదరాబాదు ఇంటర్నేషనల్ కనె్వన్షన్ సెంటర్ ‘‘హెచ్‌ఐసిసి’’కి అలాగే హెచ్‌ఎమ్‌ఆర్ అంటే హైదరాబాదు మెట్రో రైల్‌కి చెందిన ఇరవై నాలుగు స్టేషన్లకి పండుగ కళ వచ్చేసింది.

11/19/2017 - 23:40

దేశంలో అదేం కర్మో కానీ, అన్ని దరిద్రాలు, అన్ని అరిష్టాలు దేశ రాజధాని ఢిల్లీ నగరానికే వస్తాయి.

11/13/2017 - 00:19

గాడిద పాలు అనంగానే మొహం అలా పెట్టకూడదు- ఆ మాట ఎబ్బెట్టుగా వుందా? సరే, గార్ధ్భ క్షీరము అనండి. గంగిగోవుపాలు ఓ బిందెడు అయినా - ఓ మిల్లి గరిటేడు గా.పాలు చేసిన మేలు చెయ్యలేవు - ఇది వేమన్నగారి పద్యానికి విపర్యయం - అప్పట్లో, మడేలన్నలు తమ మూటలు మొయ్యడానికి మాత్రమే ఖరరాజుల్ని వినియోగించేవారు కాబోలు. మరి కడివెడు గాడిద పాలు ఎలా? అని అందుకన్నాడు వేమన్జీ!

11/05/2017 - 22:58

న్యూస్ అంటే ఏమిటి? తూర్పు పడమర ఉత్తరం దక్షిణం దిక్కుల నుంచి వచ్చే రేప్స్, ఉగ్రవాద దాడులు, రోడ్డు ప్రమాదాలు ఇవన్నీ అనుక్షణ నూతన వార్తలు. క్షణం క్షణం మారిపోతూనే వుంటుంది. ‘శీను’ కాని కొత్త మాట గ్యాంగ్ రేప్ మీడియా ...... వెనుకటి రోజుల్లో దొమీ అని ఒక మాట రాసేవాళ్ళం. పదిమంది కలిసి ఒకన్ని కర్రలతోనో కత్తులతోనో కుమ్మేసి చంపేసి పారిపోయేవారు. కేసు మీద విచారణలో ఎవరి కర్ర దెబ్బకి ప్రాణాలు వదిలాడు?

Pages