S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

02/28/2016 - 07:25

జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ జిన్నా యూనివర్సిటీగా మారింది. అక్కడ అల్లా హో అక్బర్ నినాదాలిచ్చే విద్యార్థులు కనబడుతన్నారు. రాహుల్ గాంధీ కూడా వారితో కలిసిపోయారు. అఫ్జల్ గురుకు అనుకూలంగా నినాదాలిస్తున్న వారిలో రాహుల్ గాంధీ కలవడం విమర్శలకు తావిచ్చింది. అఫ్జల్ గురుపై ఎనిమిదేళ్ల విచారణ తరువాత ఉరిశిక్ష వేసింది తమ ప్రభుత్వమేనన్న యింగితం కూడా ఆయనకు లేకుండా పోయింది.

02/26/2016 - 23:40

‘విద్య’ వినయాన్ని పెంచి, ఆలోచనాశక్తినీ, వివేకాన్నీ, విచక్షణా జ్ఞానాన్నీ రేకెత్తిస్తుందనీ, ‘విశ్వవిద్యాలయాలు’ విజ్ఞాన కేంద్రాలనీ ఒకప్పటి భావన. చాలా కాలం క్రిందటే ఆ భ్రమలు తొలగిపోయినప్పటికీ- ఏదో ఆశ. ఇప్పుడు విశ్వవిద్యాలయాలు రాజకీయ కేంద్రాలు. కుల విద్వేషాలకీ, మత రాజకీయాలకీ ప్రధాన కేంద్రాలు.

02/26/2016 - 06:15

మేం అధికారంలోకి రాగానే నిజాం సుగర్స్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని చక్కెర కర్మాగారంపై ఆధారపడిన రైతులు, కార్మికుల జీవితాల్లో వెలుగు ప్రసాదిస్తామన్న టిఆర్‌ఎస్ పార్టీ, ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చలేదు. కార్మికుల పొట్టకొట్టింది. కార్మికులు, ఉద్యోగులు నిజాం దక్కన్ సుగర్స్ లేఆఫ్‌ను వెంటనే ఎత్తివేయాలని ఆందోళన బాట పట్టారు. తెలంగాణ ప్రభుత్వానికి ఈ సమస్య సవాల్‌గా మారింది.

02/26/2016 - 06:14

అయ్యదేవర కాళేశ్వరరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మొట్టమొదటి స్పీక ర్. తొలితరం నేతలు కాశీనాథుని నాగే శ్వరరావు, కొండా వెంకటప్పయ్య, టం గుటూరి ప్రకాశం పంతులు కాగా మలి తరం నేతల్లో డాక్టర్ పట్టాని సీతారామ య్య, అయ్యదేవర కాళేశ్వరరావు, బులుసు సాంబ మూర్తి మొదలైన వారు ముఖ్యులు. కాళేశ్వరరావు 1881, జనవరి 22న కృష్ణాజిల్లా నందిగామలో జన్మించారు.

02/25/2016 - 00:20

విదేశీ పెట్టుబడులుకోసం నేడు భారత్ ఎదురుచూస్తోంది. నేటి ప్రభుత్వం వివిధ దేశాల బహుళ కంపెనీలు భారత్‌కు రావాలని ఆశిస్తోంది. కేంద్రం దారిలోనే తెలుగు రాష్ట్రాలు విదేశీ కంపెనీలకు ఆహ్వానం పలుకుతున్నాయి. ఇదంతా చూస్తుంటే 150 సంవత్సరాల క్రితం చరిత్ర పునరావృతానికి దారితీస్తోందనిపిస్తోంది. దేశం అభివృద్ధి చెందాలి. నిరుద్యోగ సమస్య తొలగాలి. అందరికీ విద్య అందాలి. రైతులో ఉత్సాహం పెంపొందించాలి.

02/25/2016 - 00:18

విద్య సామాజిక ప్రక్రియ. సమాజంలో ప్రతి ఘడియన మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయ. ముఖ్యంగా సాంకేతిక యుగంలో నూతన ఆవిష్కరణలు ఎంతో వేగంగా వస్తున్నాయి. అవి ప్రజలకు అందుబాటులోకి వుండడానికి సాంకేతిక రంగం కూడా దానికన్నా ఎక్కువ వేగంగా వ్యాపించాలి. అప్పుడే అవి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. విద్యారంగం ఒక ఎడతెగని ప్రవాహం. ప్రతి దేశంలో కూడా సంస్కరణలు అనేవి నిరంతరం జరిగే ప్రక్రియ.

02/24/2016 - 06:50

ఈ నెల 9న జెఎన్‌యులో అఫ్జల్ గురు వర్ధంతి కార్యక్రమాన్ని ఎఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, ఐఏఎస్‌ఏ లాంటి వామపక్ష విద్యార్థి సంఘాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా దేశ వ్యతిరేక నినాదాలతో వీరు హోరెత్తించారు.

02/24/2016 - 06:49

ప్రపంచంలో ఏ దేశంలోను లేని విధంగా అనేక పురస్కారాలు లభిస్తున్నాయి మన భారతదేశంలో. భారతరత్న మొదలుకొని అర్జున్, ద్రోణాచార్య, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఇలా పురస్కారాలు ప్రదానం చేస్తుంది మన ప్రభుత్వం. మన దేశాన్ని రేయింబవళ్లు కంటికి రెప్పలా కాపాడే జవాన్లకు యిచ్చే ‘అశోకచక్ర’, ‘శౌర్యచక్ర’, ‘పరమవీర చక్ర’లాంటి పురస్కారాలలో మాత్రం నిజాయితీ, గుర్తింపు, గౌరవం వుందని భావించవచ్చు.

02/23/2016 - 05:32

చాలా ఆలస్యంగానైనా మానవ హక్కులకోసం ఆక్రమిత కాశ్మీర్ వాసులు స్పందించడం ప్రపంచ మానవ హక్కులను ప్రశ్నిస్తున్నది. ప్రపంచ మానవాళిక ఈ విచక్షణ ఒక కొరడా దెబ్బలాంటిది. పాక్ ప్రభుత్వ నియంతృత్వ ప్రజాపాలనపై మానవతావాదులు ఏనాడు సై అన్నది లేదు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. పాక్ ప్రభుత్వ ఉక్కు కౌగిలినుండి తమకు స్వేచ్ఛను ప్రసాదించాలని ఏనాటినుండో అక్కడి ప్రజలు కోరుకొంటున్నారు.

02/22/2016 - 02:24

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీలకు కొదవ లేదు. ప్రతి పార్టీకి ఆశయం ఒకటి వున్నది. కాని ప్రజలకు చేరువగా వుండి ప్రజల నిత్యజీవన సమస్యలు పరిష్కరించగలిగిన నాయకులు కరువయ్యారు. ప్రజల సమస్యలు పరిష్కరించి ప్రజల జీవనం సుఖమయం చేయటం రాజకీయ పార్టీల కర్తవ్యం. ఆ విషయాన్ని ప్రక్కనపెట్టి తమ స్వార్థమే పరమార్థంగా భావించే నాయకులే ఆయా పార్టీలలో మెండుగా వున్నారు.

Pages