వీరాజీయం

నువ్వెప్పుడూ మా కెప్టెన్‌వే ధోనీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేంద్రసింగ్ ధోనీ తన మూడువందల వండే ఇంటర్నేషనల్ పోటీలో 49 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, ‘కూల్’గా నవ్వుతూ యువ ఆటగాడు మానీష్ పాండేని అభినందిస్తూ పెవిలియన్ వైపు వస్తున్నప్పుడు క్రీడాభిమానులు, సహచరులు నీరాజనం పట్టారు. యాభై పరుగులు దొరకపుచ్చుకుంటే వంద అర్ధ సెంచరీల రికార్డు వచ్చేదే కానీ అది కాదు ముఖ్యం ధోనీకి. యువ ఆటగాడు పాండే ‘యాభయి’ చేస్తే అతనికి అది ఎంతో ఉపయోగంగా వుంటుంది కనుక అతనికే చివరి బంతిని వదిలేశాడు. అదీ క్రీడాస్ఫూర్తి, అదే నాయకుడి లక్షణం. 2004లో వండే ఇంటర్నేషనల్ పోటీలలో బంగ్లాదేశ్‌కి ప్రతిగా ఆట మొదలుపెట్టిన మహేంద్రసింగ్ ధోనీ ఆ మరుసటి సిరీస్ పాకిస్తాన్ మీద ఆడాడు. జులపాల జుట్టుతో చిత్రంగా, అతి చురుగ్గా వుండే ధోనీని చూసి మియా ముషారఫ్ మురిసిపోయాడు. 123 బంతుల్లో 148 పరుగులు అమిత వేగంగా సాధించాడు ధోనీ. మరోసారి శ్రీలంక మీద 145 బంతుల్లో 183 రన్స్ చేసి అందర్నీ అచ్చెరువు పరిచాడు. అప్పుడు అతడు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అయ్యాడు.
ఐదు, ఆరు లేదా ఏడో నెంబర్‌లో బ్యాటింగ్‌కి దిగి పరుగులు సాధించి జట్టును ఒక్క చేతిమీద గెలిపించిన ఘనత ఒక్క మహేంద్రుడికే ఉంది. నెంబర్ ‘సెవెన్’ ఆటగాడిగా బ్యాటింగ్‌కి దిగి సెంచరీ కొట్టిన మొనగాడు ధోనీ ఒక్కడే. అసలు ఒత్తిడి అంటే ఏమిటో ఎరుగని వాడు, చివరి బంతికి సిక్సర్ కొట్టి ప్రపంచ కప్పు తెచ్చినవాడు అజాత శత్రువే అయ్యాడు. మూడురకాల క్రికెట్‌లో కూడా అతనికి అతనే సాటి కాగా, తన టీములోని కుర్రాళ్లని వాళ్లకి కూడా తెలియకుండా ఆటలో మెలకువలు చెప్పి రాణింప చేయడం ఒక స్పెషాలిటీ. మన దేశంలో కపిల్ తరువాత ప్రపంచ కప్ తెచ్చి అందర్నీ ముగ్ధుల్ని చేసిన ఎమ్మెస్ ధోనీ ఫిట్నెస్ ఒక చిత్రం. వికెట్ల మధ్య సచిన్‌లాగా మెరుపు వేగంతో పరుగులు తీయడం అతనికే చెల్లు. అతని ప్రజారంజక శక్తి ఎంత ఎక్కువ అంటే-అతని జీవిత కథని సినిమాగా తీస్తే-అది బాక్సాఫీసు రికార్డులు అందుకుంది- అంతర్జాతీయ చలనచిత్ర పోటీలలో. అందులో ధోనీ వేషం కట్టిన రాజ్‌పుట్‌కి ఉత్తమ నటుడు అవార్డు కూడా వచ్చింది. ధోనీ ధోరణి ఎంత ఆదర్శంగా-నిమ్మకు నీరెత్తినట్టు వుంటుందో అల్లాగే అతని బాణీ కూడా అనితర సాధ్యం. ‘హెలికాప్టర్ షాట్’ అతనికే వుంది. అది జగత్ ప్రసిద్ధి గాంచింది. (రవిశాస్ర్తీకి ట్రేడ్‌మార్క్ చపాతీ షాట్‌లాగ).
లోగడ ఉమ్రీగర్ కాలం నుంచి కూడా కెప్టెన్‌గా వుండి, ఆనక మరొకరి కింద ఆడడానికి సీనియర్లు తెగ గింజుకునేవారు. తగాదాలు పడేవారు-సునీల్ గవాస్కర్‌కి, కపిల్‌కీ వున్న వైరం అందరికీ తెలుసు (ఇద్దరూ జగజెట్టీలే మళ్లీ) కానీ ధోనీ?. అతని స్టైల్ వేరు. ఆ రూటేవేరు. తనే టైము వచ్చింది అనుకోగానే దిగిపోయి యువ మ్యాజిక్ క్రికెటర్ అయిన విరాట్‌కి పగ్గాలు వొదిలేశాడు. నాయకుడిగా విజయ పరంపర సాధించిన పట్టుదలతోనే యువజట్టుకి చేదోడు వాదోడుగా, ప్రేరణగా నిలిచా డు. తాను వన్‌డేలు, ట్వంటీ ట్వంటీలు ఆడతానన్నాడు. అ ద్భుతమైన ఫిట్నెస్సు, టెంపర్‌మెంట్ వున్న ధోనీ- జింబాబ్వేకి మన కుర్రజట్టును తీసుకుపోయి వాళ్లని వజ్రపు తునకలుగా మార్చి తీసుకుని వచ్చాడు-గొప్ప మోటివేటర్!
మన తెలుగు వారి గొప్పతనం ఏమిటీ అంటే ఇవాళ ప్రవాస తెలుగువాడు రోహిత్ తప్ప తెలుగు వాడు టీమ్‌లోనే లేకపోయినా, చీఫ్ సెలక్టర్ ఎంఎస్‌కె ప్రసాద్ మనవాడు. ధోనీ గురించి ప్రసాద్ చెబుతూ- ఒకసారి ధోనీ వ్యాయామం చేస్తూ వుండగా-బరువులు ఎత్తే సమయంలో బరువొకటి అతనిమీద పడిపోయిందట. అపుడు పాకిస్తాన్‌తో ఆడవలసి ఉందట. ‘నేను ఒక్క కాలు తిన్నగా వుంటే కూడా దానిమీదే పాకిస్తాన్‌తో ఆడుతా’-అన్నాడట ధోనీ. కాకపోతే కాలక్షేపంగా కొందరు వేరే ఊసుపోక కొందరు స్పోర్ట్స్ క్రిటిక్స్-్ధనీ పని అయిపోయింది అని రాస్తూ వుంటారు. తనని డిస్కరేజ్ చేస్తూ ఉంటే ప్రతిసారి వాళ్ల మాటల్ని తీసి చెత్తబుట్టలో వెయ్యడం ధోనికి అలవాటే. చాలా దుందుడుకు ఆవేశపూరిత నైజం కోహ్లీది. కుంబ్లేతోనే పడలేదు కాని ‘్ధని భాయ్’ అంటే మహా ఇష్టం, మోజు. వరల్డ్ నెంబర్ వన్ బ్యాట్స్మన్ని నేను అన్న ఫీలింగు కూడా చూపెట్టడు.
‘హెలికాప్టర్ షాట్ ఇదిగో గురూజీ’ అంటూ సరదాగా బ్యాట్ తిప్పి చూపిస్తూ మరీ వచ్చి మహేంద్రునితో ప్రాక్టీసు చేస్తున్నాడు విరాట్. లోగడ క్రికెట్‌లో దిగ్గజాలున్నప్పుడు-గవాస్కర్ ‘నేను ఓపెనింగ్‌కి రాలేను మొర్రో విసిగిపోయాను నంబర్ నాలుగులో వస్తాను’ అంటే కపిల్‌దేవ్-‘నువ్వు ఓపెనింగ్ చేయాల్సిందే’నంటూ మొండిపట్టు పట్టేవాడు. అటువంటిది ఇవాళ, ‘కోహ్లి-్ధని శకం’లో గొప్ప క్రీడాస్ఫూర్తి పరస్పర ప్రేమాదరణలు పెరిగాయి. గ్రేట్!
‘లైమ్‌లైట్’ని సీనియర్‌కి ఇద్దాం అన్న వితరణ పరిఢవిల్లింది నేడు. శ్రీలంకతో నాలుగవ పోటీ అవంగానే మహేంద్రసింగ్ ధోనీ అందుకున్న కొత్త మైలురాళ్లని అందరూ సంబరంగా చేసుకున్నారు శ్రీలంకలో. ఇది చాలా అపురూపం. ఒక ‘ప్లాటినమ్ బ్యాట్’ని కానుకగా ఇచ్చి సత్కరించారు హీరోని. వీర విరాట్ అనిపించుకుంటున్న వాడు-టీము విజేత అయిన కోహ్లీ-మొహమంతా వెనె్నలై ఆనందం వెలిగిపోతూ వుండగా ‘మాలో తొంబయి శాతం మందిమి నీ నాయకత్వం కింద ఆడినవాళ్లమే, అలా మా కెరీర్లను తీర్చిదిద్దుకున్న వాళ్లమే’ నన్నాడు. ‘ఇవాళ నేను ఇంత కన్నా ఏమనగలను?-ఎప్పటికీ మా కెప్టెన్‌వి నువ్వే అంటాను’ అంటూ తన మాజీ నాయకునికి ప్రేమాస్పద కానుకని అందించాడు విరాట్. ఈ గొప్ప క్రీడాస్ఫూర్తి ఇలాగే కొనసాగాలని అందరూ కోరాలి, అన్నట్టు బ్యాటింగ్ కోచ్ బంగోరె సంజయ్ కూడా తెల్గువాడేనండోయ్. గత గురువారం అం దరి దృష్టీ, క్రికెట్ ఆడేవాళ్ల చూపు, ఆడించే బోర్డు దృష్టి, చూసే జనాలు వాళ్ల అందరి ఉత్కంఠ అంతా అక్కడే ధోనీమీదే-ఇండియా శ్రీలంక జట్టు నాల్గవ ఏక దివసీయ అంతర్జాతీయ పోటీ ఆడుతున్న కొలంబో మైదానం మీదే వున్నది. మనవాళ్లు కప్పుగెలిచేసుకున్నారు గాని, మన ‘మహీ’ (్ధరుడు)-మన ధోనీ-మైదానంలోకి ముచ్చటగా మూడు వందలో సారి-అరివీర భయంకరుడిగా (ప్రసన్నంగాను) దిగాడు...్ధనీ ధోనీ...అంటూ మధ్య మధ్య కోరస్‌గా లయబద్ధంగా జనం అరవడం- అది ఏ దేశంలోని మైదానం అయినా ఆనవాయితీ అయిపోయింది.
సరే, మనవాళ్లు కట్టలు తెగిన గంగానదీ వరదలాగ పరుగల దాడి చేసారు. చెరో సెంచరీ బాదుకున్నారు. కాని సచిన్ టెండూల్కర్ చేసిన ట్వీట్ ధోనీ జ్ఞాపకం పెట్టుకున్నాడు. ‘ఇది అద్భుత సమయం. నువ్వు అద్భుతంగా ఆడాలి సుమా’ అన్నదే అది. తన కేరీర్‌లో 29వ సెంచరీ సాధించిన విరాట్ ది గ్రేట్, 13వ శతకం బాదుకున్న రోహిత్‌దీ కూడా అదే కోరిక. ‘అలుగుట’, ’అలసిపోవుట’ రెండూ ఎరుగని కెప్టెన్ ‘కూల్’గా వాసికెక్కిన మహీ మొహానచెక్కుచెదరని చిరునవ్వు-‘కూల్’ ‘కూల్’-అఫ్కోర్స్, ఇంతకుముందు మన వాళ్లు సచిన్, ద్రావిడ్, అజారుద్దీన్, గంగూలీ యువరాజ్‌సింగ్‌లు 300వ మైలురాయి దాటినా-జట్టును కలసికట్టుగ పట్టి అట్టేపెట్టి గెలుపు దిశగా నడిపించిన అతి అపురూపమైన ‘్ధనాధన్’ ధోనీ సంగతి వేరు-మూడు అంతర్జాతీయ కప్పులు ఎత్తుకొచ్చిన క్రెడిట్ ఒక్క ధోనీకే ఉన్నా- ఎలాంటి గర్వం లేదు. నిజంగా మరో ప్లేయర్ అయితే- మానసికంగా ఎంతో ఒత్తిడితో వుండేవాడేమో గాని-చెరగని చిరునవ్వుతో-బాట్ పట్టుకుని క్రీజ్‌మీదకి దిగాడు ఎమ్మెస్ ధోనీ. పోయిన సారి మూడో వన్‌డే పోటీలోనే జనం గ్రౌండుమీదకి సీసాలు విసిరారు-శ్రీలంక ఓడిపోతున్నది అన్న దుఃఖంలో-కాని ధోని అక్కడే ఓ కునుకు తీసి లేచి గెలిచాడు. అదే జనం- దోనీ వైపు ఇవాళ వొళ్లంతా కళ్లు చేసుకుని చూడసాగారు. ఇక, అతను ఎప్పుడు వికెట్ల వెనక నిలబడ్డా, మెరుపు వేగంతో స్టంపింగ్ చేసేస్తాడు అన్న భయం బాట్ పట్టుకుని దిగిన ప్రతి బ్యాట్స్‌మెన్‌కీ వుంటుంది. అతను అప్పీలు చేసాడు అంటే దానికి తిరుగులేదు. కాని, ‘మహీ’ అని మిత్రులు ముద్దుగా పిలుచుకునే ధోనీలో ఎన్నడూ కోపం ద్వేషం చిరాకు కనపడవు. అతను మరో ప్రపంచ రికార్డు దగ్గర్లోకి వచ్చాడు. 99 స్టంపింగులు అతని జేబులో ఉన్నాయి. శ్రీలంక ఆటగాడు సంగాక్కరతో కలిసి అతను ప్రపంచ రికార్డు పంచుకుంటున్నాడు. అలాగే పోయినసారి మూడో వండే పోటీలో ధోనీ ఆ దృష్టితోకాక తన టీము గెలుపు దృష్టితోనే ఆడాడు (అలవాటు మరి). ఆచి తూచి ఆడడంలో అతనే అందరికీ ఆదర్శం అంటారు. అలాగే ఆడి అతి క్లిష్ట సమయంలో 42 బంతుల్లో అయిదు ఫోర్లు ఒక సిక్సర్‌తో అజేయంగా నిలిచి టీముని కప్పు కైవసం చేసుకునే దిశలో నడిపించడమే కాక, తన నాటౌట్ల రికార్డును 73కి తిరగరాసాడు. ధోనీ డి.ఆర్.ఎస్ అడిగాడు అంటే దానికి ‘తిరుగులేదు’ అన్నది నానుడి. ఇప్పుడు ‘్ధని రివ్యూ అప్పీలు’ అని ఓ కొత్తపేరు కూడా పెట్టేశారు.
ఇవ్వాళ, ధోనీ వన్‌డే ఇంటర్నేషనల్ పోటీలలో 73 నాటౌట్లతో నంబర్ వన్‌గా 300 మాచెస్ (9625) ఆడి మడమ తిప్పని వీరుడై నాటౌట్ సూర్యునిగా ప్రకాశిస్తున్నాడు. అతని రికార్డులు అందరికీ తెలుసు. రేపటి రికార్డులేమిటి? అన్నది అందరికీ ఆశ. కక్షలు, కావేశాలు, ఈర్ష్య, ద్వేషం, అసూయ లాంటి అవలణాలతో ఒకవైపు-మరోపక్క కా సుల వర్షం కురిపించే హమేషా తమాషా క్రికెట్. అందులోనూ ‘వనే్డ’ పోటీలు మరీ గొప్పవి. పాపం శ్రీలంక మునిగింది. కర్ణుడి చావుకు ఎన్ని శాపాలో అన్ని కారణాలున్నా యి- వాళ్ల పేలవమైన ప్రదర్శనకి. అది అట్లుండనిండు.
లాంగ్ లివ్ ది స్పిరిట్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్ అండ్ స్పోర్ట్స్‌మన్ షిప్!
*

veeraji.columnist@gmail.com