వీరాజీయం

ఆవు వేషంలో వస్తే అడిగినంత చికెన్! (వార్త- వ్యాఖ్య)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆవుకు పూజలు చేసే దేశంలో ఆ సాధు జం తువు రాజకీయాల విషవలయంలో చిక్కుకుంది తెలుసుగా? ఓ మూల తింటే తంతారు, మరో మూ ల తినకపోతే కొడతారు. కానీ అమెరికా దేశం మొన్న పదకొండున ఆవుల సం బరం జరుపుకున్నది. ఆ రోజు ‘చికెన్ ఫిల్’ అం తర్జాతీయ హోటేలు వారు అమెరికాలో దేశవ్యాప్తంగా వాళ్ళ రెస్టారెంటులలో అడిగినంత చికెన్ విందు భోజనంలో ఉచితంగా వడ్డించా రు. అయితే భోజన ప్రియులు ఆవుల్లాగా అంటే ఆవు వేషంలో రావాలి. దీంతో సం దడిగా పదిలక్షలమంది ఆవు (దుస్తులు ధరిం చి) ప్రేమికులు బిల బిలా విచ్చేసి కోడిమాంసం (చికెన్ అనాలి) కూరని మక్కువగా మెక్కారు.
ఒక కుటుంబ యజమాని చెప్పాడు- ‘దర్జీ దగ్గరికి మా ఫ్యామిలీ మొత్తం పోయి ఆవు ముసుగుల అంటే మాస్కులు- చివరికి గిట్టళ్లులాంటి బూట్లు అన్నీ సమకూర్చుకుని చిక్ ఫిల్ వారి ఉచిత విందుకి తరలి వెళ్లాం. ఆ మాటకొస్తే కోడి వంటకాలే విందుతో ఉచితమే గాని- కొన్న చిక్‌ఫిల్ హోటల్స్‌వారు టి షర్టులు మాస్కులు వగైరా కూడా అమ్మేరు. దేశ వ్యాప్తంగా ఆవు టీషర్టు డిజైన్‌ల పోటీ జరిగింది. ఇది అమెరికాలో పదమూడవ గోవాత్సల్య దినోత్సవం. ఆవులమీద అనురాగం ముద్దు గట్రా ప్రదర్శిస్తూ జరిగింది. గో షర్టు (టి షర్టు) పోటీకి అట్లాంటాలోని ప్రధాన కార్యాలయానికి ఎనభై డిజైన్లు అందాయి. మూడు వేలమంది వోటర్లు (దీనికో అర్హత వున్నది) మూడు డిజిన్లను ఎంపిక చేశారు. పెనె్సల్వేనియా నుంచి మార్నివాన్గోరవ్, జార్జియా నుంచి జోనేల్ విల్సన్, కెంటక్కి నుంచి ‘లోరెనటైరా’లు పంపిన డిజైన్లు ఫైనల్సుకి రాగా- శ్రీమతి జోనేల్ విల్సన్ రెండు వేల డాలర్ల బహుమతి చిక్ ఫిల్ వారినుంచి అందుకున్నది. కోట్లకొద్దీ ‘ఆవు ఉడుపు’లు హాట్ చికెన్‌లాగా అమ్ముడుపోయాయి. కాని కోళ్ళు ఎక్కడా మిగలలేదు. ఆవుమీద కోట్లాది అమెరికన్లు చిక్‌ఫిల్ హోటలు ఉచిత కోడి కూర మరి లేకుండా చేసేస్తున్నారని వార్త. ఇంతకీ ఆవులకి ఇష్టమైన గడ్డి ది చికెన్ కాదే? అనడిగిందో కొంటెపిల్ల. అందుకే వాటికి గడ్డి పెట్టి బాగా తినిపించి పాలు పిండుకున్నారు.. మొత్తానికి ఆవు పండుగ కోడి చావుకి వచ్చింది.

ఆఫీసులో హెల్మెట్స్ ధరించి తీరాలి!
మోటారు సైకిలుమీద హెల్మెట్ ధరించకపోయినా ఫర్వాలేదుగాని ఈ బిడివో కార్యాలయంలో కుర్చీలో కూర్చుని పని చేసుకుంటున్నప్పుడు కూడా హెల్మెట్ ధారణ కావాలి లేదా బుర్ర రామకీర్తన పాడవచ్చు. పాట్నాకి నూట యాభై కిలోమీటర్లదూరంలోనే వున్న మొతీహరిలోని అరెరాజ్ బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసులో గుమాస్తాలు ఆఫీసర్లు అంతా హెల్లెట్లు పెట్టుకుని మాటిమాటికి పైకప్పు కేసి చూస్తూ, అక్షరాలా ప్రాణాలు గుప్పిట పెట్టుకుని పని అంతంత మాత్రంగా చేస్తున్నారు.
పైకప్పు నుంచి పెళ్లలు పెచ్చులు ఉండుండి ఊడి పడిపోతున్నాయి. రెండేళ్ళ క్రితమే ఈ కచేరి భవనం ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చునని ఇంజనీర్లు చెప్పారు. అప్పటినుంచి మహజర్లు అప్పీళ్లు ఎన్ని పెట్టుకున్నా వేరే చోటు ఇవ్వబడలేదుట. వాన కురిసిందా ఫైళ్ళమీద గొడుగులు కప్పాలి. సిబ్బంది ఇబ్బం ది గురించి బ్లాక్ డెవలప్‌మెంట్ బాసు నిర్లక్ష్యం చేస్తున్నాడంటారు అంతా. కాని ఆయన కూడా ఓ హెల్మెట్ సంపాదించుకున్నాడు. పెచ్చులు ఊడిపడి మా తలలు పెచ్చులు ఊడిపోతున్నా యి, బొప్పికడుతున్నాయి మహాప్రభో! అంటూ స్ట్ఫా గడుసుగా ఒక వీడియో లాగించి ప్రెస్సువారికి లీకు చేశారు. తీగ లాగితే డొంక కదిలింది. ఈ భూత బంగళా ప్రక్కనే విఖ్యాత శివాలయం ఒకటి వుంది. వాన పడ్డప్పుడు ఆలయ భక్తులు కూడా ఈ కార్యాలయం వరండాలోకి నెత్తిన కొంగేసుకుని పరుగులు తీస్తూ వుంటారు. హెల్మెట్ ధరించండి భక్తులారా? అంటూ నవ్వుతూ వుంటారు సిబ్బంది. మొత్తంమీద ప్రక్కన గల కృషి భవనంకి కొంత, మరికొంత ఒక కమ్యూనిటీ హాలుకి మొన్న సోమవారం షిఫ్టింగ్‌కి కొబ్బరికాయ కొట్టి మరీ మొదలుపెట్టారు. పరాయి పంచని తల దాచుకోక తప్పలేదు పాపం సిబ్బందికి. షరా మామూలే. ఆర్‌టిపిఎస్ సిబ్బందిలోని నలుగురికి షోకాజ్ నోటీసులు అందాయి. మీరు మేము వుండగా మా దగ్గరికి రాకుండా పత్రికలకి, చానల్స్‌కి ఎక్కుతారా అని. ప్రెస్సుకి ఎక్కితేగాని శిథిల భవన దుఃఖగాథ అధికారుల చెవికి ఎక్కలేదుగా?

-వీరాజీ