S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరాజీయం

10/30/2017 - 00:42

చిన్నప్పుడు, స్కూలులో ప్రార్ధన సమయం చివర, ఒక పాట పాడేసి క్లాసులోకి పరుగులు తీసేవాళ్లం, అది ఇలా సాగేది. ‘‘ మాతా నమో హిందూ మాతా -సుజాతా నమో జగన్మాతా!విపులహుమద్రులే వేణీ భరముగా, గంగా యమునలే కంఠహారముగా-... గోలకొండ నీ రత్న కోశమట, తాజ్‌మహల్ నీ ‘దివ్య’ భవనమట..కోహినూరు నీ జడలో పువ్వట... ఆహాహా నా భాగ్యము నేమనందు? మాతా..’’

10/23/2017 - 00:30

పోయిన వారం, ప్రధాని మోదీ గారు తన నియోజకవర్గం అయిన వారణాసిలో పర్యటన చేస్తూ ఒక గ్రామీణ మరుగుదొడ్డి నిర్మాణానికి-పునాది రాయి శాస్త్రోక్తంగా వేశాడు. తన వెంటన్ సిరి అన్నట్లు ఆయన వెనుక గ్రేట్ శ్రీమాన్ యోగీజీ-గవర్నర్ యుపి కూడా తన ముందు నడవగ సంరంభంగా వచ్చారు మన ప్రధాని-ఇక్కడ రాబోయే టాయ్లెట్‌కి వాళ్లు నామ ఫలకములు తగిలిస్తూ- ‘‘ఇజ్జత్ ఘర్’’ నిర్మాణం అని ఆర్భాటంగా పేర్కొన్నారు.

10/16/2017 - 01:03

రోడ్లన్నీ గండ్లమయం కాగా, ప్రజాజీవితం ముఖ్యంగా రైతు బతుకు కడగండ్ల పాలైంది. తొందరగా వచ్చేసింది దివ్య నవ్య భవ్య దీపావళి అంటూ ప్రధాన మంత్రి దగ్గరనుంచి పాపాయిల దాకా మురిసిపోయిన దీపావళి చప్పుళ్లు లేని పండుగ అయిపోతోంది. రాజధాని ఢిల్లీలో అస్సలు టపాసులు అమ్మరాదు అన్నది సుప్రీంకోర్టు. అయ్యా! బాబూ!

10/09/2017 - 00:46

సంచలనం అంటూ ఉంటారు మా వాళ్లు. ఇదో ఊత పదమే కాదు- వార్తకి వూతం కూడాను. అదే లేకపోతే, అది ఏ మీడియా అయినా దానికి పలుకుబడి ఉండదు.

10/01/2017 - 23:35

మనం అంతగా పట్టించుకోము కాని, క్రికెట్ మైదానంలో ఆడుతున్న 11 మంది మీదే వుంటుంది మన దృష్టి. కానీ మరో ఇద్దరు అక్కుపక్షిగాళ్లు ఉంటారు. వాళ్లకి మెయిన్ అంపైర్, లెగ్ అంపైర్ అని నామధేయాలు. అవి ఓవర్ ఓవర్‌కీ తారుమారవుతుంటాయి గాని-వాళ్లకి ఇస్తున్నది అక్షరాలా నిలువుజీతం. ఆఖరికి మోకాళ్లమీద కూడా కూర్చునే చాన్సు వుండదు పాపం.

09/25/2017 - 00:49

‘కమలహాసనా..రావయ్యా.. మా భాగ్యం కొద్దీ దొరికావయ్యా..’ అంటూ అడుగులకు మడుగులొత్తుతారేమోనని వోయబ్బో ఇంచుమించు ఏప్రిల్‌నుంచి ఫీలర్లు, ట్వీట్స్, కామెంట్స్ లాంటివి ఒగ్గుతూ ఫీట్స్ చేస్తున్న దూకుతా...దూకుతా అన్న కమలహాసన్ దూకేశాడు..! కమల్ ది గ్రేట్ కొత్త పార్టీ పెడతాడట.

09/18/2017 - 01:03

నువ్వు లక్ష చెప్పు, వెయ్యి చెప్పు-ఇస్ర్తికి గౌరవం ఉంది- ఇస్ర్తి లేకుండా- స్వచ్ఛ్ భారత్ సేవకులు కూడా చీపురు పట్టరు మన వూళ్లో- అది ఏ వూరైనా కావచ్చు. టిఫిన్ సెంటర్లు ఎన్ని వుంటాయో అన్ని ఇస్ర్తి కార్నర్లు వుండాల్సిందే... ఇస్ర్తి దొరకని ఊరు- మిర్చీ బజ్జీ లభించని పేట- వుండకూడదు సుమా...‘మొబైల్ లేని చేయి, జీన్ తొడగని కాలూ వుండొద్దోయ్ ఉండొద్దు’. జీన్ మగా ఆడా అనే తేడా చూడదు. ఏకాలుకైనా ఎక్కుతుంది.

09/13/2017 - 23:31

చెప్పు తినెడు కుక్క చెరుకు తీపి ఏమి ఎరుగురా? అన్న యోగి వేమన్జీకి ఏనుగులు మాత్రమే చెరుకు రుచిని మరిగిన జంతువులూ అని నమ్మకం ఉందేమో కాని, కలికాలం వచ్చింది. కుక్కలు పందులు స్వైర విహారం చేసే చెత్త గుట్టల్లో పశ్చిమ బెంగాల్‌లోని బోమఖడి అడవికి దగ్గరగా వున్న నగర శివారుకు ఏనుగులు చెత్త కంపుని ఆఘ్రాణిస్తూ వచ్చి పెంట కుప్పలను కుమ్మి ప్లాస్టిక్ మూటలో సహా అమిత మక్కువగా అక్కడి చెత్తని ఆరగించేస్తున్నాయి.

09/10/2017 - 22:41

దాదాపు వేయి ఎకరాల్లో అదో ఇంద్రలోకం.. మాయల పకీరు గుర్మీత్ రాం రహీమ్ నిర్మించిన భూమిమీదే పాతాళ మాయాలోకం చూస్తున్నాము.. ‘బాబా’ అనే పవిత్రమైన మాట.. కొన్ని కోట్ల మంది ఉపయోగించే పదాన్ని ఈ నరరూప రాక్షసునికి పేరు చివర వాడడం ఇష్టం లేదు. అందుకనే డేరా గుర్మీత్గానే వ్యవహరిద్దాము. వృకాసుర బకాసుర భస్మాసుర హిరణ్య కశిప లాంటి మాటలేవీ ఈ మాయల పకీరు దుష్ట భోగ భాగ్యాదులకు చాలవు.

09/06/2017 - 23:39

గత నవంబర్ 8నాడు కేంద్ర ప్రభుత్వం వెయ్యి, ఐదువందల కరెన్సీ నోట్‌లమీద వేటువేసిన తరువాత- రోడ్లమీద వేసే టోల్‌గేట్ సుంకం ఒక మూడు వారాలు ఎత్తేశారు కేంద్రంవారు. టాక్స్ కట్టాలంటే చెల్లని పైసలే గాని తంతే మరో దమ్మిడీ ఎవరి దగ్గారా లేదుగా.. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు- మహారాష్టల్రో కూడా గవర్నమెంట్ మొత్తం 53 టోల్‌గేట్ వసూలు చేసే ప్లాజా సెంటర్స్ టోల్‌గేట్లు ఎత్తేసింది.

Pages