S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

04/29/2016 - 23:42

అంతర్జాతీయంగా,మత్తు పదార్థాలకు మనదేశం అతి పెద్ద వాణిజ్య కేం ద్రంగా మారింది. గంజాయి, నల్లమందు, గుడుంబా, హెరాయిన్, కొకైన్, చరస్ పేర్లు ఏవైనా వాటికి యువత బానిసలుగా మారిపోతున్నారు. మాదక ద్రవ్యాలు ఉత్పత్తి, క్రయ విక్రయాలు, రవాణా, వాటి వాడకం పెచ్చుమీరి అదో పెద్ద వ్యాపార రంగంగా ఆవిర్భవించి మాదక ద్రవ్యాల మాఫియా దేశంలో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతుందంటే ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు.

04/28/2016 - 23:34

నీతి, నిజాయతీలకు మారుపేరు ఆయన. తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేసిన మహానుభావుడు. రాజకీయాల విలువలకు పెద్దపీట వేసి, ప్రజాపోరాటాల్లో పాల్గొన్న చైతన్యశాలిగా గుర్తింపు పొందారు. స్వాతంత్య్ర సమరయోధునిగా, ఉత్తమ శాసనసభ్యునిగా, గ్రంథాలయోద్యమ సారథిగా, రాష్ట్ర తొలి అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఎనలేని కీర్తిని పొందిన వావిలాల గోపాల కృష్ణయ్య ఎందరికో ఆదర్శంగా నిలుస్తారు.

04/28/2016 - 23:32

విద్యార్థులకు విద్యనందించడానికి, విద్యావ్యాప్తికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యేటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా ఆశించిన ఫలితం లభించడం లేదు. అన్నిరకాల సౌకర్యాలతో పాఠశాలలు నిర్వహిస్తున్నా, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి విద్యార్థులకు అందిస్తున్నా, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య నానాటికీ తగ్గిపోతున్నది.

04/28/2016 - 03:45

ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల పేదరోగులకు మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడంకోసం నిర్దేశించబడిన విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆస్పత్రిని ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి అప్పగించాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అహేతుకం. ఈ పథకానికి అంకురార్పణ చేసిన వై.యస్ తర్వాత వచ్చి ప్రభుత్వాలు విమ్స్ నిర్మాణంపై చిత్తశుద్ధి చూపించలేదు. 17 సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలను 8 విభాగాలకు కుదించేసారు.

04/28/2016 - 03:43

ఎమర్జెన్సీ రూపంలో చుట్టూ కమ్ముకొచ్చిన కారుచీకటిలో బతికే హక్కుకోసం కనీసం సుప్రీంకోర్టు గుమ్మం కూడా తొక్కడానికి వీల్లేదని సాక్షాత్తు సర్వోన్నత న్యాయస్థానమే చారిత్రక తప్పిదానికి పాల్పడిన దుర్దినానికి నేటితో సరిగ్గా నలబై ఏళ్లు నిండాయి.

04/28/2016 - 00:36

మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట స్కూల్లో తరగతి అయిపోయాక నారాయణ అనే విద్యార్థిని పిలిచాను. తరగతిలోని పిల్లలంతా విద్యార్థి నారాయణ, నా ముఖం చూశారు. నారాయణ అంటే స్కూలంతా హడల్. ఎవరైనా అతనిని ఎదిరిస్తే తెల్లారేవరకు వాళ్ల చెంపలు లావు అవుతాయి, లేకుంటే కాలో, చెయ్యో ఇరుగుతది. అందుకే నారాయణ అంటే పిల్లలకు, పంతుళ్లకు కూడా హడల్! అతను వస్తుంటే పక్కకుపోతారు. ఇంతకు నారాయణ చదివేది 9 తరగతి.

04/26/2016 - 23:32

మన తెలుగు భాష కూడా అతి త్వరలో మృతభాషల్లోకి చేరిపోతూ ఉందని యునెస్కోవారు ప్రకటించగానే తెలుగు తెలిసిన ప్రతివారూ ఆందోళన చెం దుతూ ఉన్నారు. పుండుమీద కారం చల్లినట్లు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళ, మలయాళీలు వారి భాషకు పట్టం కట్టటం మరింత బాధిస్తూ ఉన్నది. అయితే నిజానికి వారి భాషకు వారు పట్టం కట్టిందెక్కడ. అంటే నామ ఫలకాలలో మాత్రమే అని నాకు అర్థం అయింది.

04/26/2016 - 23:30

ఐదు కోట్ల గ్యాస్ కనెక్షన్లను ప్రధానమంత్రి ఉజ్వల యోజన పేర పేదలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక మంత్రిత్వశాఖ స్పందించి రెండు వేల కోట్లను ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయించింది. మరో రెండేళ్ళు ఈ పథకం క్రింద 6వేల కోట్లను ఖర్చుచేయనుంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన డిపాజిట్ లేని వంట గ్యాస్ పథకం. స్టవ్, రెగ్యులేటర్, సిలెండర్లు సొమ్మును విడతలుగా చెల్లించే సదుపాయాన్ని కూడా కల్పించారు.

04/25/2016 - 23:35

ప్రమాదం చెప్పిరాదన్నది నగ్న సత్యం. అయితే రహదారి ప్రమాదాల దుర్ఘటనలు రోజురోజుకు పెచ్చుపెరిగిపోతున్నాయి. నిర్జీవ దేహాలు, నెత్తురోడుతున్న రహదారులు, క్షతగాత్రుల హాహాకారాలు మానవత్వమున్న గుండెల్ని పిండేస్తున్న దృశ్యాలు నిత్యకృత్యమయ్యాయ. అతివేగం, ఆపై వాహనాలు నడిపేవారు మద్యం సేవించి వాహనాలను నడపడం రెప్పపాటులో ప్రమాదం జరిగి మృత్యువుపాలవుతుండడం ఈనాటి సంఘటనలు.

04/25/2016 - 07:09

ప్రస్తుతం మన దేశంలో ప్రభుత్వ ఖజానా పరిస్థితి ‘కంచె చేనుమేస్తే...’ అన్న చందాన మారింది. ప్రభుత్వ ఖజానాలో జమ అయ్యే సొమ్ము అంతా ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిందే. ఈ ప్రజల సొమ్ముకు కాపలాగా ఉండి, అవి సక్రమంగా అభివృద్ధి పనులకు వినియోగించేలా చూడాల్సిన గురుతర బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది. అటువంటి ప్రజాప్రతినిధులు నేడు వేతనాలు, అలవెన్సుల రూపంలో లక్షలాది రూపాయల ప్రజాధనం పొందుతున్నారు.

Pages